Wednesday, September 1, 2021

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ

 




చిత్రం :  మూడుపువ్వులు-ఆరుకాయలు (1979) 

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  బాలు 


పల్లవి :



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం భజేహం భజేహం


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ  

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ

నమో వజ్రకాయ నమో భక్తగేయ 

నమో వజ్రకాయ నమో భక్తగేయ

నమో దివ్యమహిమాప్రమేయ 

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 1 :



శ్రీమన్మహా మంగళాకార

త్రైలోక్య మందార 

దుష్టారి సంహార 

శిష్టాత్మ సంచారా

సంసార పంకమ్మునందున్న మమ్ముద్ధరించంగ 

మా శోకదావానల జ్వాలలార్పంగ వేవేగ రావయ్య శ్రీ ఆంజనేయ


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 2 :



కన్నాము సామీరి... కన్నాము స్వామీ 

ప్రసన్నమ్ము నీ మోము కన్నామయ్యా

కోటి పుణ్యాలు పండించుకొన్నామయా …. 

ఏమి వక్షమ్ము...  శ్రీరామ పక్షమ్ము, 

దాక్షిణ్య దక్షమ్ము...ఆర్తాళి రక్షమ్ము... సాకార మోక్షమ్ము

మా వీక్షణమ్ముల్ కృతార్థమ్ములాయెన్ గదా

 

దైవ భక్తాగ్రగణ్యా! 

అగణ్యమ్ము నీ కీర్తి... మాన్యమ్ము నీ మూర్తి 

ధన్యమ్ము ధన్యాతిధన్యమ్ము మా జన్మజాతమ్ము వాతాత్మజ...  ఆంజనేయా 


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయ కరుణించవయ్యా వీరాంజనేయ


చరణం 3 :


ఎన్నెన్ని ప్రాంతమ్ములెన్నెన్ని దుర్గమ్ములెన్నో అరణ్యమ్ములెన్నో గిరీంద్రమ్ములెన్నాళ్ళు శోధించి శోధించీ….

క్షేత్రాలు దర్శించి తీర్థాలు సేవించి మంత్రాలు వల్లించి తంత్రాలు ఛేదించి ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ….

వీక్షించినామయ్య నీ భవ్య రూపమ్ము, సారించవేమయ్య నీ దివ్య తేజమ్ము…..

కుప్పించి లంఘించి అంబోధులన్ మించి ఆకాశ పర్యంత సంవర్ధివై ఉగ్రతాస్ఫూర్తివై…

చండ భానుచ్ఛటా మండితాఖండ శక్తిప్రపూర్ణుండవై సాగిరావయ్యా…

నా ఆత్మపీఠంబుపై నీ ప్రతిష్ఠార్థమై వేచి ఉన్నానయా….

రక్షమాం రక్షమాం చేరరావా...  అఖర్వప్రభావా ! 

అపూర్వానుభావా! అహో ఆంజనేయా!

రామ్! రామ్!...  ప్రసన్నాంజనేయా ! 

రామ్! రామ్!...  సువర్ణాంజనేయా…. ఆ….


నమస్తే… నమస్తే…. నమస్తే….. నమః



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8352

No comments:

Post a Comment