Wednesday, December 6, 2023

యాలో యాలా ఉయ్యాలా




చిత్రం :  చెయ్యెత్తి జై కొట్టు (1979)

సంగీతం : జే.వి.రాఘవులు 

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం :  సుశీల 



పల్లవి : 


యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా ఉయ్యాలా

గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా

ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా

ఈ పులకరింతలే పూలు పుయ్యాలా... ఆ పలకరింతకే పైట జారాల 


యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా ఉయ్యాలా

గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా

ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా

ఈ పులకరింతలే పూలు పుయ్యాలా... ఆ పలకరింతకే పైట జారాల 


యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా... 


చరణం 1 : 


ఉన్న ఈడు లేని తోడు... ఊసులాడుకున్న ఈ వేళ

మల్లె పువ్వు పిల్ల నవ్వు... మాటలాడుకున్న ఈ వేళ

ఉన్న ఈడు లేని తోడు... ఊసులాడుకున్న ఈ వేళ

మల్లె పువ్వు పిల్ల నవ్వు... మాటలాడుకున్న ఈ వేళ


 

ఏ ఈడులో ఆ వేడుక... జరగాలనే చలి కోరిక

కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా

కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల


ఈ కలవరింతలే కలిసిరావాల... ఆ కౌగిలింతలో కలిసిపోవాల....

యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా... 



చరణం 2 : 


వానపువ్వు తేనెటీగ... ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ

కన్నెసోకు కన్నుసోకి...  మొగ్గలిచ్చుకున్న ఈ వేళ

వానపువ్వు తేనెటీగ... ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ

కన్నెసోకు కన్నుసోకి...  మొగ్గలిచ్చుకున్న ఈ వేళ

ఈ గుండెలో గూడున్నది... ఏ గువ్వకో చోటున్నది


కోడె వయసు నా కన్నెమనసు కాజేసిందియ్యాల

పడుచుగాలికే పైట జారి ఊరేగిదియ్యాల


ఈ జలదరింత నే నేడ దాయాలా

ఈ తొలకరింత నే నెవరికియ్యాలా ....



యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా ఉయ్యాలా

గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా

ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా

ఈ పులకరింతలే పూలు పుయ్యాలా... ఆ పలకరింతకే పైట జారాల 



యాలో యాలా ఉయ్యాలా

యాలో యాలా... 

కన్నియనుడికించ తగునా




చిత్రం :  మాతృదేవత (1969)

సంగీతం : కె.వి. మహదేవన్ 

గీతరచయిత : సినారె 

నేపథ్య గానం :  సుశీల 


పల్లవి : 


కన్నియనుడికించ తగునా భ్రమరా

కన్నియనుడికించ తగునా భ్రమరా

అన్నెము పున్నెము ఎరుగని కలువల

కన్నియనుడికించ తగునా భ్రమరా

అన్నెము పున్నెము ఎరుగని కలువల

కన్నియనుడికించ తగునా... 


చరణం 1 : 


తీవియ ఒడిలో ఒదిగినది... తేనెలు ఎదలో పొదిగినది 

తీవియ ఒడిలో ఒదిగినది... తేనెలు ఎదలో పొదిగినది 

రేకులు విరిసి విరియనిది... రేకులు విరిసి విరియనిది

ఏ కన్ను సైగల పాపలెరుగనిది


కన్నియనుడికించ తగునా భ్రమరా

అన్నెము పున్నెము ఎరుగని కలువల

కన్నియనుడికించ తగునా 


చరణం 2 : 


గాలి సోకగా కలవరపడురా... అలలు కదలగా ఉలికులికిపడురా

గాలి సోకగా కలవరపడురా... అలలు కదలగా ఉలికులికిపడురా

అల చందమామను తిలకించగానే... నిలువెల్ల తొలిసిగ్గు గిలిగింతలిడురా


కన్నియనుడికించ తగునా... 


చరణం 3 :


మనసార పిలిచే పిలుపే పిలుపు... మనువులు కలిపే వలపే వలపు

మనసార పిలిచే పిలుపే పిలుపు... మనువులు కలిపే వలపే వలపు

వలపు లేని పరువపు సయ్యాటలు... 

వలపు లేని పరువపు సయ్యాటలు... 

సెలయేటి కెరటాల నురుగుల మూటలు


కన్నియనుడికించ తగునా భ్రమరా

అన్నెము పున్నెము ఎరుగని కలువల

కన్నియనుడికించ తగునా 

Tuesday, December 5, 2023

ఏమిటో ఈ మాయా





చిత్రం : ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)

సంగీతం :  పెండ్యాల 

గీతరచయిత :  పింగళి 

నేపథ్య గానం :  సుశీల, ఘంటసాల 


పల్లవి : 


ఏమిటో ఈ మాయా...  కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా...  కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


అనుపల్లవి : 


వాణి నరసి వాణి నొరసి... మనసు విరిసేనే

తానుగా నను తాకెనే... అది నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 1 :


నాటిదో ఏ నాటిదో నేటి ఈ చెలిమి

నాటిదో ఏ నాటిదో నేటి ఈ చెలిమి

మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 2 : 


కనులు కలిసి మనసు తెలిసి... మేనులే సొలసి

కనులు కలిసి మనసు తెలిసి... మేనులే సొలసి

ఉంటిమని కలగంటి కదా... అది నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 3 : 


ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ

ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ

మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 4 : 


వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా

వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా

మాయయే మటుమాయమై... కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా...



Wednesday, July 19, 2023

నాలో ఏవేవో వింతలూ




చిత్రం : చక్రధారి (1977)

సంగీతం : జి.కె. వెంకటేశ్ 

గీతరచయిత :  సినారె 

నేపథ్య గానం : సుశీల

 

పల్లవి : 


నాలో ఏవేవో వింతలూ... గిలిగింతలూ ఈవేళా

అడుగుల అలజడిలో... తలపుల వరవడిలో

చెలరేగే తుళ్ళింతలూ... చెలరేగే తుళ్ళింతలూ


వయసొచ్చిందే పిల్లా... వరదొచ్చిందే పిల్లా

ఆపైన ఓయమ్మా... అల్లోనేరేళ్ళో 

ఈపైన ఓపలేని ఎన్ని పరవళ్ళో

ఆహహా... ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ

వయసొచ్చిందే పిల్లా... వరదొచ్చిందే పిల్లా

వయసొచ్చిందే పిల్లా... వరదొచ్చిందే పిల్లా



చరణం 1 : 


తొలకరి గాలి తొందరలాయే... ఉలిపిరి పైట మెలికువలాయే

తొలకరి గాలి తొందరలాయే... ఉలిపిరి పైట మెలికువలాయే

ఆహా..

మబ్బులు చూస్తుంటే... మగతే వస్తుంటే

మబ్బులు చూస్తుంటే... మగతే వస్తుంటే

నేలకరిగిపోయే... అరికాలు నిలవదాయే

ఏమాంటావే... ఏమంటావే..

ఈ మేనిలోని మెరుపులెందుకంటావే


వయసొచ్చిందే పిల్లా... వరదొచ్చిందే పిల్లా

ఆపైన ఓయమ్మా... అల్లోనేరేళ్ళో 

ఈపైన ఓపలేని ఎన్ని పరవళ్ళో


చరణం 2 : 


తరగల్లోన తనువేమాయే... పరువంపొంగీ నురుగైపోయే

అహాహా అహా... 

తరగల్లోన తనువేమాయే... పరువంపొంగీ నురుగైపోయే 


నీళ్ళకు వళ్ళుస్తే... జల్లుకు మనసిస్తే 

నీళ్ళకు వళ్ళుస్తే... జల్లుకు మనసిస్తే 

చల్లని సెగలాయే ఎద ఝల్లని గుబులాయే

ఏమంటావే...  ఏమంటావే 

ఈ వింతవింత విసురులు ఎందుకంటావే


వయసొచ్చిందే పిల్లా... వరదొచ్చిందే పిల్లా

ఆపైన ఓయమ్మా... అల్లోనేరేళ్ళో 

ఈపైన ఓపలేని ఎన్నీ పరవళ్ళో


నాలో ఏవేవో వింతలూ గిలిగింతలూ ఈవేళా

అడుగుల అలజడిలో... తలపుల వరవడిలో

చెలరేగే తుళ్ళింతలూ... చెలరేగే తుళ్ళింతలూ

Monday, June 12, 2023

కాలాల ఎనకాల ఒక ఎంకి

చిత్రం :  ఊహా సుందరి (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి 
నేపథ్య గానం : బాలు


పల్లవి : 

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట
అది ఏ జాణు తెలుగో... అది ఏ జాణపదమో
ఆ ఎంకి మనసులో ఎన్నెన్ని ఊసులో
కడకంట ఎన్నెన్ని బాసలో...  

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట


చరణం 1 : 


ఆ ఎంకి ఒకనాడు నా వంక చూసింది
ఆ చూపుతో వేగు చుక్కేదో పొడిచింది
అది కలలాగ ఎదిగి... నా కన్నీట కరిగి
నా ఆశ ఆకాశమై... ఆగిపోయింది
నా ఎంకి తెల్లారి ఎన్నెలైపోయింది

ఎదలోని ఆ ఎంకి ఎదురైన వేళ
పదమేది పాడెది ఈ వేళ

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట


చరణం 2 : 


తెలుగింటిలో ప్రేమ దీపాలు పెట్టింది
ఎనుగారిపోయాక ఎదచూసుకోమంది
అది నా గుండెనమిలి... నా మనసంత నలిగి
తెలుగోళ్ళకొక పాటగా... ఎంకి మిగిలింది
పాడలేని నాకు పల్లవైపోయింది

ఎదలోని ఆ ఎంకి ఎదురైన వేళ
పదమేది పాడెది ఈ వేళ


కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట
అది ఏ జాణు తెలుగో... అది ఏ జాణపదమో
ఆ ఎంకి మనసులో ఎన్నెన్ని ఊసులో
కడకంట ఎన్నెన్ని బాసలో... 

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట

Friday, June 9, 2023

అధరం ఎంత మధురం

చిత్రం :  ఊహా సుందరి (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి 
నేపథ్య గానం : జయచంద్రన్


పల్లవి : 

అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం
నీ రూపే మనోహరం... నీ రూపే మనోహరం
నీ చూపే స్వయంవరం... నీ చూపే స్వయంవరం
నీవే... నీవే... నాకో వరం 
అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం 


చరణం 1 : 

చందన కలశం నీ వదనం... చంద్రుని కిరణం నీ నయనం
చందన కలశం నీ వదనం... చంద్రుని కిరణం నీ నయనం
మనసే మలయజపవనం.. నీ వయసే మరునికి జవనం
నీ స్మరణే నా జీవనం... నీ స్మరణే నా జీవనం
నీ పలుకే సమ్మోహనం...
నీవే... నీవే... ఆలాపనం

అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం

చరణం 2 : 


తారలు కొలిచే సౌందర్యం... తన్మయమే నా సంగీతం
తారలు కొలిచే సౌందర్యం... తన్మయమే నా సంగీతం
పదమే అందని గగనం.. నీ పిలుపే జన్మకు జననం
నీ వలపే... సురచుంబనం
నీ వలపే... సురచుంబనం
మది కలిపే రసబంధనం...
నీవే... నీవే... నా స్పందనం

అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం
నీ రూపే మనోహరం... నీ రూపే మనోహరం
నీ చూపే స్వయంవరం... నీ చూపే స్వయంవరం
నీవే... నీవే... నాకో వరం 
అధరం ఎంత మధురం... 

Sunday, February 12, 2023

కళా యశస్వి కె. విశ్వనాథ్

 కుంచించుకుపోయిన బుద్ధితో సర్వవ్యాప్తి అయిన ఆ భగవంతుడిని ఈశాన్యానికే పరిమితం చేసిన మనకు 'అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది' అని ఉండమ్మా బొట్టు పెడతానని చెప్పారు.

'కుదురులేని గాలి వెదురులోకి ఒదిగితే ఎదురులేక ఎలా ఎదుగుతుందో' స్వర్ణకమలాలతో చూపించారు.

'ఆలోచనామృతమూ ఆత్మ సంభాషిని సాహిత్యమని, అద్వైతసిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానమని, క్షారజనదులు నాట్య కళ ద్వారా క్షీరములే అవుతాయని, ఆనందంతో చేసిన హేల ఆ శివుని నయనత్రైలాస్యమే అని నిరూపించారు.

'విలువిద్యలు ఎన్ని కలిగిన కులవిద్యకు సాటి రాదు కువలయమందు' అని సూత్రధారిలా స్వయంకృషితో చెప్పారు.

విదేశాలకు వెళ్ళాకే మాతృదేశం యొక్క గొప్పదనం తెలుసుకొని, సొంత ఊరిని దత్తతు తీసుకొని అభివృద్ధి చెయ్యాలని జనని జన్మ భూమే గొప్పదని చాటారు.

విషకీటకమైనా శంకరుడి ఆభరణమైతే గౌరవించబడుతుందని, ఎంత ఎదిగినా అసూయతో రగిలితే ఆ జ్ఞానం అంధకారమే అని స్వాతికిరణంగా తెలిపారు.

సప్తపది ద్వారా పునర్వివాహం తప్పుకాదని చెప్పినా, 'నటరాజ స్వామి జటాఝూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది?' అని సముద్రానికి కూడా చెలియలికట్ట అవసరమని చెప్పారు.

వరకట్నం మీద విప్లవం తీసుకొని రాడానికే శుభలేఖ పంచారు. వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ స్వాతిముత్యమే అయ్యారు. తనదు స్వరసత్వము వారసత్వముగా ఇచ్చిన తల్లితండ్రులే శ్రుతిలయలు అని తెలిపారు.

ఈ మాత్రం సంగీతసాహిత్యాభిమానం మా తరానికి కలిగిందంటే ఆయనే కారణం! ప్రతీ సినిమాలోనూ ఒక అన్నమయ్య కీర్తనో, త్యాగరాయ కృతినో పెట్టి పండిత పామరులను అలరించారు, వాటిని పరిచయమూ చేశారు. ఆయన సినిమా అంటే ఇంట్లో అందరు కలిసి చూసే పండగలాంటిది. ఒక్కో సారి ఒక్కో విషయాన్ని తెలియచేస్తుంది చూసిన సినిమా అయినా!

'కలవని తీరాల నడుమ కలకలసాగక యమున వెనుకకు తిరిగిపోయిందా?' అని ప్రశ్నించినట్లు ఇటువంటి స్పీడ్ యుగంలో ఇలాంటి ఆణిముత్యాలు తీసి ప్రవాహానికి ఎదురేగారు . ఈ సినిమాలన్నీ ఆయన 'ఆత్మగౌరవాన్ని' పెంచినవే.
ఇన్నీ సినిమాలు తీసినా ఆయన గొప్పదనాన్ని పొగిడితే "ఆ టైంకి అలా అయ్యిపోయింది అంతే, అంతా ఆ శివుడి కృప" అని ఒక నమస్కారం పెట్టేశారు.

సినిమాల ద్వారా ఎన్నో పాటలకు అందమైన రుచులు చూపించినా, ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నప్పుడు కొత్తావకాయలో వెన్నతో మామిడిపండు ముక్కలు నంచుకోమని చెప్పి తినిపించిన ఆ రుచి మాత్రం మరువలేను (అప్పటి వరకు తినలేదు, ఇక తినబోను). ఇంట్లో ఒక పెదనాన్న గారో, ఒక తాతగారో అలా తినిపించినట్లు అనిపించింది.

శరీరానికి జరామరణం ఉంటుంది, ఉండి తీరాలి కూడా, కానీ ఆయన కోరుకున్నట్టు 'అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం' కోరిక ఆయనకు లభించింది. ఏ ఒక్క మచ్చ లేకుండా ఆ కాశీనాథుడిని చేరిన యశస్వి విశ్వనాథ్ గారు. బ్రతకడం ఇలా బ్రతకాలి, సినిమాలు ఇలా తియ్యాలి... శరీరాన్ని ఇలా వదలాలి అని బ్రతికి చూపించిన ఋషి ఆయన.
May be an illustration
All reaction