Wednesday, November 15, 2017

ఆ నాటి ఆ స్నేహమానందగీతం

చిత్రం :  అనుబంధం (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  బాలు 
  పల్లవి :ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మున్ముందిక రావేమిరా


హహ లేదురా... ఆ సుఖం
రాదురా ఆ గతం...  ఏమిటో జీవితంఒరెయ్ ఫూల్! గుర్తుందిరా
గోడలు దూకిన రోజులు... మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకుని... ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్
పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా హహహచరణం 1 :
నేనూ మారలేదు... నువ్వూ మారలేదు
కాలం మారిపోతే... నేరం మనదేమికాదు
ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా
ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము...  ఆ రోజులు
భ్రమలాగ ఉంటాయి... ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా


ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా
కాలేజిలో... క్లాసురూములో
ఓ పాపమీద..నువ్వు పేపరుబాల్ కొడితే
ఆ పాప ఎడమకాలి చెప్పుతో..
ఒరెయ్ ఒరెయ్ ..ఒరెయ్ స్క్రౌండ్రర్
ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా...
పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే
హహహహ..


ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మున్ముందిక రావేమిరాచరణం 2 :


మనసే ఇచ్చినాను... మరణం తెచ్చినాను
చితిలో చూసినాను... చిచ్చైమండినాను
నా గుండె మంటింక... ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి... బ్రతుకింకలేదు
తన శాపమే నాకు... తగిలిందిరా రేయ్
పసిపాపలే లేని... ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి... తుదియేదిరా


ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా
ఛి ఛీ.. ఊర్కో
ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా
కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా
హహ హహాహ.
.


ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం


హహ రియల్లీ దోజ్ డేస్ ఆర్ మార్వలస్
కరెక్ట్ రా హహహాహహ
లాలాలలాలా లాలాలలాలా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1377

జింజింతరారే

చిత్రం :  అనుబంధం (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  సుశీల,  బాలు    పల్లవి :జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ సాయంత్రం... చెలరేగే సంగీతం
పొద్దువాలె వేళాయే... ముద్దుగుమ్మ రావే
ఇద్దరున్న కౌగిట్లో... ముద్దు తీర్చిపోవే


నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడూ దగ్గరైన ప్రాణాలు జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ చలగాటం... చెలరేగే ఉబలాటం
సందెపొద్దు వేళాయే... చందమామ రావే
చీకటైన పొదరింట్లో... దీపమెట్టిపోవే


నన్నే తాకే అగ్గిపూలబాణాలు
నాకే సోకే కొంటేచూపు కోణాలూ
చరణం 1 :పూల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే... నాజూకు చూస్తుంటే
వెచ్చని వెలుగుల్లో... నచ్చిన వయసల్లే
వాటేసుకొంటుంటే... వైనాలు చూస్తుంటే


సూరీడేమో కొండలు దాటే... నా యీడేమో పొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో... ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు... నిన్నేచేరే నిన్నలేని నడకివ్వుజింజింతరారే...జింజింతారారే
చరణం 2 :కొండ కోనల్లో... ఎండ వానల్లో
మురిపాల పందిట్లో... ముద్దాడుకొంటుంటే
వేసవి చూపుల్తో... రాసిన జాబుల్తో
అందాల పందిట్లో... నిన్నల్లుకొంటుంటే


అల్లరికళ్ళు ఆరాతీసే... దూరాలన్ని చేరువ చేసే
ఒడి చేరి పరువాలు పంచుకో... బిడియాల గడపింక దాటుకో


నింగి నేలా తోంగి చూసే సాక్షాలూ
నీకూ నాకూ పెళ్ళిచేసే చుట్టాలు


జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ చలగాటం... చెలరేగే ఉబలాటం
పొద్దువాలె వేళాయే... ముద్దుగుమ్మ రావే
సందెపొద్దువేళాయే... చందమామ రావే


నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపుల్లబాణాలు
జింజింతరారే...జింజింతారారేప్రతిరేయి రావాలా

చిత్రం :  అనుబంధం (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  సుశీల,  బాలు  పల్లవి :ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్
ఆహా హా అహ ఆహాహా..


ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
సన్నజాజి పొదరింట... సన్నసన్నని వెన్నెలంట
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా


ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
అలిగేటీ పడకింట... అల్లుకొన్న వెన్నెలంట
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
చరణం 1 :అలిగే అందాలు చూసి కవ్వించనా
తొలిగే బేధాలు చూసి నవ్వించనా


మనసు పడుచైనా మీకు మతి చెప్పెనా
మతి మీతోపాటు పోయి శృతి చెప్పనా


మళ్ళీ తొలిరేయి మొగ్గు చూపించనా
మళ్ళీ తొలినాటి సిగ్గు మొలిపించనా


చిలిపి శ్రీవారికింత వలపాయెనా
చిలిపి శ్రీవారికింత వలపాయెనా
మళ్ళీ శ్రీమతి మీద మనసాయెనా.. హాహా


ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
సన్నజాజి పొదరింట... సన్న సన్నని వెన్నెలంట
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
చరణం 2 :ఇన్నాళ్ళు లేని వయసు ఇపుడొచ్చెనా
ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చెనా


మనసే కొన్నాళ్ళ పాటు నిదరోయినా
మనసై నీ ఒడిలోకి నేను చేరనా


మళ్ళీ విరజాజిపూలు నేడు విచ్చెనా 
తల్లో ఈనాడు వలపు పూలుపూచెనా


నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
మళ్ళీ  నీ కోసమే మేలుకొన్నా... హా..హాహా


ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ


అలిగేటీ పడకింట... అల్లుకొన్న వెన్నెలంట
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా
మనమీద వాలాలా... మల్లెలై పోవాలా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1897

మల్లెపూలు గొల్లుమన్నవి

చిత్రం :  అనుబంధం (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  జానకి,  బాలు పల్లవి :మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా
వేడుంది ఒంటిలో... జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా


మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
చల్లగాలి గిల్లుతున్నది సంబరానా
ఎర్రని పెదవిలో... బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనాచరణం 1 :నీ చిలిపినవ్వులో... ఆ నువ్వు వెలుగులో
నా సొగసు ఆరబోసి మెరిసిపోనా
నీ ఒంటి నునుపులో... నీ పెదవి ఎరుపులో
నా వయసు పొంగు నేను కలుపుకోనాగంగలాగా ఉరికి రానా... కడలిలాగా కలుపుకోనా
నా గుడిలో ఉయ్యాలలూగించనా
నా ఎదకు నిను జేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా... ఒక వింత గిలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా


మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా

ఎర్రని పెదవిలో... బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనాచరణం 2 :నీ ముద్దు ముద్దులు... మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో
నే చిత్త చిత్తరంగా హత్తుకోనాహోయ్...  గుండెలోనా నిండిపోనా
నిండిపోయి...  ఉండిపోనా
నీ ప్రేమ నూరేళ్లు పండించనా
నీ ఇల్లు వెయ్యేళ్లు వెలిగించనా
బంధాలు ముడివేసి... అందాల గుడిచేసి
అనురాగ అర్చనలే చేయించుకోనామల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
చల్లగాలి గిల్లుతున్నది సంబరానా
ఎర్రని పెదవిలో... బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనామల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా
వేడుంది ఒంటిలో... జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

Monday, November 13, 2017

వేస్తాను పొడుపు కథా

చిత్రం :  అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  సుశీల, బాలుపల్లవి :


వేస్తాను పొడుపు కథా...  వేస్తాను
చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి

వేస్తాను పొడుపు కథా...  వేస్తాను
చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి
చరణం 1 :
వచ్చాక వచ్చారు... వచ్చి వెళ్ళిపోయరు
వెళ్ళి మళ్ళి వచ్చారు... మళ్ళి వెళ్తే వస్తారా
వచ్చాక వచ్చారు... వచ్చి వెళ్ళిపోయరు
వెళ్ళి మళ్ళి వచ్చారు... మళ్ళి వెళ్తే వస్తారా... ఆ
ఎవరు వారు? ... ఎవరు వారు?


తెలిలా... ఉ..
ఇంకా తెలిలే.. ఊహూ...తెలిలా
ఈ... పళ్ళూ... 


హేయ్.. ఓడిపోయావ్.. ఓడిపోయావ్... ఆ...హహహాహావేస్తాను పొడుపు కథా...  వేస్తాను
చూస్తాను విప్పుకో... చూస్తాను
మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రిచరణం 2 :పగడాలా చక్రాల పచ్చని తేరునెక్కి
సూర్యుడంటి వీరుడొస్తే... దారంతా నెత్తురంటా
పగడాలా చక్రాల పచ్చని తేరునెక్కి
సూర్యుడంటి వీరుడొస్తే... దారంతా నెత్తురంటా


ఏమిటంటా? ... ఏంటబ్బా?
ఊ.. తెలీలా... ఊహూ...
ఇదీ తెలీలేదా... ఊహూ...


వక్కా... ఆకు... సున్నం...
ఆకు... వక్కా... సున్నం...హహాహావేస్తాను పొడుపు కథా...  వేస్తాను
చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రిచరణం 3 :పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి...
పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి
పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి...
పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి


కాయైనా.. పండైనా...
కాయైనా పండైనా తియ్యనైనవి
గాయమైనా మందైనా తానైనది
ఏవిటదీ? ... ఏవిటబ్బా?


తెలీలా...ఊహూ...
ఇంకా తెలీలా... తెలీలా... హహా
ప్రేమా....


ఏయ్... ఓడిపోయావ్.. ఓడిపోయావ్... హహా


వేస్తాను పొడుపు కథా... వేస్తాను
చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి
అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రిచరణం 4 :నేల మీద నిలిచేది రెండు కాళ్ళు
నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు
మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు  


నేల మీద నిలిచేది రెండు కాళ్ళు
నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు
మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు


ఏవిటది? ... ఆ.. ఏవిటది?
తెలీలా..ఊహూ.. తేలీలా... అహా


హేయ్.. నాకూ తెలీదు...
నీకూ తెలీదు... అయితే ఓడిపోయావ్... ఏవీ లేదు...
నువ్వే ఓడిపొయావ్.. మీరే ఓడిపోయారు...హహాహాhttp://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1793

Sunday, November 12, 2017

రాముడేమన్నాడోయ్

చిత్రం :  అందాల రాముడు (1973)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ 
పల్లవి :


రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్
రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్


మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్ 
చరణం 1 :మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్
మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పుణ్యమొక్కటే చివరకు మిగులునన్నాడోయ్... డొయ్ డోయ్రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్చరణం 2  :మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్ అహా
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్
మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్ అహా
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్


గొప్పకొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్
గొప్పకొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్
అప్పుచేసి పప్పుకూడు వలదన్నాడోయ్


రాముడేమన్నాడోయ్...
సీతా.. రాముడేమ్మాన్నాడోయ్చరణం 3 :కొండమీద కోతులను కొనలేరోయ్ డబ్బుతో
బండరాతి గుండెలను మార్చెనోయ్ మంచితో


నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్
నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్
కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్


రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్చరణం 4 :రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్
రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్
నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్
నీలో గల సైతానుని చంపమన్నాడోయ్... డోయ్ డొయ్ డోయ్రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్


రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1254

Friday, November 10, 2017

రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా

చిత్రం : అనార్కలి (1955)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : జిక్కి, ఘంటసాల  

 


సాకి :


మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయన చకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి... 
అనార్కలి...  అనార్కలి... అనార్కలి ...
వహ్వా 
పల్లవి : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా.....
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..రాజశేఖరా 

ఆ.. ఆ.. ఆ...ఆ.. ఆ.. ఆఆ.. ఆ.. ఆ
 రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... చరణం 1 :మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మధురమైన బాధరా... మరపురాదు... ఆ...  ఆ..
 


రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... చరణం 2 :కానిదాన కాదురా...  కనులనైన కానరా
కానిదాన కాదురా...  కనులనైన కానరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
వేగ రారా...  వేగ రారా...  వేగ రారా..