Showing posts with label పెళ్ళీడు పిల్లలు (1982). Show all posts
Showing posts with label పెళ్ళీడు పిల్లలు (1982). Show all posts

Thursday, September 30, 2021

ముసిముసి నవ్వుల రుసరుసలు




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : శ్రీశ్రీ  

నేపథ్య గానం :   సుశీల 




పల్లవి :


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


నడివయసులో శృంగారం... నడివయసులో శృంగారం

ఆ వెలుగు నీడలే సరసాలు

ఆ వెలుగు నీడలే సరసాలు  


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు



చరణం 1 :


పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

ఆలూమగలూ రాజీ పడితే ఎంతో సింగారం  

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరుచిరు అలకలే సరదాలు



చరణం 2 :


సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు

సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు


సన్నజాజులది చల్లదనం

సంపెంగ పూలది వెచ్చదనం

సంపెంగ పూలది వెచ్చదనం

కోపం తాపం... రాజీపడితే ఎంతో సింగారం

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల.. రుసరుసలు  

చిరుచిరు అలకలే సరదాలు

మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహు..మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహూ



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12821

వయసే వెల్లువగా

 



చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : శ్రీశ్రీ

నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


వయసే వెల్లువగా..ఆ... ఆ

వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా


వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

మనసు నేడే కలత తీరి... ఊగిందిలే ఉయ్యాలగా


చరణం 1 :


చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ

చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ


వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు

వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు.. 

చెలిమి నిండి కలలు పండి... చేరాలిలే చేరువగా


వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా



చరణం 2 :


మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా

మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా


హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

గులాబీలే గుభాళించె... మురిపించెలే దీవెనలై



వయసే వెల్లువగా... ఆ.. ఆ

వలపే వెన్నెలగా... ఆ.. ఆ 

పులకరించి పరిమళించి... ఊగేనులే ఉయ్యాలగా



పరువపు వలపుల సంగీతం




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం


పరుగులు తీసే....అనురాగం

దానికి లేదే... ఆటంకం

పరుగులు తీసే... అనురాగం

దానికి లేదే... .ఆటంకం.. 


పరువపు వలపుల..సంగీతం

ఉరకలు వేసే..జలపాతం


చరణం 1 :


లైలా..ఆ... ఆ.. ఆ..

లైలా..ఆ... ఆ... ఆ 

మజునూ... ఊ.. ఊ.. ఊ..

మజునూ... ఊ.. ఊ.. ఊ 

లైలా మజును దేవదాసులా కాలం చెల్లిపోయిందీ

జులీ..బాబీ..లవ్... నిలిచేకాలం వచ్చింది 

నువ్వూ నేనూ ఒకటై... వెలిగే కాలం వచ్చింది


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం 



చరణం 2 :



పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పెద్దలు ప్రేమకు అడ్డంపడితే... పిన్నలు పాఠం చెపుతారు 

మనసులేకమై నిలుచువారలకు చేతికందగలదాకాశం  

గడుపుమాని ముందడుగు  వేయమని... యువతరానికిది సందేశం


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం.. 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12820



పదహారు ప్రాయం




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


హరి..హో..ఓ... ఓ.. ఓ..ఆహ... హా

నననా నననా... 

నననా నననా... 

నననా నననా... మ్మ్..


పదహారు ప్రాయం... ఇరవైతో స్నేహం

చేస్తేనే అనురాగం... మ్మ్ 

పగ్గాలు తెంచి... పంతాలు పోయి 

చెలరేగితే అందం... మ్మ్..


హరి..ఓ.. ఓ.. ఓ..ఓహో..

నననా..నననా

నననా..నననా..


పదహారు ప్రాయం... ఇరవైతో స్నేహం

చేస్తేనే అనురాగం... మ్మ్

పగ్గాలు తెంచి... పంతాలు పోయి 

చెలరేగితే అందం.. మ్మ్..



చరణం 1 :


హా... అందాలూ వడబోసి... ఆనందం కలబోసి

అనుకోని ఒక ఊర్వశీ.. 

హ్హా... అయింది నా ప్రేయసి


హా... అనురాగం..పెనవేసి

అనుబంధం..ముడివేసి

అనుకోని ఈ చోరుడూ..హా... అయ్యాడు నా దేవుడూ..


ఆ.. ఆ..మనసున్నవాడు... నిన్ను దోచినాడు

తన వలపంతా ఎరవేసి


హరి..ఓ.. ఓ..ఓహో..

నననా..నననా

నననా..నననా.. 


చరణం 2 : 


ఆ..హా..జాబిల్లిని ప్రేమించి సాగరము తపియించి

ఎగిసింది కెరటాలుగా..హా.. వేచింది ఇన్నేళ్ళుగా 


హా...దివినించి నెలరాజు దిగివచ్చి ప్రతిరోజు

ఉప్పొంగు కెరటాలలో..హా.. ఊగాడు ప్రియురాలితో..


ఆ..ఏ హద్దులేదని మా ముద్దు మాదని

ఈ పొద్దు ఈలా నిలవేసి..


హరి..ఓ.. ఓ..ఓహో..

నననా..నననా

నననా..నననా..

ఆ... ఆఅ


https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12818

Sunday, September 30, 2018

ఉండి ఉండి గుండెవచ్చి




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :


ఆ ఆ ఆ ఆ ఆ..ఓ..ఓఓ..ఆ ఆలలలలా..ఆ

ఉండి ఉండి గుండెవచ్చి... గొంతులోన కొట్టుకాడి

లవ్‌సాంగ్ పాడిందిరో 

వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి

లవ్‌స్టోరి రాసిందిరో 

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి

లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ.. 

వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి

లవ్‌స్టోరి రాసిందిరో 


బ్యూటికి పోటిగా హాటైన టినేజి ఉంది నీకూ 

నీటైన నువ్వుంటే ఘాటైన లవ్ ఉంటే చాలు నాకూ


వెంటపడ్డ జంట కాస్త ఇంటికొచ్చి పంటకొచ్చి

లవ్‌స్టోరి రాసిందిరో 

ఉండి ఉండి గుండెవచ్చి గొంతులోన కొట్టుకాడి

లవ్‌సాంగ్ పాడిందిరో 



చరణం 1 :


ఇది వయసుకు వయసుకు..రేస్ 

ఇది వదిలితే రెండు డాష్   

కమాన్ కమాన్ డాషింగ్ రోమాన్స్

ఈ దినామే మనకొక ఫీస్ట్  

నీ పరువం..పరుగే ఫాష్ట్ 

గొ ఆన్ గో ఆన్  ఎవరొస్తారో..ఫష్టు..అహ్హా


ఫష్టుగా బెష్టుగా ట్విస్ట్ గా లేటెష్టుగా  

ఫష్టుగా బెష్టుగా ట్విస్ట్ గా లేటెష్టుగా 


రూల్స్ అన్ని గాలికి వదిలేయ్... నకరాలు మూలకు విసిరేయ్

రూల్స్ అన్ని గాలికి వదిలేయ్... నకరాలు మూలకు విసిరేయ్ 

మజా మజా ఈ రోజే... మెహబూబా..


ఉండి ఉండి గుండెవచ్చి... గొంతులోన కొట్టుకాడి

లవ్‌సాంగ్ పాడిందిరో... 

వెంటపడ్డ జంటకాస్త... ఇంటికొచ్చి పంటకొచ్చి

లవ్‌స్టోరి రాసిందిరో..


చరణం 2 : 


ఈ గుండెల సందడిలో... అది చేసే తొందరలో

ఉండలేను వంటరి జంటగా  

ఈ దొరికిన సమయంలో... ఈ దుడుకుల దూకుడులో

ఉండలేను నీతో ఒంటరిగా 


నా కోసమేమైన చేస్తావా?... మ్మ్ 

కొండ మీంచి దూకమంటే దూకుతావా?..ఓ..షూర్ 


సింగింగ్?

మాప మాప మాగరిస రీగ రీగ రీ.. 

డన్సింగ్?

తకిట తకిట తకిట తకిట తకిట తకిట తా.. 

వెడ్డింగ్... రెడి..

కిస్సింగ్...ఓకె... ఆ... 

నననననననన..

అలాటి ఇలాటి అమ్మాయ్‌కాదిది... అల్లాటప్పా పిల్లకాదిది 

లాటి ఇలాటి అమ్మాయ్‌కాదిది... అల్లాటప్పాపిల్లకాదిది  

వెర్రిమొర్రి వేషాలేస్తే... గూబ గుయ్యిమంటది

ఒకె..ఒకె..ఒకె..ఒకె..


ఉండి ఉండి గుండెవచ్చి... గొంతులోన కొట్టుకాడి

లవ్‌సాంగ్ పాడిందిరో.. 

వెంటపడ్డ జంటకాస్త... ఇంటికొచ్చి పంటకొచ్చి

లవ్‌స్టోరి రాసిందిరో.. 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12822