Wednesday, September 28, 2016

పడిలేచే కెరటం చూడు








చిత్రం :  గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల 




పల్లవి : 



పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు 



పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు  



చరణం 1 :



వెన్నెల విరిసే వేళా... వన్నెలు మెరిసే వేళా
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
మిసమిసలా చిన్నలు చూడు... ఉసిగొలిపే హృదయం చూడు




 

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు 

తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు  

పడిలేచే కెరటం చూడు...



చరణం 2 :




పరులెవరూలేని చోటా... పరువాలు పూచే చోటా
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
మరుగులేని మమతలు చూడూ... మనసుంటే నన్నే కూడు 





పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...



డీరిడిరిడిరి డీరిడీ







చిత్రం :  గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల




పల్లవి : 



ఓహో వాలు చూపుల వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి


డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ


చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే
హహహహ ఉహూ..


డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ  



చరణం 1 :



అందమైన దానివీ...  ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ...  వలచి వస్తే
హహహహ ఉహ్హూ..



డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ



చరణం 2 :





చిలిపి చూపుల కన్నులూ
మొలక నవ్వుల పెదవులూ
పలకరించే వన్నెలూ.. పులకరిస్తే
హహహహ ఉహ్హూ..



డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ



చరణం 3 :





నిన్న సంగతి మరచిపో
నేటి సుఖమే తలచుకో
రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం
హహహహ ఉహ్హూ..



డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3001


ఎర్రా బుగ్గల మీద









చిత్రం :  గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 





పల్లవి : 


ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా 


ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది




చరణం 1 :



మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా


మొక్కజొన్న తోటలోన మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే


ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా 

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది





చరణం 2 :



కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ... రేవు కాడ...
కాకినాడ... రేవు కాడ... 

కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా 


కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా 


ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా 

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది




చరణం 3 :



గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట... చెరువు కాడ...
గండిపేట... చెరువు కాడ...
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా


గండిపేట చెరువు కాడ గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి గాండ్రుమంటయే 




ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా 

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3503

Tuesday, September 27, 2016

మల్లె పూల చల్లగాలి





చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు




పల్లవి :



ఆ ఆ ఆహా
ఆ ఆ ఆఆఆఆ


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...
ఏలా... ఇదేలా
ఆవేదనే... ఈనాటికి...మిగిలింది నాకు..
మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ



చరణం 1 :



వేదికై పోయే మనకథంతా... నాటకం అయేను మనుగడంతా...
శోధనై పోయే హృదయమంతా...బాటలే మారెనే పయనమంతా...
పండించవే వసంతం...పంచవేళా సుగంధం... నాగుండె గుడిలో నిలవాలి...రా


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక... ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి.... మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ




చరణం 2 :





మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి....మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


తామరాలకైనా నీటి లాగా...భర్తయు భార్యాయు కలవరంట...
తోడుగా చేరి బతికేందుకు...సూత్రమూ మంత్రమూ ఎందుకంట...
సొంతం అనేది లేక...ప్రేమ బంధాలు లేక మోడంటి జీవితమింకెలా...హ


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి....మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ....







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12451

చెలీ రావా వరాలీవా





చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు




పల్లవి :


ఆ....ఆ....ఆ....ఆ....
చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ
నీ జతకై వేచేనూ
నిలువెల్లా నీవే...
చెలీ రావా వరాలీవా... 



చరణం 1 :


ఈవేదన తాళలేనే మామా చందమామా
వెన్నెల్లనే పూలు రువ్వీ చూడూ ఊసులాడూ
చెప్పాలనీ నీతో ఏదో చిన్నమాటా
చెయ్యాలనీ స్నేహం నీతో పూటపూటా
ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా


చెలీ రావా వరాలీవా...



చరణం 2 :




వయ్యారాలా నీలినింగీ పాడే కధలు పాడే
ఉయ్యాలగా చల్లగాలీ ఆడే చిందులాడే
సుగంధాల ప్రేమా అందించగా రాదా
సుతారాల మాటా చిందించగా రాదా
ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా


చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ
నీ జతకై వేచేనూ
నిలువెల్లా నీవే...



చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12453

Monday, September 26, 2016

ముద్దులొలుకు చిన్నది





చిత్రం :  అవేకళ్లు (1967)
సంగీతం : వేదా
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి : 



ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ....



చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
చిలిపి చిన్నికృష్ణుడు...అహ..అహ...అహ... 




చరణం 1 :




నీ గాజుల మీద....  ఒక తీయని ముద్దు
ఆ.....ఆ....ఆ...
సిగ్గ పూవ్వుల మీద....  ఒక కమ్మని ముద్దు
ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు
నిను మలచిన దేవునికే.... బంగరు ముద్దు...



ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ..ఆ..




చరణం 2 :




నీ కన్నుల మీద...  ఆ వెన్నెల ముద్దు...
ఆ...ఆ....ఆ...
చెలి చెక్కిలి మీద....  ఒక చక్కని ముద్దు
విరిపానుపు మీద విరబూసే ముద్దు...
కలకాలము నా మదిలో వెలిగే ముద్దు


చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు


ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది


లలలలల..లా...లలలలల...లా....
లలలలల..లా...లలలలల...లా....




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3531

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే







చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :



పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే....
పన్నీటి స్నానాలు చేసే వేళలో...


నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో...


చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి...


పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ


సరేనంటే రూపం తాపం సమర్పయామీ
నీ సన్నిధిలోనే సమస్తము... నివేదయామీ 





చరణం 1 :


కునుకుండదు కన్నులలోనా... కుదురుండదు గుండెలలో..
అణువణువు కోరుకుతున్నది... తియ్యని మైకం...



ఎదిగోచ్చిన వన్నెల వాన... ఒదిగుండదు వంపులలో
చెరనోదిలి ఉరుకుతున్నది ... వయసు వేగం


మనసుపడే కానుకా... అందించనా ప్రేమికా
దహించితే కోరికా... సహించకే గోపికా


అదిరేటి అధరాల ఆనా...
అందం చందం అన్ని నీకే... సమర్పయామి
ఆనందమంటే చూపిస్తాలే... చెలి ఫాలోమీ


పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే


పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ





చరణం 2 :



నులివెచ్చని ముచ్చటలోన... తొలి ముద్దులు పుచ్చుకోనీ
సరిహద్దులు దాటవే  ఒంటరి కిన్నెరసాని


నును మెత్తని సోయగమంతా... సరికొత్తగ విచ్చుకోని
ఎదరొచ్చిన కాముని సేవకు  అంకితమవనీ


అవి ఇవి ఇమ్మనీ... అదే పనిగా వేడనీ
ఇహం పరం దువ్వనీ... పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ...


దేహం దేహం తాకే వేళ... సంతర్పయామీ
సందేహం మోహం తీరేవేళ... సంతోషయామీ



పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే
ముద్దులగుమ్మకు దిగులు పుట్టే..
పన్నీటి స్నానాలు చేసే వేళలో...



నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో...


చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి


నా ప్రేమ సామ్రాజ్యదేవి...
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ....



నిన్ను చూడగానె






చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :



నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్


నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్


చిట్టిముద్దు పెట్టనా..పెట్టుకో
బుగ్గపండు కొట్టనా...కొట్టుకో


లేతపట్టు పట్టనా..పట్టుకో
మోజుకొద్ది ముట్టనా...ముట్టుకో


సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని చోరీ వలపు నీదోచ్


నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్


నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్ 



చరణం 1 :



అమ్మమ్మమ్మా... ఔచ్ ఔచ్
అబ్బబ్బబ్బా...  ఔచ్ ఔచ్


లాఠీ ఫ్లూటుగ మారిపోయెనమ్మా .. సరిగమా సరసమా.. లబుజుగా ఉంది లేమ్మా
లూఠీ చేసిన మనసునాది సుమ్మా.. ప్రియతమా యమయమా... చనువుగా దోచుకోమ్మా


ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్..
జాకుపాటు జామపండు నీదోనోచ్..
కౌగిలింతలోచ్.. ఖైదుచెయ్యవోచ్
పాలపిట్టనోచ్... పూలు పెట్టవోచ్
ఒళ్ళు అప్పగించకుంటె.. కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదరపోనోచ్..


నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్


నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్




చరణం 2 :




నీలో కసి నను కాటువేసెనమ్మా.. మొహబ్బతు కసరత్తు ..ఘాటుగా సాగెనమ్మా
నీలో ఫిగరుకు బీటు తప్పదమ్మా.. కాకాపట్టు సోకేపెట్టు ప్లేటునే మార్చకమ్మా


ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్
ఆడుకుంటె ఒళ్ళు గుల్ల అవుతుందోచ్


పాట పాడకోచ్.. పప్పులుడకవోచ్
తాపమెందుకోచ్... తాళమెయ్యవోచ్
అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచుకున్న సిల్లీ గోడవ చాలోచ్..


నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్


నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్



చిలిపి చిలక ఐ లవ్ యూ





చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :



ఆ...... ఆ... ఆ...... ఆ...
ఆ...ఆ....ఆహా....ఆహా


చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణాలలో...
చిలకపచ్చ పైటకీ... కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం..


ఆ...... ఆ... ఆ...... ఆ...
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ... కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం



చరణం 1 :



సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలిగే వయ్యారాల ఒంపు
ఆ..... కబురు పంపు..
ఆ.... గుబులు చంపూ...
వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోసాక వయసు గోదాట్లోకి దింపు..
ఆ.... మరుల గుంపు..
ఆ.... మగువ తెంపు..


అహో ప్రియా మహోదయా లయ దయా లగావో
సుహాసిని సుభాషిణి చెలీ సఖీ చెలావో
ఈ వసంత పూల వరదలా...ఆ..
నన్ను అల్లుకోవె తీగ మరదలా... ఆ..
నూజివీడు మావిడో...మోజుపడ్డ కాముడో... ఇచ్చాడమ్మా తీయని జీవితం



ఆ...... ఆ... ఆ...... ఆ...
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణాలలో 



చరణం 2 :




నీలాలమబ్బుల్లొ నీళ్ళోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు
ఆ.... కలల కాపు...
ఆ.... కనుల కైపూ...


పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టి పోయాక తెలిసింది పిల్లాడి ఊపు...
ఆ.... చిలిపి చూపు
ఆ... వలపు రేపు


వరూధిని సరోజిని ఎదే కులూమనాలీ..
ప్రియా ప్రియా హిమాలయా వరించుకోమనాలి..
కోనసీమ కోకమడతలా..
చిగురాకు రైక ఎత్తిపొడుపులా...
కొత్తపల్లి కొబ్బరో... కొంగుపల్లి జబ్బరో.. నచ్చిందమ్మా అమ్మడి వాలకం



ఆ...... ఆ... ఆ...... ఆ...
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం


కు కూ... కొమ్మరెమ్మ పూసే రోజు






చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :



కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కడిలే వేళలో...
మామిడి పూతల మన్మధ కోయిల...


కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు



చరణం 1 :



స్వరాలే...వలపు వరాలై...చిలిపి శరాలై...పెదవి కాటేయగా..
చలించే... స్వరాలే
వలచి వరించే ... వయసు వరాలే..
ఎదలు హరించే ... చిలిపి శరాలై...  కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే... ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై... విరియగా...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా..  పదసని నీ... గసరిద ద... సనిదమ
మా...  నిదమగ గ...  గమగమ దని....
సా... గేదెపుడు నీ పేదవుల్ల ద... దారి విడిచి
మా.. మార్గశిరపు గా..గాలులు మురళిగా... విన్న వేళ కన్నె రాధ పులకించే...



కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు




చరణం 2 :




ఆ..... అ
ఫలించే... రసాలే
తరిచి తరించే... పడుచు నిషాలో..
కవిత లిఖించే... యువత పేదాల... సుధలు పొంగించగా...
సన జాజితొడిమలో... చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే... తానమాడునమ్మ


కన్నె చూపులే... కసి కసి కసి కసి
కారు మబ్బులై... ముసరగ...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా... పదసని నీ...  గసరిద ద...  సనిదమ
మా...  నిదమగ గ...  గమగమ దని...


సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు
మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే....



కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు








Friday, September 23, 2016

మా వారు బంగారు కొండా




చిత్రం : ప్రేమ మూర్తులు (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :




మా వారు బంగారు కొండా...
మా వారు బంగారు కొండా... మనసైన అందాల దొంగా
పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా
కనుగీటుతు ఉంటారు...  నను వదలను అంటారు



మా రాధా బంగారు కొండా..
మా రాధా బంగారు కొండా... మనసైన అందాల దొంగా
కడకొంగున కట్టేసి...  తన చుట్టు తిప్పేసి
చిలిపిగ ఉడికిస్తుంది...  కిలకిల నవ్వేస్తుంది 


మా వారు బంగారు కొండా... మా రాధా బంగారు కొండా



చరణం 1 :




మురిపాలను కలబోసి చిరు ముద్దలు పెడుతుంటే
కొనవేలు కొరికింది ఎవరో
మలి సంధ్యల జిలుగులను మౌనంగా చూస్తుంటే
అరికాలు గిల్లింది ఎవరో


నిదురలోన నేనుంటే అదను చూసి ముద్దాడి
ఒదిగిపోయి చూసింది ఎవరో
ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట
ఆడింది ఇద్దరము అవునా
..


మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా




చరణం 2 :




గుబురేసిన చీకట్లో గుబులేదో నటియించి
గుండె మీద వాలిపోలేదా
గుడిమెట్లు దిగుతుంటే పడిపోతావంటూ
నా నడుమండి పెనవేయలేదా


సీమంతం కావాలా శ్రీమతిగారు అంటే
సిగ్గుతో తలవాల్చలేదా
ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో
ఆనాడె తెలుసుకోలేదా..




మా రాధా బంగారు కొండా... మనసైన అందాల దొంగా
పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా
కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు

మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2671

సిరిసిరి మువ్వల నవ్వు






చిత్రం : ప్రేమ మూర్తులు (1982)

సంగీతం :  చక్రవర్తి

నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :



సిరి సిరి మువ్వల నవ్వు... చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కథకిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు



సిరి సిరి మువ్వల నవ్వు... చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కథకిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు





చరణం 1 : 






చల్లని మనసే పూచింది... మల్లెల మాలిక కట్టింది 

నిను చేరి మేడలో వేసిందీ 

మురిపాల పూలు...  నీ ఆనవాలు 

మురిపాల పూలు...  నీ ఆనవాలు



మనసేమో మందారం ఇంపైన సంపెంగ వయ్యారం 

పూదోటలా  విరిబాటలా పయనించుదాం 

కమ్మని కలలు కాపురము....  చక్కని వలపుల మందిరము




సిరి సిరి మువ్వల నవ్వు... చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కథకిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు





చరణం 2 :



మోహన మురళి మోగింది... మంజుల గానం సాగింది 

నా మేను నాట్యమాడింది 

హృదయాలలోన...  కెరటాలు లేచే 

హృదయాలలోన...  కెరటాలు లేచే


సరిగంగ స్నానాలు... సరసాల జలకాలు ఆడాలి 

అనురాగమే ఆనందమై... మన సొంతము 

అందాలన్నీ హరివిల్లు...  పూచిన ప్రణయం పొదరిల్లు




సిరి సిరి మువ్వల నవ్వు... చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కథకిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు

ఆ....హా హా హా ...లా లా లా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2758

నీకే మనసు ఇచ్చా




చిత్రం :  కల్యాణ రాముడు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు




పల్లవి  :

ఆ... ఆహా... ఆఆహా... ఆ... ఆహా... ఆఆహా
ఆ... ఆహా... ఆఆహా... ఆ... ఆహా... ఆఆహా


ఆహా కన్నె చిలకా...  ఆహాహా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా


నీకే మనసు ఇచ్చా...  అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా ... అందుకే కోరి వచ్చా



చరణం 1 :




గాడిద పోలిన నడకలో...  ఆ కాకిని పోలిన గొంతులో అ.. ఆ..
హంసను మించిన నడకలో...  కోకిలనే మించిన గొంతులో


ఆశలు పొంగే పొంగి పొంగే...  ఆశలు పొంగే పొంగి పొంగే
ఆ... తరువాతా.. మరచిపోయా.. ఆ...  ఆ..
జ్ఞాపకం వచ్చె నాకూ...  నీవు నా చిట్టి రాణీ..



నీకే మనసు ఇచ్చా... అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా... అందుకే కోరి వచ్చా 



చరణం 2 :




తీయని ముద్దొకటి ఇవ్వరాదే...  నా కోరిక తీర్చుట తప్పుకాదే
తీయని ముద్దొకటి ఇవ్వరాదే...  నా కోరిక తీర్చుట తప్పుకాదే
చక్కని చిలకా... టక్కరి నక్కా... అయ్యయ్యయ్యో.. మరచిపోయా..
ఆ.. చక్కని చిలకా ... టక్కరి జింక... చక్కెర రంగులరవ్వా జాజి పూవా
నా మనసు ఇచ్చా మోజే మోసుకొచ్చా... 



నీకే మనసు ఇచ్చా... అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా... అందుకే కోరి వచ్చా 





చరణం 3 :


తరగని ఊహలు రేగెనే నా తలపులు ఊయలలూగెనే
తరగని ఊహలు రేగెనే నా తలపులు ఊయలలూగెనే
కనకరించీ..పలకరించీ చేర రావే..కలిసిపోవే
పాడవేల నాతో..తోడుగా చిట్టిరాణీ




నీకే మనసు ఇచ్చా...  అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా ... అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ...  నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా 




Tuesday, September 20, 2016

సన్నజాజి పడకా








చిత్రం :  క్షత్రియపుత్రుడు  (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి  :


సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే



మనసులో ప్రేమే ఉంది...  మరువని మాటే ఉంది
మాయనీ ఊసేపొంగి పాటై రావే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే 





చరణం 1 :



కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు ... యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి


అండ దండ నీవేనని...  పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళ్ళయినది రావే
దిండే పంచే వెళ్ళయినది రావే


సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే



సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే






ధర్మం శరణం గచ్ఛామి






చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ 





పల్లవి  :



ధర్మం... శరణం గచ్ఛామి దానం... శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి



ఇంతో అంతో... ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం....  లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి...  దానం శరణం గచ్ఛామి




చరణం 1 :



తెల్ల వారితే కూడు దక్కకా... పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కకా...  పొద్దు వాలితే గూడు చిక్కకా
బాధలు మోసే అభాగ్యులం... బతుకులు ఈడ్చే అనాథలం
అభాగ్యులం అనాథలం...  అభాగ్యులం అనాథలం




ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి




చరణం 2  :




కన్నవారికి కానివారమై... ఈ.... ఈ.... ఈ.
కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో .... ఎన్ని కాళ్ళకు మొక్కామో
అభాగ్యులం అనాథలం .... అభాగ్యులం అనాథలం



ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి....  దానం శరణం గచ్ఛామి






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5660

Thursday, September 15, 2016

దండాలయ్యా సామికి




చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు





పల్లవి :



శ్రీశైలంలో మల్లన్న...  సింహాద్రిలో అప్పన్న
తిరుపతిలో ఎంకన్న...  భద్దరగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత .. అయ్యా సామీ నువ్వేనంటా


దండాలయ్యా సామికి...  దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి...  దండకాలు దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి...  దాసుల గాచే సామికి దండకాలు


కొండంతా అండల్లే కొలువైన... మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర ఓ....  మా దొర....  ఓ... 




చరణం 1 : 



సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి
సెమటోచ్చే వోడంటే ప్రాణం మా సామికి
మచ్చలేని మనిషిరా....  మచ్చరమే లేదురా
ఎదురులేని నేతరా....  ఎదురులేని నేతరా
చేతికెముకలేని దాతరా....  ఎముకలేని దాతరా
ఎదలో నిలుపుకుంటే...  ఒదిగిపోవు దేవరా




దండాలయ్యా సామికి.... దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు...
దండాలయ్యా సామికి.... దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన... మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర...  ఓ...  మా దొర....  ఓ







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5652


Wednesday, September 14, 2016

సీతమ్మ అందాలు





చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ 





పల్లవి :


సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు


సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు


ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమై నాచోటా వేద మంత్రాలు
ఏకమై నాచోటా వేద మంత్రాలు 






చరణం 1 : 



హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయ్యి
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలు 


సొంపులన్ని గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు


తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
వుక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు 




చరణం 2 :



తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్


మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా... అబ్బో ఆశ…


శృంగార పెళ్ళికొడకా… ఇది బంగారు వన్నె చిలకా
శృంగార పెళ్ళికొడకా ఇది బంగారు వన్నె చిలకా
మువ్వకులిస్తే రాదు మోజుపడక
మువ్వకులిస్తే రాదు మోజుపడక


తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్


హేయ్ రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన... ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన...  ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా


రాయంటి చిన్నవాడా… మా రాయుడోరి చిన్నవాడా…
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనువాడతాను గాని మాను అలకా



తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్ 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5795

హైలెస్సో హైలెస్సో







చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, 
చిత్ర,  పల్లవి





పల్లవి :



హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా 


సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా
నువ్వయినా అహ నేనయినా అహ రేవైనా ఆ నావైనా


సంద్రాల వీణల సొంతమై...  హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లో సంద్రమే ... ఓ ఓ ఓ ... హైలెస్సో హైలెస్సా
నింగి నీలమంతా సంద్రమే...  ఓ ఓ ఓ ... హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే...  ఓ... ఓ... 


నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే  



చరణం 1  :



Life is a holiday jolly day... హైలెస్సో హైలెస్సా
Spend it away in a fabulous way ... హైలెస్సో హైలెస్సా
You need a break boy... don't you thank me?
Eat a piece of cake ... హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా
You need a break boy... don't you thank me?
Eat a piece of cake ... హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా



Twinkle little star I know what you are
jaane bidO yaar golitO maar
Twinkle little star I know what you are
jaane bidO yaar golitO maar
హైలెస్సో హైలెస్సా...  Life is a tamasha
you sing idvaneesha...  I don't know saapaasa


నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
అహ ఓ ఓ ఓ...  హైలెస్సో హైలెస్సా


చరణం 2  :



ఆకతాయి పరువాల కొంటెగోల..  కోటి సంబరాలా 
ఆకతాయి పరువాల కొంటెగోల..  కోటి సంబరాలా 
ఆపకండి ఈ వేళ కూనలాలా కొత్త వానలాలా 
ఆపకండి ఈ వేళ కూనలాలా కొత్త వానలాలా 


కోటి సంబరాల...  కొత్త వానలాలా 
కోటి సంబరాల...  కొత్త వానలాలా 


చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా 
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా 
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా



నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే


చరణం 4  :



హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..
ఆ..ఆ
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్


హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలే కౌగిలని కరిగావంటే గంగమ్మా



నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నడిసంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ


నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో
నింగి నెలవంక సంద్రమే హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో
నింగి నెలవంక సంద్రమే హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నెలవంక సంద్రమే


లా లా ల లా లా ల.. 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5651

మూడుముళ్ళు ఏసినాక






చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, ఎస్.పి. శైలజ  





పల్లవి :


ఆ ఆ ఆ ఆ హ హ హ హ హ
ఆ ఆ ఆ ఆ అహహ అహహ హ
మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా
హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా
హ హ హ హ హ



ఆకుపచ్చకొండల్లో ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చగుండెల్లో
ఆకుపచ్చకొండల్లో గోరువెచ్చగుండెల్లో
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంటా
హ హ హ హ హ


మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా... హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా...  హ హ హ హ హ




చరణం 1 :


హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....


హొయ్ పుష్యమాసమొచ్చింది భోగిమంటలేసింది
కొత్తవేడి పుట్టింది గుండెలోనా.... హ హ హ.......


రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెదా
కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్



మంచుదేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా
అహహ అహహ అహహ అహహ
వణుకులమ్మ తిరనాళ్ళే ఓరినాయనో
సీతమ్మోరీ సిటికెన ఏలూ సిలక తొడిగితె సిగ్గులెర్రనా
రాములోరు ఆ సిలక కొరికితె సీతమ్మోరీ బుగ్గలెర్రనా


మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా... హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా...  హ హ హ హ హ



చరణం 2 :



హాయి దాయి దాయి దాయి హాయీ
హాయీ దాయి దాయి దాయి హాయీ
వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది
చింతచెట్టు వెతికింది చీకటింటా... హ హ హ హ హ


కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఉత్తమాటలెందుకూ తెచ్చుకోర ఊయలా
హా హా ... హొయ్ హొయ్ హొయ్


ముద్దువాన వెలిసింది పొద్దుపొడుపు తెలిసింది
వయసువరస మారింది ఓరి మన్మధా


మూడుముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా
జోరు కాస్త తగ్గనీర జో జో జో


జోజో జోజో జోజోజో
జోజో జోజో జోజోజో





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5804

చినుకులన్నీ కలిసి





చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, చిత్ర 





పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ

ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ

ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ


చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి 


చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి




కడలిలో వెతకొద్దు కావేరినీరు
కడుపులో వెతకొద్దు...  కన్నీరు కారు


గుండెలోనే ఉంది గుట్టుగా గంగా...  నీ గంగా
యెండ మావుల మీద యెందుకా బెంగా



రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి ఊయలలు
నీవుతో నాకన్ని..







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5807

Tuesday, September 13, 2016

నిన్ను తలచి మైమరచా





చిత్రం :  విచిత్ర సోదరులు (1989)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  బాలు 




పల్లవి :




నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ...  ఈ భూమి చేరదని
నాడు తెలియదులే... ఈ నాడు తెలిసెనులే



ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా...  చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే  




చరణం 1 :




ఆడుకుంది నాతో..జాలిలేని దైవం..
పొందలేక నిన్ను..ఓడిపోయె జీవితం


జోరు వానలోన...  ఉప్పునైతి నేనే
హోరు గాలిలోన... ఊకనైతి నేనే..


గాలి మేడలే కట్టుకున్నా..చిత్రమే...  అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్నా..చిత్రమే...  అది చిత్రమే..
కథ ముగిసెను కాదా... కల చెదిరెను కాదా..
అంతే..... 





నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే




చరణం 2 :




కళ్ళలోన నేను... కట్టుకున్న కోట
నేడు కూలిపొయే... ఆశ తీరు పూత..
కోరుకున్న యోగం... జారుకుంది నేడు..
చీకటేమో నాలో... చేరుకుంది చూడు..


రాసి ఉన్న తల రాత తప్పాడు... చిత్రమే...  అది చిత్రమే..
గుండె కోతలే నాకు ఇప్పుడు... చిత్రమే...  అది చిత్రమే..
కథ ముగిసెను కాదా... కల చెదిరెను కాదా..
అంతే... 





నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ...  ఈ భూమి చేరదని
నాడు తెలియదులే... ఈ నాడు తెలిసెనులే



ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా...  చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే  








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5624

Sunday, September 11, 2016

మధుర మురళి హృదయ రవళి




చిత్రం :  ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 




పల్లవి :



మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి... పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా..  నా అందాలు నీవే రా కన్నా

ఈ బృందా విహారాలలోనా...  నా అందాలు నీవే రా కన్నా


మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి...  సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా...  ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా...  ఎవరున్నారు రాధమ్మ కన్నా




చరణం 1 :




గోధూళి వేళల్లో.. గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో 


పున్నాగ తోటల్లో..  సన్నాయి పందిట్లో
నాజూకులన్నీ నాకు దక్కేవేళల్లో
 

పగలో అవతారం.. రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ 


రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము...  ఇక నీదే ఈ సరసాల సంగీతం 


మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి... సాగే సుడి రేగే
ఈ బృందావిహారాలలోనా... నా అందాలు నీవే రా కన్నా
ఈ బృందావిహారాలలోనా... ఎవరున్నారు రాధమ్మ కన్నా







చరణం 2 :




హేమంత వేళల్లో...  లే మంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే 


కార్తీక వెన్నెల్లో... ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే 


ముద్దే మందారం ... మనసే మకరందం
సిగ్గే సిందూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే 

పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం




మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి... పొంగె యద పొంగె 


ఈ బృందావిహారాలలోనా... ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోనా...  నా అందాలు నీవే రా కన్నా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5786

వాన మేఘం







చిత్రం :  డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  చిత్ర






పల్లవి :



వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం
మహా సుఖం తడి స్వరం...  ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం...  జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో..  వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా


వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం



చరణం 1 :



నింగి నా ముంగిలై నీటి తోరణాలతో...  హొ
వంగి నా పొంగులే వూగే చుంబనాలతో
కన్ను కన్ను కవ్వింతలోతడిపొడి తుళ్ళింతలో
కసికసి రెట్టింతలో...  అది ఇది అంటింతలో
సయ్యాటాడే ఒయ్యారాలేమో లేతలేతగా
చేతికందగ...  జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా


వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం
మహా సుఖం తడి స్వరం...  ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం...  జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో..  వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా


వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం





చరణం 2 :




మహాసుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా




వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం
మహా సుఖం తడి స్వరం...  ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం...  జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో..  వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా


వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయదాహం







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5643

Saturday, September 10, 2016

కాలమైన దైవమైన






చిత్రం :  డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  చిత్ర





పల్లవి :


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం 


నిప్పులాంటి ఆశయం నీరుకాని నిశ్చయం  


ఆడకూ అగ్నితో హే బహుపరాక్ పో.. 


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం  





చరణం 1 :




వీచే గాలీ నీ సొంతం కాదు
తనకంతం లేదు అది ఆపేదెవరూ
మాలో ప్రేమకూ ఎదురే లేదు
ఏ బెదురూ లేదు ఇక నిదరే రాదు 


మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా
మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా  


ఆహా పూవంటి నీ ఒంటికే తావినై
మదిలో మధువై మనసే తనువై నేడు 


 

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం
 




చరణం 2 :



పేచీ కొస్తేను పూచీ మాదా
తెగ వాచీ పోదా మారీచా నీచా..
రాజీ కొచ్చేయి మాజీ యోధా
మాతాజీ నాధ మరియాదే లేదా 


ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ
ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ


ప్రేమ తుప్పంటనీ చండ్రనిప్పంటిదీ
వలపు గెలుపు చివరకు మావే లేవోయ్


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం
నిప్పులాంటి హా ఆశయం...  హా
నీరుకాని హా నిశ్చయం...  హా
ఆడకూ అగ్నితో...  హే బహుపరాక్...  పో..


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం 










http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5787

రేగుతున్నదొక రాగం







చిత్రం :  డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు





పల్లవి :




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా...  కలలే కన్ను గీటగా...  కసిగా




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా




చరణం 1 :



చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడలేదని
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ
ఈ పిలుపే పిలిచే వలపై పెదవుల్లో దాగి




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా...  కలలే కన్ను గీటగా...  కసిగా




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా




చరణం 2 :




తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయే మరులే పొంగే
ముద్దాడసాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లె పూల వాసన
సొగసులే సోకినా వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో ఎదలేడై లేచి




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా...  కలలే కన్ను గీటగా...  కసిగా




రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5642

Friday, September 9, 2016

చిన్నారి పొన్నారి కిట్టయ్య






చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, జానకి 




పల్లవి :


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య 


అమ్మ నన్ను కొట్టింది బాబోయ్...  అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న...  నిన్నూరడించ నేనున్నా 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా 




చరణం 1 :



నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరొక
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్లితివేమో...   మన్నుతిని చాటుగా దాగితివేమో 

అమ్మ మన్నుతినంగ నే చిచువునో  ఆకొంతినో  వెల్లినో చూదు నోలు ఆఆ
వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామే కోపంరా 

పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా 

వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది
పచ్చికొట్టిపోయామా  పాలెవలు ఇస్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు  చెప్పు 


అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు  




చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టరునాన్నా... ఎవరమ్మా 





చరణం 2 :




చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టెను...  పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పెను
యశోదను కానురా నిను దండించ...  సత్యను కానురా నిను సాధించ
ఎవ్వరు నువ్వని..  ఈ..  ఈ ..... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు
ఎవరు కానని విడిచి వెళ్లకు...  నన్ను విడిచి వెళ్లకు
వెళ్ళము వెళ్ళములేమ్మ




చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య 


అమ్మ నన్ను కొట్టింది బాబోయ్...  అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న... అహా.. ఊరుకోను.. 
 నిన్నూరడించ నేనున్నా 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5773





సాపాటు ఎటూ లేదు




చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు 



పల్లవి :


హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు





సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్



సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్




చరణం 1 :



మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా 


మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా 


డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్




సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్




చరణం 2 :



బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా


ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా


ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా... ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్


సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్




చరణం 3 : 



సంతాన మూలికలము సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు... సంపాదనొకటి కరువురా



చదవెయ్య సీటు లేదు... చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్





సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5619