చిత్రం : కృష్ణప్రేమ (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల
పల్లవి :
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము
రాగ తాళ సమ్మేళన వేళ...
రాగ తాళ సమ్మేళన వేళ...
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము
చరణం 1 :
పాడెనే మలయానిలం... ఆహా ఆడెనే ప్రమదావనం
ఆ ఆ ఆ ఆ
పాడెనే మలయానిలం... ఆహా ఆడెనే ప్రమదావనం
పాటలతో సయ్యాటలతో ఈ జగమే మనోహరము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము
చరణం 2 :
రాగముల... సరాగముతో
నా మది ఏలెను నీ మురళి
అందముల... పసందులతో చిందులు వేసెను నీ సరళి
నీ కులుకే లయానిలయం
నీ పలుకే సంగీతమయం
ప్రమద గానాల ప్రణయ నాట్యాల
ప్రకృతి పులకించెనే..హ హ హ హా
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము
చరణం 3 :
పదముల వాలితిని హృదయమే వేడితిని
పదముల వాలితిని హృదయమే వేడితిని
పరువపు నా వయసు మెరిసే నా సొగసు
చెలిమి పైన నివాళిగా చేకొనుమా వనమాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా హృదయ విహారిణివే నాట్యకళా విలాసినివే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
సుధామధురము కళాలలితమీ సమయము
ఆహా... మధురము..
No comments:
Post a Comment