Thursday, June 25, 2020

చిలిపికనుల చిన్నదానా

చిత్రం :  మంచి రోజు (1970)

సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం :  రామకృష్ణ, సుశీల

పల్లవి :



చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే


చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే


                   

చరణం 1 :



చల్లనివేళల లోలోన దాగని తాపాలు
వెచ్చనికౌగిట ఏవేవో తియ్యని సౌఖ్యాలు
మేను మేను మేళవించి లీనమవుదాములే


చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే


                 

చరణం 2 :


మధుమయ ప్రణయం మోహాల దాహం తీర్చాలి
వలపుల సంకెల కలకాల బంధము కావాలి
కమ్మనైనా సుఖములోన కరిగిపోవాలిలే 



చిలిపికనుల చిన్నదానా సిగ్గు నీకెందుకే
చిలిపికనుల చిన్నవాడా... సిగ్గు నీవల్లనే
బిడియపడిన లేత వలపు... బిగువు వీడిందిలే

No comments:

Post a Comment