Wednesday, September 24, 2014

ఓం నమఃశివాయా

చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  
ఎస్.పి. శైలజ


పల్లవి :


ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా! 
చరణం 1 : 


పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై

ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ


నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దశోపనిషత్తులై ఇల వెలయా


చరణం 2 :త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైత్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైగజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై


అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా


ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా2 comments:

  1. సంగీతం ఇళయరాజా గారు అనుకుంటానండీ. దయచేసి సరి చూడగలరు.

    ReplyDelete