చిత్రం : మా వూరి పెద్దమనుషులు/రాహువు-కేతువు) (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అరికాలు నిమరని.. అరకంట చూడని
అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి మరి మరి
అరికాలు నిమిరినా.. అరకంట చూసినా
అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
చరణం 1 :
బులిపించే నీ వయసేమో పలుకు పలుకు పలుకు పలకమంది
గుబులేసే నా గుండెల్లో కళుకు కళుకు కళుకు కళుకుమంది
బులిపించే నీ వయసేమో పలుకు పలుకు పలుకు పలకమంది
గుబులేసే నా గుండెల్లో కళుకు కళుకు కళుకు కళుకుమంది
ఆ గుబులు తీయనిదమ్మా.. అది నీకే తెలియనిదమ్మా
ఆ గుబులు తీయనిదమ్మా.. అది నీకే తెలియనిదమ్మా
ఆ వింత మరి కొంత చిగురించాలంటే...
అరికాలు నిమరని.. అరకంట చూడని
అరనవ్వు విసరని.. సరి సరి సరి సరి సరి
ఉ.. ఉ.. ఉ.. ఉ..
చరణం 2 :
గడుసైనా కోరికయేమో అడుగు అడుగు అడుగు అడగమంది
తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు నిలువు నిలువు నిలవమంది
గడుసైనా కోరికయేమో అడుగు అడుగు అడుగు అడగమంది
తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు నిలువు నిలువు నిలవమంది
ఒక చెంప ముద్దంటుంది.. ఒక చెంప వద్దంటుంది
ఆ రెంటి చెలగాట సరి చెయ్యాలంటే... ఆ
అరికాలు నిమరని.. అరకంట చూడని
అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి
అరికాలు నిమిరినా.. అరకంట చూసినా
అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి సరి
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
No comments:
Post a Comment