చిత్రం : పెళ్ళీడు పిల్లలు (1982)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
పరువపు వలపుల సంగీతం
ఉరకలు వేసే జలపాతం
పరువపు వలపుల సంగీతం
ఉరకలు వేసే జలపాతం
పరుగులు తీసే....అనురాగం
దానికి లేదే... ఆటంకం
పరుగులు తీసే... అనురాగం
దానికి లేదే... .ఆటంకం..
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
చరణం 1 :
లైలా..ఆ... ఆ.. ఆ..
లైలా..ఆ... ఆ... ఆ
మజునూ... ఊ.. ఊ.. ఊ..
మజునూ... ఊ.. ఊ.. ఊ
లైలా మజును దేవదాసులా కాలం చెల్లిపోయిందీ
జులీ..బాబీ..లవ్... నిలిచేకాలం వచ్చింది
నువ్వూ నేనూ ఒకటై... వెలిగే కాలం వచ్చింది
పరువపు వలపుల సంగీతం
ఉరకలు వేసే జలపాతం
చరణం 2 :
పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ
పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ
పెద్దలు ప్రేమకు అడ్డంపడితే... పిన్నలు పాఠం చెపుతారు
మనసులేకమై నిలుచువారలకు చేతికందగలదాకాశం
గడుపుమాని ముందడుగు వేయమని... యువతరానికిది సందేశం
పరువపు వలపుల సంగీతం
ఉరకలు వేసే జలపాతం
పరుగులు తీసే...అనురాగం
దానికి లేదే...ఆటంకం
పరుగులు తీసే...అనురాగం
దానికి లేదే...ఆటంకం..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12820
No comments:
Post a Comment