చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : మైలవరపు గోపి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
కలహంస నడకదానా
కమలాల కనులదానా
నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..
చరణం 1 :
చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు
జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు
చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు
జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు
కలలు తలపోసి కళలు కలబోసి
ఎవరు మలచేరు ఈ రూపం
కలహంస నడకదానా
కమలాల కనులదానా
నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..
చరణం 2 :
శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో
కొలువైన వేళలలో ఎన్నెన్ని భావనలో
శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో
కొలువైన వేళలలో ఎన్నెన్ని భావనలో
చేయి జత కలిపి గొంతు శృతి కలిపి
ఏకమవుదాము ఈనాడు
కలహంస నడకదానా
కమలాల కనులదానా
నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7505
No comments:
Post a Comment