Showing posts with label ఆనంద్. Show all posts
Showing posts with label ఆనంద్. Show all posts

Sunday, September 13, 2020

తగునా నీకిది జవరాలా

 



చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  జాలాది 

నేపథ్య గానం : రమణ, బాజీరావ్


పల్లవి :


తగునా నీకిది జవరాలా... తగునా నీకిది జవరాలా

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 

తగునా నీకిది జవరాలా ప్రియురాలా రావేలా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 1 :


అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 

అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 


ఇంటినుండి నను వెంటతెచ్చినది కొంటె వలపు నయగారమా              

సొంతపెళ్లామా చెంత చేర్చుకుని సరసమాడుటిది నేరమా          

వగలిక చాలించి వలపించరారా 

వగలిక చాలించి వలపించరారా

మగువల మనసెరిగి బులిపించుకోరా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 2 :


చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక

చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక



జంటలోనే చలిమంటలోన నాకొంటె వయసు చల్లార్చని

రసికరాజు ఇటు ఇసుకతిన్నెల పూలపాన్పునిక లేవరా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

వంటగది పొగకన్నా వగల సెగలే మిన్నా

  


తగునా నీకిది జవరాలా... 

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 


తగునా నీకిది ఓ రసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రియురాలా.. చాలునిక



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5471

Saturday, August 29, 2020

చిలకమ్మా... హే చిలకమ్మా



చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత : సాహితి
నేపథ్య గానం : ఆనంద్, జానకి   



పల్లవి :



చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి


మొనగాడా... హే జతగాడా
మొనగాడా... హే జతగాడా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను 


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా



చరణం 1 :


కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
సిగ్గంతా వగ్గేసి దగ్గరగా రావాలి


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
కలిపావు చేయి కలిసావు జోడి... ఆడావు నాతో చేరి



చరణం 2 :


కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
చన్నీటి జలకాల చల్లార్చుకోమంది 


మొనగాడా... హే జతగాడా
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను


చిలకమ్మా... హే చిలకమ్మా
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9607

Monday, June 29, 2020

పాపం ఈ చిన్నవాడి కొక లోపం

చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపథ్య గానం :  శోభా శేఖర్, ఆనంద్  



పల్లవి :



పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం


పాపం ఈ చిన్నదానికికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం



చరణం 1 :



కలలోకి రమ్మన్నానా...  తనుగానే వస్తుంది
కలలోకి రమ్మన్నానా...  తనుగానే వస్తుంది
అది ఎందుకో ఏమిటో నే కోరలేదు
కౌగిలికి రా....
కౌగిలిరా రమ్మని అడిగినా రాదు 


పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం... పాపం



చరణం 2 :


కౌగిలికి రానంటానా...  సమయమిది కాదన్నాను
కౌగిలికి రానంటానా...  సమయమిది కాదన్నాను
ఇంకెందుకీ తొందరా న్యాయమేనా
నీ దాననే...
నీదాననే... ఇప్పుడు ఎపుడైనా గానీ 


పాపం ఈ చిన్నదానికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం


చరణం 3 :


మత్తుగా ఉండిపోనీ పెనవేసి పెదవి పెదవి
మనువాడనీ ముందుగా అప్పుడవునంటాను
మనసాగదు.... ఊ.. ఊ...
మనసాగదు నిముసము...  నిను చేరకపోతే
లాల లాలలలాలాల... లాల లాలలలాలాల






Friday, December 1, 2017

ప్రేమ బృందావనం

చిత్రం : బంగారు కానుక (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత :
నేపథ్య గానం : ఆనంద్, సుశీల




పల్లవి :


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ రాముడు నా వరుడిగా...  చేరగా..
ప్రేమ బృందావనం ...


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ సీతే నా వధువుగా...  చేరగా
ప్రేమ బృందావనం.... 



చరణం 1 :



పెళ్ళికే పాల మబ్బు పందిరే వేసెనయ్యా..
పచ్చనీ తీగలన్ని తోరణం చేసెనయ్యా ...
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా ...


నా...కన్నులా...కళ్యాణజ్యోతుల కాంతులు మెరిసే ...

ప్రేమ బ్రందావనం పలికెలే స్వాగతం...



చరణం 2 :



గాలికే నీ అందం...  కవితలే నేర్పెనమ్మా...
వీణకే నీ గానం...  స్వరములే తెలెపెనమ్మా..
చందమామ నీ ముందూ ఎందుకే బొమ్మా....


ఆ...అమ్మమ్మా.... అపురూప సుందర అప్సర నీవు...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...



చరణం 3 :



పాలలో తేనెవలే మనసులే కలిసెనయ్యా...
కలిపిన కొంగులు రెండూ విడిపోవమ్మా...
మా.. జంటనే ... దీవించగా.. గుడి గంటలు మ్రోగే..


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...
ఆ రాముడు నా వరుడిగా చేరగా..
ప్రేమ బృందావం...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1877