Monday, November 30, 2015

నీవే కదా నా అందాలరాశి

చిత్రం :  అందాల రాశి (1980)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు,  శైలజ




పల్లవి:


నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 


నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి..  

నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..


నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..  


నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 



చరణం 1 :


వేయి కనులతో వెతికేను నీ రూపమే...
వేయి కనులతో వెతికేను నీ రూపమే...


కోటి గొంతులతో పలికేను నీ గీతమే..
కోటి గొంతులతో పలికేను నీ గీతమే..


కలలన్నీ కర్పూర శిలలైన చోటా..
కలలన్నీ కర్పూర శిలలైన చోటా..


కలసినది మన విడిపోని జంట...


నీవే కదా నా అందాలరాశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి.. 




చరణం 2 :



ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...
ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...

ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..
ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..


నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..
నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..


నా మనసు ప్రియ చరణాల దాసి..
నా మనసు ప్రియ చరణాల దాసి.. 





నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 


నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి.. 


నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..


నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి.. 







Thursday, November 26, 2015

ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా

చిత్రం :  మంగళ తోరణాలు (1979)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, జానకి 



పల్లవి : 


ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత దూరమెందుకని
ఉదయమౌతున్నా.. 



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత అంత దూరం దేనికని
ఉదయమౌతున్నా..  ఆ.. ఆ..



చరణం 1 :


కనుల నిండా నీవే ఉంటే... కమ్మని నిదురకు చోటేది?
మనసు నిండా నీవే ఉంటే... తనువుకు నిలకడ ఎక్కడిది? 


నిట్టూర్పే ఆ తారకనడిగెను నీవాడు నిను చేర రాడెమని
బదులు పలికెను నా మూగ కన్నీరు.. అది నా జాబిలినడగమని



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత అంత దూరం దేనికని
ఉదయమౌతున్నా..  ఆ.. ఆ.. 



చరణం 2 : 



నిలిచిపోయేను గాలి పరుగు.. నీ అడుగుల సడి లేదేమని?
వెలవెలబోయెను కోయిల పిలుపు.. నీ పలుకే వినరాదేమని?



కోవెల గంటలు జాలిగ అడిగెను... నీ వాడు ఏవైపు రాడేమని?
బదులు పలికెను నా చేదు చిరునవ్వు.. అది ఆ దేవుణ్ణే అడగమని..



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా... హా..
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత దూరం దేనికని?
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4841


Wednesday, November 18, 2015

చీరకట్టింది సింగారం

చిత్రం: దేవత (1982)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల




పల్లవి :



హ్హా..ఆ..చీరకట్టింది సింగారం.. మ్మ్
చంప పూసింది.. మందారం..మ్మ్
మేను మెరిసింది బంగారం.. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
అమ్మమ్మ కొత్తగుంది ఈ మేళం..మ్మ్
ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్




హోయ్..ఈ...చీరకట్టింది సింగారం..

మ్మ్చంప పూసింది..మందారం..

మ్మ్మేను మెరిసింది..బంగారం..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్అమ్మమ్మ కొత్తగుంది..ఈ మేళం..

మ్మ్ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్



చరణం 1 :



కట్టుకొన్న చీరకేమో గీరవచ్చెను..హోయ్
కట్టుకొనె వాడినని గిచ్చి పెట్టెను..హోయ్
నిన్ను చూసి వయసుకే వయసు వచ్చేను..హోయ్
వెన్నెలొచ్చి దాన్ని మరి రెచ్చగొట్టెను..హోయ్


కన్నె సొగసుల కన్ను సైగలు..
ముద్దులు ఇచ్చి నిద్దరలేపి..వేదించెనూ
నిన్ను రమ్మని..నన్ను ఇమ్మని..
మెలకువ తెచ్చిపులకలు వచ్చి..మెప్పించెనూ


పొద్దు పొడుపు పూవల్లె..పూవు చుట్టు తేట్టెల్లె
నిన్ను నన్ను..నన్ను నిన్నూ..ఆడించెనూ


హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్
చంప పూసింది..మందారం..మ్మ్
మేను మెరిసింది..బంగారం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్


అమ్మమ్మ కొత్తగుంది..ఈ మేళం..మ్మ్
ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్





చరణం 2 :


 ఆ హా హా హా..ఆ హా హా హా
ఆ హా హా హా..ఆ ఆ ఆ


ఆశలన్ని అందమైన..పందిరాయెనూ..హోయ్
ఆనందం అందుకొనె చంద్రుడాయెనూ..హోయ్


కళ్ళు రెండు నీ కోసం కాయలాయెను..హోయ్
పెళ్ళినాటికి అవి మాగి ప్రేమ పండును..హోయ్


సన్న జాజులు ఉన్న మోజులు
విరిసేరోజు మురిసేరోజు..రానున్నదీ..ఈ


పాల పుంతగా..మేను బంధిగ..
జీవితమంతా సెలయేరంట..కానున్నదీ


నిండు మనసు నవ్వల్లే..కొండమీది దివ్వల్లే
నీలో నాలో వెలిగే వెలుగే..వలపన్నదీ..ఈ


హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్
చంప పూసింది మందారం..మ్మ్
మేను మెరిసింది బంగారం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
అమ్మమ్మ కొత్తగుంది ఈ మేళం..మ్మ్
ఇన్నాళ్ళు ఎక్కడుంది వయ్యారమూ..మ్మ్



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2779

అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా

చిత్రం  :  ప్రేమ బంధం (1976)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : సుశీల, బాలు 




పల్లవి :



అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా... అయ్యో రామా చెపితే వినడమ్మా
చోటుకాని చోట అల్లరి చేటంటే వినడు
ఒదిగి ఉండమంటే ఎదలో ఎదిగి ఎదిగి పోతాడు
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా... అయ్యోరామా చెపితే వినడమ్మా  



చరణం 1 :

ఆ...హా ఆ.... హా ఆ.. హా
నేనడిగానా ఆ చోటు... ఆహా ఆహా ఆహా
నీదేనమ్మ పొరపాటు...  పాపం
దాచుకున్న సొగసు చూసి...  ఊహు హా  అబ్బ
దాగని నీ వయసు చూసి ...ఆ... ఆ...  ఆ
ఛీ ... పాడు 



అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా....  అయ్యోరామా చెపితే వినడమ్మా 




చరణం 2 :



తీపి తీపిగా పెదవులు తడిపిందెవరమ్మా?
తేనె దొంగకు ఏ పూవో తేరగా దొరికిందమ్మా
చెక్కిలి పై గాటేమిటి చిలకమ్మా?
పోతుటీగ కాటేసింది ఓయమ్మా
చిన్నగాటుకే చెదిరిపోతే ఎట్టాగమ్మా...  రేపెట్టాగమ్మా
తేనెపట్టుకు చేరినప్పుడు చెబుతానమ్మా...  అప్పుడే చెబుతానమ్మా... ఇప్పుడే చెప్పాలి


అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...  ఊహు ఊహు ఆహా  అబ్బబ్బ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2433

Tuesday, November 17, 2015

రామచిలక తెలుపవే

చిత్రం  :  ప్రతిజ్ఞ-పాలన (1965)
సంగీతం  : ఆరుద్ర
గీతరచయిత  :  మాష్టర్ వేణు
నేపధ్య గానం  :    సుశీల    



పల్లవి :



రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో.. ప్రేమ ఏమిటో 




చరణం 1 :



కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే
కనుకలపగ నా వన్నెలు కడలి పొంగులాయెనే
కన్నె మనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే

కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే
ఆనరా..తనెవ్వరా..వరించు..నాథుడే..హా హా హా


రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో 



చరణం 2 :


అహహా ఒహొహో.. ఓ..ఓ..ఓ..ఓ..

ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో..ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక..జతగూడుట ఎన్నడే..


కానరా నీ నోములూ..ఫలించినప్పుడే


రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో






అందాలరాజు వస్తాడు


చిత్రం  :  ప్రతిజ్ఞ-పాలన (1965)
సంగీతం  : ఆరుద్ర
గీతరచయిత  :  మాష్టర్ వేణు
నేపథ్య గానం  :    సుశీల    



పల్లవి :



అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తథాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది


ఓ..ఓ..అందాలరాజు వస్తాడు..మందార మాల వేస్తాను
జగమే తథాస్తు అంటుందీ..నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది..నేడే వివాహమౌతుంది 



చరణం 1 :


నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే.. ఏ..ఏ..
మదిలో కోరిక మంగళ గీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే.. ఏ.. ఏ..
పూచిన వలపుల పులకరింతునే మేను


ఓయమ్మో..ఓయమ్మో..హోయ్..ఏమంటావ్..?


అందాలరాజు వస్తాడు.. మందార మాల వేస్తాను
జగమే తథాస్తు అంటుందీ.. నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది.. నేడే వివాహమౌతుంది




చరణం 2 :


బుగ్గన పెట్టిన నల్లని చుక్క తానవ్వే..ఏ..ఏ..
సిగ్గుబరువుతో.. కన్నె వలపు తలవంచే
జడలో కుట్టిన మొగలిపూవ్వు వీవించే..ఏ..ఏ..
జన్మ జన్మకు..అతడే..నా మగడమ్మా


ఓయమ్మో.. ఓయమ్మో.. హోయ్.. ఏమంటావ్..?


అందాలరాజు వస్తాడు.. మందార మాల వేస్తాను
జగమే తథాస్తు అంటుందీ.. నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది.. నేడే వివాహమౌతుంది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7080

తలచుకొంటే మేను






చిత్రం  :  ప్రతిజ్ఞ-పాలన (1965)
సంగీతం  : ఆరుద్ర
గీతరచయిత  :  మాష్టర్ వేణు
నేపధ్య గానం  :   ఘంటసాల, సుశీల
   



పల్లవి :



తలచుకొంటే మేను పులకరించెను
తలచుకొంటే మేను పులకరించెను
ఊహూ..హూ..ఊ..
తమకు తామే కనులు కలలు కాంచెను..ఊ..ఊ..


తలచుకొంటే మేను పులకరించెను..ఊ..ఊ..ఊ..
తనకు తానే చెలియ నన్ను చేరేను..ఊ..ఉం..ఉం.. 



చరణం 1 :


అహ..అహ..అహ..ఆ..అహ..అహా..
ప్రియుని సూటిగా చూడ బిడియ మయ్యెనూ..ఒహో..ఓ
చూడకుంటే మనసు ఎటుల నిలిచెను..ఉం..ఉం..ఉమ్మ్
చెలుడు గుసగుస లాడ.. సిగ్గు కలిగేను
సుగ్గుపడితే వలపు చిగురు తొడిగెను.. ఊ..ఊ..ఊ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..


తలచుకొంటే మేను పులకరించెను..ఓ..
తనకు తానే చెలియ నన్ను చేరేను 



చరణం 2 :



చేయి సోకిన గుండె ఝల్లుమనియేను..ఓహో..ఓహో
ఝల్లుమనీ పిదప చల్లనయ్యెను.. ఊం..ఉం
చలువ వెన్నెల వేడి గాడుపయ్యెను
మరుల మాటల వల్ల మంచు కురిసెను..ఊ..ఊ..ఊ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహ..ఆహా..


తలచుకొంటే మేను పులకరించెను..ఓ..
తనకు తానే చెలియ నన్ను చేరేను 



చరణం 3 :


చెలుని మాటలలోనా మధువు చిందేనూ..ఊ..ఊ..
పలుకు తేనెలు బ్రోలా మైకమయ్యేను
సోలి తడబడి ఎడద ఊయలూగెనూ..ఉ..ఉ..
పిచ్చ్..చ్..పడతి కాంతుని భుజము పానుపయ్యేను..ఉ..ఉ..


తలచుకొంటే మేను పులకరించెను..
ఊహూ..ఊహూ..హూ..
తనివి తీరగా ప్రేమ తానే పండేను
అహ..అహ..హా..అహా..హ..ఆ..ఆహా..హా.. 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7053



జోహారు శిఖిపించమౌళి..






చిత్రం  :  శ్రీకృష్ణ విజయం (1970)


సంగీతం  : 
పెండ్యాల

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :   సుశీల    



పల్లవి :



జోహారు శిఖిపించమౌళి..
ఇదే .. జోహారు శిఖిపించమౌళి..
ఇదే .. జోహారు రసరమ్య గుణశాలి... వనమాలి
జోహారు శిఖిపించమౌళి..  



అనుపల్లవి :



కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి

నయగార మొకకంట.. జయవీర మొకకంట..
నయగార మొకకంట.. జయవీర మొకకంట..
చిలకరించి చెలువుమించి.. నిలిచిన శ్రీకర నరవర.. సిరిదొర


జోహారు శిఖిపించమౌళి..  



చరణం 1 :


నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు

నిగమాలకే నీవు సిగబంతివైనావు... అ... అఅ... అ... అ
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నెరసిన అవతారమూర్తి... ఘనసార కీర్తి 



జోహారు శిఖిపించమౌళి..  



చరణం 2 :



చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రాకాంతు లివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ము లివిగో
ఝళం ఝళిత సురలలనా నూపుర కలరవమ్ము లివిగో
మధు కర రవమ్ములివిగో ...  మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుదూర నందన సుమమ్ము లివిగో 



జోహారు శిఖిపించమౌళి..  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=178


Friday, November 6, 2015

నా హృదయపు కోవెలలో







చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   బాలు   



పల్లవి :


నా హృదయపు కోవెలలో....  ఆ... ఆ
నా బంగారు లోగిలిలో....  ఆ...  ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...  ఆ ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...

నా హృదయపు కోవెలలో... 


చరణం 1 :


ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో... నా మనసును నిలువునా దోచితివే

నా హృదయపు కోవెలలో...  



చరణం 2 :




అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే... నా బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో...  



చరణం 3 :


ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిథులతో...
వచ్చే పోయే అతిథులతో... మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... 



ఈ చల్లని లోగిలిలో





చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   సుశీల 



పల్లవి :


ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి


ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి ... అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో... 


చరణం 1 :




పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా...
పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి 

ఈ చల్లని లోగిలిలో .... 



చరణం 2 :


శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా ...  ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి .... 

ఈ చల్లని లోగిలిలో .... 


చరణం 3 :


ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో....
వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి


ఈ చల్లని లోగిలిలో....  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1213

Thursday, November 5, 2015

నా పక్కన చోటున్నది





చిత్రం  :  సెక్రెటరి (1976)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం  :  రామకృష్ణ



పల్లవి :



నా పక్కన చోటున్నది ఒక్కరికే.. ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నా పక్కన చోటున్నది ఒక్కరికే.. ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నువ్వే... అది నువ్వే... నువ్వే...  నువ్వే   

నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నువ్వే... అది నువ్వే... నువ్వే...  నువ్వే  




చరణం 1 :



కాళిదాసు కంటబడిన కన్నెపిల్లవు.. కాలమంత ఒంటరిగా ఉండలేవు
కాళిదాసు కంటబడిన కన్నెపిల్లవు.. కాలమంత ఒంటరిగా ఉండలేవు
వాసనే చూడనట్టి వన్నె పువ్వువు
వాసనే చూడనట్టి వన్నె పువ్వువు... ఆశలన్ని గుండెలో అణుచుకోకు 


నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నువ్వే... అది నువ్వే... నువ్వే...  నువ్వే  



చరణం 2 :




పెదవి మీద పేరు వ్రాసి పెట్ట లేదు... అమృతానికి ఎన్నడూ అంటు లేదు
పెదవి మీద పేరు వ్రాసి పెట్ట లేదు... అమృతానికి ఎన్నడూ అంటు లేదు
కోరికలకు కుర్రతనం జారిపోదు.....
కోరికలకు కుర్రతనం జారిపోదు... కౌగిలిలో వెచ్చదనం ఒదులుకోకు 



నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నువ్వే... అది నువ్వే... నువ్వే...  నువ్వే  




చరణం 3 :



కడిగిన ముత్యమా రాపడని వజ్రమా...  మొగలి పువ్వులా నీవు ముడుచుకోకుమా
కడిగిన ముత్యమా రాపడని వజ్రమా...  మొగలి పువ్వులా నీవు ముడుచుకోకుమా
పొగరు నీ సొగసును పొగుడుతున్నది
పొగరు నీ సొగసును పొగుడుతున్నది... వగరైన తిక్క నీకు నగవంటిది 







Wednesday, November 4, 2015

తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు

చిత్రం :  రాజు వెడలె (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 




పల్లవి : 




ఉమ్మ్..ఉమ్మ్.. లలలా...
ఏయ్.. ఏయ్..
ఏయ్.. ఏయ్..
హ..హా..హా..హాహా..
అబ్బా.. చంపేస్తున్నావు...
నేనా... బావుంది.. నేనేం చేశాను?


తోడేస్తున్నావు... ప్రాణం తోడేస్తున్నావు
సొగసులతో...  ఆ సొగసుల నిగనిగతో
పరువంతో... ఆ పరువం మిసమిసతో
తోడేస్తున్నావు... అబ్బా...  ప్రాణం తోడేస్తున్నావు


దొలి చేస్తున్నావు...  గుండెను దొలి చేస్తున్నావు
చూపులతో... ఆ చూపుల బాకులతో
నవ్వులతో...  ఆ నవ్వుల రవ్వలతో
దొలి చేస్తున్నావు...  గుండెను తొలిచేస్తున్నావు



చరణం 1 :


మల్లెపువ్వులు అగరువత్తులు.. అబ్బ... మతిపోగొట్టినవి
కమ్మని తావి చల్లని గాలి కలవరపెట్టినవి

నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది
నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది

అబ్బబ్బబ్బ తోడేస్తున్నావు...  ప్రాణం తోడేస్తున్నావు
దొలి చేస్తున్నావు...  గుండెను దొలి చేస్తున్నావు



చరణం 2 :


వయసు పొంకము.. వగల బింకము.. వదలొద్దని పిలిచింది
గుండె విరిచి.. నిండు మగసిరి.. ఉండలేనని ఉరికింది


పెదవీ పెదవీ... తనువూ తనువూ ఒకటైపోవాలి
ఉదయం నుంచీ... ఉదయం వరకూ క్షణమే అనిపించాలి
పెదవీ పెదవీ... తనువూ తనువూ ఒకటై పోవాలి
ఉదయం నుంచీ ఉదయం వరకూ క్షణమే అనిపించాలి 

అమ్మమ్మమ్మ... దొలి చేస్తున్నావు... గుండెను దొలి చేస్తున్నావు
తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు

చూపులతో... ఆ చూపుల బాకులతో..
సొగసులతో...  ఆ సొగసుల నిగనిగతో
దొలి చేస్తున్నావు... గుండెను దొలి చేస్తున్నావు
అబ్బ దొలి చేస్తున్నావు..  ప్రాణం తోడేస్తున్నావు







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2439

Sunday, November 1, 2015

పని చేసే రైతన్నా

చిత్రం :  పాడిపంటలు (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  బాలు



పల్లవి : 


పని చేసే రైతన్నా.. పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌


పని చేసే రైతన్నా..  పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌



చరణం 1 :



చేతి నిండ పని ఉంది.. చేతుల్లో బలం ఉంది
చేతి నిండ పని ఉంది.. చేతుల్లో బలం ఉంది
కొండల్నే పిండిచేసి వరదలకూ కరువులకూ ఆనకట్ట కట్టేద్దాం
జలాలతో పొలాలనే పండిద్దాం.. పండిద్దాం
జనాలలో ఆనందం నిండిద్దాం.. నిండిద్దాం   


       

పని చేసే రైతన్నా.. పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌



చరణం 2 :


నేల మనది.. నింగి మనది.. గాలి.. నీరు.. వెలుగు మనవి
నేల మనది.. నింగి మనది.. గాలి.. నీరు.. వెలుగు మనవి
అదును చూసి.. పదును చేసి అన్నిటిని అదుపు జేసి
అదును చూసి.. పదును చేసి అన్నిటిని అదుపు జేసి
మనదారికి మళ్ళిద్దాం తరుగులేని సంపదలే కురిపిద్దాం.. కురిపిద్దాం
చెరిగిపోని చరిత్రనే సృష్టిద్దాం.. సృష్టిద్దాం     



పని చేసే రైతన్నా..  పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌..  మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌