Sunday, September 13, 2020

నా పేరే మురళీమోహన్




చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  ఆరుద్ర 

నేపథ్య గానం: బాలు, జానకి 


పల్లవి :


నా పేరే మురళీమోహన్... ఆరడుగుల అభినవ రామన్ 

నాకుంది ఒకటే బాణం ప్రేమ 

నీకోసం మళ్లీ పుట్టా నీతోనే ముడిపడి ఉంటా

నువ్వంటే పడి చస్తానే భామా

ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా



నా పేరే ఆశాదీపం అందానికి సుందర రూపం

నాకుంది ఒకటే హృదయం రామా

నలుగురిలో అల్లరివద్దు నట్టేట్టా నను ముంచద్దు

నాకోసం పడిచావద్దు మామా

ఓ మామ చందమామ... ఓ మామ చందమామ



చరణం 1 :


నీ వలపు తలపులే తెరిస్తే నా వయసు పొంగులో తడిస్తే

ఇక శృంగార సురభోగమే

నాటకాల నటశేఖరా నీ బూటకాలు ఇక చాలురా

ఇది అరచేతి వైకుంఠమే


హేయ్... శ్రీదేవిని వద్దన్నాను శ్రీప్రియనే కాదన్నాను

శ్రీదేవిని వద్దన్నాను శ్రీప్రియనే కాదన్నాను

నువ్వు అంటే సై అన్నానే భామా

ఓ భామా సత్యభామ... ఏయ్ భామా సత్యభామా


హేయ్...

నా పేరే ఆశాదీపం అందానికి సుందర రూపం

నాకుంది ఒకటే హృదయం రామా

నీకోసం మళ్లీ పుట్టా నీతోనే ముడిపడి ఉంటా

నువ్వంటే పడి చస్తానే భామా


ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా

ఓ మామ చందమామ... ఓ మామ చందమామ



చరణం 2 :


నిన్ను నమ్మి నే వరిస్తే నీ బులుపు తీర్చుకునివిడిస్తే 

ఇక వడగళ్ల కడగళ్ల వాన

నా దేవతల్లే నిను కొలుస్తా... నీ దేవుడల్లే నే నిలుస్తా

నే శృంగార రాముణ్ణే అవుతా


కళ్యాణం చుక్కెడతావా పారాణి పసుపెడతావా 

కళ్యాణం చుక్కెడతావా పారాణి పసుపెడతావా

నూరేళ్ల బంధం వేస్తావా 

ఓ మామా చందమామా...  ఓ మామ చందమామ


నా పేరే మురళీమోహన్... ఆరడుగుల అభినవ రామన్ 

నాకుంది ఒకటే బాణం ప్రేమ 

నీ మురళీ వాయిస్తుంటే నా హృదయం పులకిస్తుంటే

ఒళ్ళంతా ఝల్లంటుంది మామా


ఓ మామా చందమామా...  ఓ మామ చందమామ

ఓ భామా సత్యభామా... ఓ భామా సత్యభామా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5470

No comments:

Post a Comment