Wednesday, October 30, 2013

నీవు రావు నిదురరాదు




చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు...

చరణం 1:

తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....
ఆ ఆ ఆ ఆ.....
తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి...
చింతా  చీకటి ఒకటై...చిన్నబోయే ఈ రేయి

నీవు రావు..
నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు..

చరణం 2:

ఆశలు మదిలో విరిసే... దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ..ఆలయాన చేరి చూడ...
స్వామికానరాడాయే..నా స్వామికానరాడాయె...

కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి...
ఎదురుచూసి ఎదురుచూసి... కన్నుదోయి అలసిపోయె

నీవు రావు..
నీవు రావు నిదురరాదు...నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు

No comments:

Post a Comment