Tuesday, December 4, 2012

ఆలనగా పాలనగా

చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

చరణం 1:

నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ

అరఘడియైనా నీ ఎడబాటు.. వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

చరణం 2:

మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం

నేనంటే నీ మంగళ సూత్రం.. నువ్వంటే నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
ఆహా.. హా.. హా.. ఊ.. ఊ...

No comments:

Post a Comment