Showing posts with label ఆడంబరాలు-అనుబంధాలు (1974). Show all posts
Showing posts with label ఆడంబరాలు-అనుబంధాలు (1974). Show all posts

Thursday, May 28, 2020

వారానికి ఏడు రోజులు

చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, బాలు 



పల్లవి :


ఆషాడమాసానా... ఆకాశతీరాన
అడుగులో అడుగిడి... అంతలో తడబడి
నీలాల ఓ..మేఘమాలికా 



వారానికి ఏడు రోజులు ఎందుకనీ
రోజుకు ఇన్నిఝాములు ఎందుకనీ
చెప్పవే చెప్పవే... చెప్పవే..
నా మాట...మావారితో
చెప్పవే.. నా మాట మావారితో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో.. 


చెప్పవే.. . నా మాట నా చెలియతో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే నామాట..నా చెలియతో..ఓ.. ఓ 



చరణం 1 :



మగత నిదురలో నేనుంటే
నా మదిలో మెదిలేది తానేననీ

మగత నిదురలో నేనుంటే
నామదిలో మెదిలేది తానేననీ


కలవరపడి నే నెటు చూసినా
కలకల నవ్వేది తానేననీ
కొలిచే దేవుని రూపంలో.. నిలిచే దేవుడు తానేననీ.. 


చెప్పవే చెప్పవే..నామాట మావారితో.. 


చరణం 2 : 



మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
ఆ మనసులోనీ మంచితనం... తన కనులలోనే చూశాననీ


అందానికీ అనురాగానికీ...
అందానికీ అనురాగానికీ... అవధులు తనలోనే చూశాననీ.. 


చెప్పవే చెప్పవే చెప్పవే నామాట..నా చెలియతో
వేరెవ్వరూ లేని వేళలో... ఆ వేళలో
చెప్పవే నామాట  మావారితో.. 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3130 

ఏనాటి వరమో...

చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి :


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా 


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఓ.. ఓ... ఓ..  


చరణం 1 :



అనురాగ ఫలితం  అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..
అనురాగ ఫలితం  అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..


వలపుల పంట...  వజ్రాల జంట
వలపుల పంట...  వజ్రాల జంట
మా ముద్దు పాపలే... ఇద్దరి నయనాలు..
ఇద్దరి నయనాలు.. 


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..



చరణం 2 : 



పెనవేసుకొన్నా అనురాగ లతలు
చిగురించి విరబూసి అలరారు వేళా
పెనవేసుకొన్నా అనురాగలతలు
చిగురించి విరబూసి అలరారువేళా 


కలలన్ని నిజమై కనిపించు నాడు
ధన్యమై నిలిచేను మనజీవితాలూ..మన జీవితాలూ..



ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..

నీ రూపం హృదయంలో

చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి :


నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా
నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా
నీ నామం కలకాలం..వీణపై మీటనా... ప్రభూ


నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా

చరణం 1 :



ఆలయశిఖరంపై..అదిగో..ఓ.. ఓ.. ఆశల తొలి కిరణం
ఆలయశిఖరంపై..అదిగో..ఓ.. ఓ.. ఆశల తొలి కిరణం
విరిసిన కన్నులలో....ఓ.. ఓ.. మెరిసెను నీ చరణం
విరిసిన కన్నులలో....ఓ.. ఓ.. మెరిసెనునీ చరణం


నీ నామం కలకాలం... వీణపై మీటనా.. ఆ.. ఆ... ఆ


నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ 


చరణం 2 : 



నీ గుడివాకిటిలో..స్వామీ..ఈ.. ఈ.. నిలుచుటే భాగ్యమురా..
నీ గుడివాకిటిలో..స్వామీ..ఈ.. ఈ.. నిలుచుటే భాగ్యమురా..
నీ పద సన్నిధిలో..ఓ.. ఓ..బ్రతుకే కానుకరా
నీ పద సన్నిధిలో..ఓ.. ఓ..బ్రతుకే కానుకరా



నీ నామం కలకాలం... వీణపై మీటనా.. ఆ.. ఆ... ఆ


నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3128