Thursday, May 28, 2020

ఏనాటి వరమో...

చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి :


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా 


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఓ.. ఓ... ఓ..  


చరణం 1 :



అనురాగ ఫలితం  అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..
అనురాగ ఫలితం  అందాలపాప
చిందించు నవ్వే ముత్యాలమూట..


వలపుల పంట...  వజ్రాల జంట
వలపుల పంట...  వజ్రాల జంట
మా ముద్దు పాపలే... ఇద్దరి నయనాలు..
ఇద్దరి నయనాలు.. 


ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..



చరణం 2 : 



పెనవేసుకొన్నా అనురాగ లతలు
చిగురించి విరబూసి అలరారు వేళా
పెనవేసుకొన్నా అనురాగలతలు
చిగురించి విరబూసి అలరారువేళా 


కలలన్ని నిజమై కనిపించు నాడు
ధన్యమై నిలిచేను మనజీవితాలూ..మన జీవితాలూ..



ఏనాటి వరమో... ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా... విడలేని మమతా
విలసిల్లు ఇల్లే... మన స్వర్గసీమా
ఏనాటి వరమో... ఏ నోము ఫలమో..

No comments:

Post a Comment