Showing posts with label జె. వి. రాఘవులు. Show all posts
Showing posts with label జె. వి. రాఘవులు. Show all posts

Wednesday, January 5, 2022

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి




చిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981)

సంగీతం : జె. వి. రాఘవులు   

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల   




పల్లవి :


శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా



శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి 

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా


శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి


చరణం 1 : 


ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు

ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు


మనసు మనసు మనువాడె... మనకెందుకులే తెరచాటు

నీ అరముద్దులకే విజయోస్తు... నీ అనురాగానికి దిగ్విజయోస్తు


శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి




Wednesday, September 23, 2020

కలహంస నడకదానా

 




చిత్రం  :  సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)

సంగీతం  :  జె. వి. రాఘవులు

గీతరచయిత  :  మైలవరపు గోపి

నేపథ్య గానం  : బాలు




పల్లవి :


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..



చరణం 1 :



చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు

చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు


కలలు తలపోసి కళలు కలబోసి

ఎవరు మలచేరు ఈ రూపం


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..


చరణం 2 :



శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలో

శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలో



చేయి జత కలిపి గొంతు శృతి కలిపి

ఏకమవుదాము ఈనాడు


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..





Sunday, September 20, 2020

సమాధి కడుతున్నాం బాబు

 చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)

సంగీతం : జె. వి. రాఘవులు

గీతరచయిత : మైలవరపు గోపి 

నేపథ్య గానం :  సుశీల  




పల్లవి :


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి 

విధానాలకు సజావుగా బహు నిజాయితీగా

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి



చరణం 1 :


కరెన్సినోట్లు రాజ్యం చేసే గడ్డురోజులు పోయాయి

కష్టజీవి కన్నీటి బొట్లు ఓట్లుగా మారాయి

చందా అంటే చందరయ్యకు వేసే మీ ఓటు

ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాది కోసం


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి


చరణం 2 :


అమ్మల్లారా అయ్యల్లారా... 

ఓనమహా రానివాళ్లకు ఓట్లువెయ్యద్దు...  

ఎం.ఎల్.ఏ చెయ్యద్దు 

దేవుడుకిచ్చే పండు ఫలము దెయ్యాలకు వద్దు

గ్రామదేవతలకు వద్దు 

ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాదికోసం


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి 

విధానాలకు సజావుగా బహు నిజాయితీగా

సమాధి కడుతున్నాం చందాలివ్వండి



సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి


Sunday, August 23, 2020

అన్నా... విన్నా... పాపమే

చిత్రం : అపరాధి (1982)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ   



పల్లవి :


అనసూయా... లల లల హా హా.. హుహు హూ హా హా..
లాలా లలలా లలలా హ హ...

అన్నా... విన్నా... పాపమే...
అనసూయా అసూయెందుకే... ఇదిగో

అవ్వా... అంతా మోసమే...
మగబుద్ధి అన్నారందుకే...
సందెకాడ కోపం... చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ రాజీకి రానంటే పాపం... హా

చరణం 1 :


పెద్దలమీద పెద్దొట్టు బుగ్గలమీద ముద్దొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?


పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం

వన్నెల విసన కర్రలతోన వ్యవహారం

పెద్దలమీద పెద్దొట్టు బుగ్గలమీద ముద్దొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?

పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం 

వన్నెల విసన కర్రలతోనా వ్యవహారం 


నోట్లో వేలు కొరకని వాణ్ని

నిన్నే తప్ప ఎరగని వాణ్ని

నీ భామా కలాపాలు చూశాలే 


అవ్వా అంత మోసమే

మగబుద్ధి అన్నారందుకే


సందెకాడ కోపం చందమామ శాపం

రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ

రాజీకి రానంటే పాపం... హా


చరణం 2 :


మమతలన్ని మనువు చేసి భర్తనైనానే

మమతలన్ని మనువు చేసి భర్తనైనానే


నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే

నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే


అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం

అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం


అన్నా విన్నా పాపమే

అనసూయా... అసూయెందుకే

సందెకాడ కోపం చందమామ శాపం

రాత్రిళ్లకే కాళ్ళబేరం..

రాజీకి రానంటే... పాపం...


లల..లల..లలలా..

ల లా లా ల ల లా



Tuesday, August 25, 2015

భద్రాచల క్షేత్రమహిమ


చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆరుద్ర
నేపథ్య  గానం: రామకృష్ణ, జె. వి. రాఘవులు




పల్లవి :

మా తల్లి గోదారి చూపంగ దారి.. పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా.. భద్రగిరి మహిమలే విందామా... భద్రగిరి మహిమలే విందామా


ఏవిటోయ్ ఆ మహిమలు ?


శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా.. సుజనులారా... సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున... ఒకానొక గిరిని పరికించి,
దానిపై సుంత విశ్రమించినంత... ఆ కంధరమ్మొక సుందరపురుషాకృతి దాల్చి . . .ఏమనినాడనగా


ధన్యుడనైతిని  ఓ రామా..  నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని  ఓ రామా..  నా పుణ్యము పండెను శ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను..  నీ రాకకు చూచే భద్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు.. నా శిరసున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామితమీడేర్చ..  కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ . . ధన్యుడ . . ధన్యుడనైతిని  ఓ రామా... నా పుణ్యము పండెను శ్రీరామా
అని భద్రుడు ప్రార్థించిన . . స్వామివారేమన్నరనగా . . .


వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను  . .  అని వెడలిపోయిరి
అంతట


వెడలిన రాముడు వెలదిని బాసి... ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి... కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి...  కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరిచాడు . . రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు...  శ్రీమద్రమారమణ గోవిందో హరి . .




చరణం 1 :


కాని భూలోకమున భద్రుడు ఎన్నియుగములైనా ఎదురుచూస్తూ ఎదురు చూస్తూ
ఏ విధముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా... వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని సెలవిచ్చిన పిమ్మట... మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా..  అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున...  నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద... వచ్చెదనంటివి రామయ్యా... వరమిచ్చెదనంటివి రామయ్యా
అని శపథంబు చేసి మహోగ్ర తపస్సునాచరించగా . .


సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు  . .
సంక్షోభమ్మునొందిరి . . అపుడు...


 కదలెను. .  శ్రీ మహావిష్ణువు కదలెను. . భక్తసహిష్ణువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక.. శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు...  సుపర్ణుని భుజమైన ఎక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు  ... కదలెను. . 
భక్తసహిష్ణువు . .

శ్రీమద్రమారమణ గోవిందో . . హరి!



చరణం 2 :


గజేంద్రమోక్ష సన్నివేశంబుకైవడి . . .స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తన వెంటన్ సిరి.. లచ్చి వెంట నవరోధ వ్రాతమున్.. దానివె
న్కను బక్షీంద్రుడు.. వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబునూ...
హుటాహుటిని రాగా.. తొందరయందు అపసవ్యంబుగా ఆయుధములు ధరించి . . స్వామి
వారు భద్రునకు దర్శనంబీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు


ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను...  హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవు కావు... నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా... శ్రీమహావిష్ణువు  తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను . .
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు... ఆ తీరుగనే చేతుల
నిల్చెను . . .భద్రుడు మహదానందభరితుడై


ఈ తీరుగనె ఇచ్చట వెలయుము... ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్ర లలామా . . శభాష్
అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసిరి


ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను... భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై . . .



చరణం 3 :

ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన
పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా . . .
ఆయన భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను


కోరి కనిపించావా కోదండరామయ్యా... గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా... గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
చక్రవర్తి కుమారుడా... ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా... విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక...  నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార  విందులయ్యా....  నీకు విందులయ్యా
అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను... 


తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న
ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించెననగా...  ఏవిధముగానా . .  అప్పుజేసి
తప్పు నాయనా... గోపన్న చరితము లోకవిఖ్యాతము
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ... మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా...  రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ... మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం  మహిత మంగళం...  మహిత మంగళం  మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో  హరి!