చిత్రం : పెళ్ళీడు పిల్లలు (1982)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
వయసే వెల్లువగా..ఆ... ఆ
వయసే వెల్లువగా..ఆ... ఆ
వలపే వెన్నెలగా..ఆ... ఆ
పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా
వయసే వెల్లువగా..ఆ... ఆ
వలపే వెన్నెలగా..ఆ... ఆ
మనసు నేడే కలత తీరి... ఊగిందిలే ఉయ్యాలగా
చరణం 1 :
చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ
చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ
వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు
వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు..
చెలిమి నిండి కలలు పండి... చేరాలిలే చేరువగా
వయసే వెల్లువగా..ఆ... ఆ
వలపే వెన్నెలగా..ఆ... ఆ
పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా
చరణం 2 :
మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా
మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా
హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే
హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే
గులాబీలే గుభాళించె... మురిపించెలే దీవెనలై
వయసే వెల్లువగా... ఆ.. ఆ
వలపే వెన్నెలగా... ఆ.. ఆ
పులకరించి పరిమళించి... ఊగేనులే ఉయ్యాలగా
This comment has been removed by a blog administrator.
ReplyDelete