Thursday, September 30, 2021

ముసిముసి నవ్వుల రుసరుసలు




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : శ్రీశ్రీ  

నేపథ్య గానం :   సుశీల 




పల్లవి :


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


నడివయసులో శృంగారం... నడివయసులో శృంగారం

ఆ వెలుగు నీడలే సరసాలు

ఆ వెలుగు నీడలే సరసాలు  


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు



చరణం 1 :


పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

ఆలూమగలూ రాజీ పడితే ఎంతో సింగారం  

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరుచిరు అలకలే సరదాలు



చరణం 2 :


సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు

సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు


సన్నజాజులది చల్లదనం

సంపెంగ పూలది వెచ్చదనం

సంపెంగ పూలది వెచ్చదనం

కోపం తాపం... రాజీపడితే ఎంతో సింగారం

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల.. రుసరుసలు  

చిరుచిరు అలకలే సరదాలు

మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహు..మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహూ



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12821

No comments:

Post a Comment