Showing posts with label వాణీజయరాం. Show all posts
Showing posts with label వాణీజయరాం. Show all posts

Wednesday, July 19, 2017

నువ్వు వస్తావని బృందావని

 చిత్రం :  మల్లెపువ్వు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వీటూరి
నేపధ్య గానం :  వాణీజయరాం
 



పల్లవి :


నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా...  కృష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా...  కృష్ణయ్యా


వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా...
ఓ.... గిరిధర...  మురహర...  రాధా మనోహరా...
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా.. 



చరణం 1 :


నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట
మమతల దీపాలు వెలిగించాను
మమతల దీపాలు వెలిగించాను


కుశలము అడగాలని...  పదములు కడగాలని
కన్నీటి కెరటాలు తరలించాను


ఓ....ఓ.... గిరిధర... మురహర...  నా హృదయేశ్వరా..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా


కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....




చరణం 2 :



నీ పద రేణువునైనా...  పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ 


నిన్నే చేరాలని... నీలో కరగాలని...
నా మనసే హారతిగా వెలిగించానూ..
గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2042

Tuesday, May 17, 2016

సీతే రాముడి కట్నం




చిత్రం : మగ మహారాజు (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : వాణీజయరాం





పల్లవి :


ఆ....  ఆ....  ఆ....  ఆ
సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం


సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం


రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం.... ఆ సీతకు రాముడు దైవం




చరణం 1 :



 సీత అడిగిన వరమొకటే...  చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే...  అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే...  చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే...  అది సీతమ్మ సన్నిధే


ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం




సీతే రాముడి కట్నం...  ఆ సీతకు రాముడు దైవం





చరణం 2 :




 ఆడజన్మకు వరమొకటే.. మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే.. కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే.. మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే..  కాసుకు అమ్ముడు పోకపోవడం



రామకథలుగా వెలసేది ప్రేమ ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం



సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం

ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9050

Thursday, March 10, 2016

కలిసిన హృదయాలలోన




చిత్రం : ప్రేమ-పగ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  బాలు, వాణీజయరాం 



పల్లవి :

కలిసిన హృదయాలలోన...
కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...



చరణం 1 :


మధుర మనోహర మోహన గీతం...  మదిలో మెదిలే మమతల సారం
మధుర మనోహర మోహన గీతం... మదిలో మెదిలే మమతల సారం


రమ్మని పిలిచే యమునా తీరం
రమ్మని పిలిచే యమునా తీరం
రాధా మాధవ రాగ తాళ భావ గీతిలో

కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...



చరణం 2 :


పమగరిగా..పమగరిగా
నిదపమపా..నిదపమపా
మమదదనినిరిరిగరిస... మమదదనినిరిరిగరిస
నిరినిదా... దనిదమా
మదమగ.. ఆ.. ఆ.. ఆ.. 



తేనెలు చిలికే సుందర కుసుమం...  ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం
తేనెలు చిలికే సుందర కుసుమం... ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం

కలిసిన నాడే కలుగును ప్రణయం
కలిసిన నాడే కలుగును ప్రణయం...
కవితా వనితా తోడు నీడ లేక నిలుచునా


కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...




Thursday, October 16, 2014

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే

చిత్రం : స్వాతికిరణం (1992)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  సిరివెన్నెల

నేపథ్య గానం :   వాణీజయరాం


పల్లవి :


వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  

భవతీ విద్యాందేహీ... భగవతి సర్వార్థసాధికే... సత్యార్థచంద్రికే


మాంపాహీ మహనీయ మంత్రాత్మికే

మాంపాహి మాతంగి మాయాత్మికే 

మాంపాహీ మహనీయ మంత్రాత్మికే

మాంపాహి మాతంగి మాయాత్మికే  


చరణం 1 :


ఆపాత మధురము... సంగీతము

అంచిత సంగాతము... సంచిత సంకేతము

ఆపాత మధురము... సంగీతము 

అంచిత సంగాతము...  సంచిత సంకేతము


శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము... అమృత సంపాతము... సుకృత సంపాకము

శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము...  అమృత సంపాతము... సుకృత సంపాకము


సరిగమస్వరధుని సారవరూధినీ... సామనాదవినోదినీ

సకల కళాకళ్యాణి సుహాసినీ... శ్రీ రాగాలయ వాసిని 

 

మాం పాహీ మకరంద మందాకిని

మాం పాహీ సుజ్ఞానసంవర్ధినీ 

వైష్ణవి... భార్గవి... వాగ్దేవి... త్రిగుణాత్మికే... 

వింధ్య విలాసిని...  వారాహి...  త్రిపురాంబికే 


చరణం 2 :


ఆలోచనామృతము సాహిత్యమూ... సహిత హిత సత్యము... శారదా స్తన్యము

ఆలోచనామృతము సాహిత్యమూ... సహిత హిత సత్యము... శారదా స్తన్యము 

సారస్వతాక్షర సారధ్యము... జ్ఞానసామ్రాజ్యము... జన్మసాఫల్యమూ

సారస్వతాక్షర సారధ్యము... జ్ఞానసామ్రాజ్యము... జన్మసాఫల్యమూ


సరసవక్షోభిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ

వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ

మాం పాహీ సాలోక్య సంధాయినీ

మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ...  

 

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  

భవతీ విద్యాందేహీ... భగవతి సర్వార్థసాధికే... సత్యార్థచంద్రికే


మాంపాహీ మహనీయ మంత్రాత్మికే

మాంపాహి మాతంగి మాయాత్మికే 

 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=12437

Friday, September 26, 2014

అలలు కలలు ఎగసి ఎగసి

చిత్రం  :  సీతాకోకచిలుక (1981)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  ఇళయారాజ, వాణీజయరాం  


పల్లవి : 


స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స

స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా



అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
స గ పా ప ప పా మ మ పా ప ప పా
పగలు రేయి అలసి మురిసే
ప ని ప ని ప స ని ప మా గా
సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో 


చరణం 1 : 

తనన ననన ననన ననన తనన నన తన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే


పగలు రేయి మురిసి మెరిసే సంధ్యా రాగంలో

ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో 

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

తనన ననన ననన ననన తనన నన తన 


తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం

తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం

తకదుం తకదుం తకదుం తకదుం 

తకదుం తకదుం తకదుం తకదుం


చరణం 2 :


నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే


నీ పిలుపు అనె కులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా

ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా .. నా పుత్తడి బొమ్మ.... 


అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7555