Showing posts with label ఏసుదాసు. Show all posts
Showing posts with label ఏసుదాసు. Show all posts

Thursday, May 18, 2017

మరచిపో నేస్తమా

చిత్రం : జీవన పోరాటం (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : ఏసుదాసు





పల్లవి : 


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు
నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో..
గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యలు... ఇక వినిపించునా కనిపించునా
వినిపించునా....  కనిపించునా


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


చరణం 1 :


ఆ... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ..
నీ కంటి పాపతో....
నీ కంటి పాపతో....  కన్నీరు చల్లకు..
పన్నీట వెన్నెలా జల్లుకో..
కొత్త ఆశలే తీగలల్లుకో
మన్నిస్తున్నాలే మాజీ ప్రేయసి


పచ్చని సిరులు... వెచ్చని మరులు... నచ్చిన వరుడు...నూరేళ్ళు
నీ తోడుగా వర్థిల్లుగా..
నీ తోడుగా వర్థిల్లుగా..





చరణం 2 :


ఆకాశ వీధిలో...
ఆకాశ వీధిలో ఏ తారనడిగినా..
చెబుతుందిలే మన ప్రేమ గాధలు..
భగ్న జీవుల గుండె కోతలు
గెలుపే నీదమ్మ... జొహరందుకో


పగిలిన హృదయం.. చిలికిన రక్తం.. కుంకుమ తిలకం.. ఈనాడు..
నీ శోభలై వర్దిల్లగా....
నీ శోభలై వర్దిల్లగా....


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు
నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో..
గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యాలు... ఇక వినిపించునా కనిపించునా
వినిపించునా....  కనిపించునా
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2788

Saturday, April 1, 2017

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

చిత్రం :  ఇల్లాలు (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  : ఏసుదాసు,  శైలజ 




పల్లవి :



ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..



చరణం 1 :



ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


చరణం 2 :



కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :



తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?


చరణం 4 :



అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2663

Friday, July 15, 2016

తులసి దళములచే

చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : త్యాగయ్య
నేపధ్య గానం : ఏసుదాసు   




పల్లవి :



తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు


తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు


పలుమారు చిరకాలము... ఆ
పలుమారు చిరకాలము...  పరమాత్ముని పాదములను
పలుమారు చిరకాలము...  పరమాత్ముని పాదములను 


తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు



చరణం 1 :



సరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
సరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్


ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని...
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని
సాకేతపుర వాసుని శ్రీరాముని..
సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని





తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9097

లలిత ప్రియ కమలం







చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : చిత్ర,  ఏసుదాసు   




పల్లవి :


లలిత ప్రియ కమలం విరిసినదీ
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిని ఆ... ఆ... ఆ... ఆ...


ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆ... ఆ... ఆ... ఆ...
ఉదయ రవికిరణం మెరిసినదీ


అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం


కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ





చరణం 1 :


రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం


కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం


కోటి తలపుల చివురులు తొడిగెను.. తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిలకిల.. తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది యదమురళీ..  రాగ చరితర గల మృదురవళి
తూగుతున్నది మరులవనీ.. లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను



లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిని ఆ... ఆ... ఆ... ఆ...
ఉదయ రవికిరణం మెరిసినదీ




చరణం 2 : 




కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ 

కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం 

కాదా మమకారం నీ పూజా కుసుమం


మనసు హిమగిరిగా మారినదీ
మనసు హిమగిరిగా మారినదీ
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా


మేని మలుపుల చెలువపు గమనము.. వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము.. పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం.. రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం.. సాగినది ఇరువురి బ్రతుకురథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి


ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినదీ


కన్నుల కొలనిని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినదీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9412

మానవ సేవ ద్రోహమా





చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : ఏసుదాసు 




పల్లవి :



ఆ.. ఆ.. ఆ.. ఆ..
పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ
పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ
పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ
పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ
పంజనదీశ పాహిమాం... ఆ... ఆ... ఆ...



మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా... ఆ... ఆ... ఆ...  





చరణం 1 :



కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా



మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా ఆ.. ఆ.. ఆ..




చరణం 2 : 




గీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి
గీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి
జీవ ధారచిలుకు కార్యదీక్ష హేయమరచి
కాలమే కాల జలాలను లవణాబ్ది వివరించ
ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదా
కాలమే కాల జలాలను లవణాబ్ది వివరించ
ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదని



మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా ఆ.. ఆ.. ఆ.. ఆ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9096

నీతోనే ఆగేనా సంగీతం





చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : ఏసుదాసు 




పల్లవి :



ఆ... ఆ... ఆ... ఆ...
నీతోనే ఆగేనా సంగీతం... బిలహరి
నీతోనే ఆగేనా సంగీతం


నీతోనే ఆగేనా సంగీతం... బిలహరి
నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే... స్వర విలాసం మార్చుకుంటే
ఆరిపోదు గాన జ్యోతి... నీతోనే ఆగేనా సంగీతం  




చరణం 1 :


సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
యుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన


అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం


నీతోనే ఆగేనా సంగీతం... 




చరణం 2 : 



విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంథమేది
ఏ జ్ఞానం....  ఆ నాదం



పేరులేక పేదదౌన మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌన మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో
ఎడారిపాలు కాదా జ్ఞానవాహిని
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా


నీతోనే ఆగేనా సంగీతం
మగపద నీతోనే


సరీగ రిగాప గపాద....  నీతోనే
సరిగ రిగప మగపద మగరిగస గపద మపగద దరి...  నీతోనే
పాద మగపద రిస రీగ రిగ నిదప ద
దాసరిగ దాగసరి గాపదస రీగ సరిగ రిగ పదరి ... నీతోనే
సరిగ దమగరిగ దమగరి సాస సాస రీరి రీరి
సని ద సని ద పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద
రిగరి దనిదప మగ సగ సగ నిదప
సని సనిద సరిగపద రిగమప దరి


నీతోనే ఆగేన సంగీతం
బిలహరి అని పిలవకుంటే
స్వర విలాసం మార్చుకుంటే.. ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9094

Monday, March 21, 2016

కదిలే కాలమా




చిత్రం :  పెదరాయుడు (1995)
సంగీతం :  కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : ఏసుదాసు, చిత్ర     





పల్లవి :


కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుకా...  కల్లార చూడవమ్మ
పేగే కదలగా... సీమంతమాయెలే  ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ



చరణం 1 : 

లాలించె తల్లీ... పాలించె తండ్రీ... నేనేలె నీకన్ని
కానున్న అమ్మ... నీ కంటి చెమ్మ.. నే చూడలేనమ్మ


కన్నీళ్లలో చెలికాడినే... నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులె


కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుకా...  కల్లార చూడవమ్మ
పేగే కదలగా... సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ 


చరణం 2 : 

తాతయ్య తేజం పెదనాన్న నైజం... కలిసున్న పసిరూపం
నీ రాణి తనము... నా రాచ గుణము.. ఒకటైన చిరుదీపం
పెరిగెనులే నా అంశము.. వెలిగెనులే మా వంశము
ఎన్నెన్నో  తరములు తరగని యశములకు


ఎన్నో  నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా



నడిచే దైవమా... నీ పాద ధూలులే పసుపు కుంకుమలు నాకు
ఎన్నో  నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16042

ముద్దుతో ఓనమాలు నేర్పించనా




చిత్రం :  మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు,చిత్ర  




పల్లవి : 


ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ.. ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా


భామా .. ఆ..  ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా ... ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ .. ఓ.. ఓ ... ఓ
ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. ఓ
సిగ్గుల్లో ఆనవాలు చూపించనా





చరణం 1 :


ఎంచక్క నా మనసే నీ కోసం పలకను చేశానమ్మా
ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా


గాలికి సరిగమ నేర్పిన రాగములో
ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్ళు వల్లిస్తే చాలు...  ఎన్నో శృంగార నైషధాలు
ప్రేమా ... ఆ... ఆ.. నీ మౌనమొక భాషాగా చేసుకున్నాక



ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ.. ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా



చరణం 2 : 


తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత
వేసాను ముద్దు పాలశిక్ష పెదవుల తీపిరాత


వరసలు కలిసే వచనం వింటావా
చొరవలు పెరిగే సరదా చూస్తావా
మధుర శృతుల లీల... ఇది మదన లయల గోల
రోజూ ఉ ఉ అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి.. ఓ.. ఓ.. ఓ.. ఓ


ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ... ఓ.. ఓ.. ఓ
సిగ్గుల్లో ఆనవాలు చూపించనా


భామా ఆ ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా.. ఆ.. ఆ.. ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ.. ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా





ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో






చిత్రం :  బ్రహ్మ (1992)
సంగీతం :  బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు,చిత్ర  




పల్లవి : 


ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో 


జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్.. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే 


ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో

చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే.. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే


ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో 


చరణం 1 :



రాగాలమ్మ పాట.. మేఘాలమ్మతోటి రాయబారమే పంపగా
జాగారాల రేయి.. ఊగాడే వయ్యారం.. జతగాడే శృతి చేయగా


సందెరంగుల సన్న గాజులే చిందులాడుకోగా
కందిపోయినా కన్నెబుగ్గలే సింగారాలే ఆడా



ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో



చరణం 2 : 


నింగి నీలవేణి కొంగుచాటులోని... రంగు బొంగరాలాడగా
ఆ దాగుడుమూతల్లోనా దాచిన అందాలన్నీ.. రాగలవాడికే అందించగా


ఆ దొంతుమల్లెల బంతులాటతో రేయి గడచిపోగా
గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒళ్ళే తుళ్ళీ పాడా



ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో


చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే.. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే


ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో 


జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్.. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16045

Sunday, March 20, 2016

ముసి ముసి నవ్వులలోన



చిత్రం :  బ్రహ్మ (1992)
సంగీతం :  బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు 




పల్లవి : 


ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన


ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన



చరణం 1 :


ఆరేళ్ళ పాప కోసం... ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం... ఈనాడు పాడినా
అభిమానమున్న వాడ్ని... అవమానపరచినా
యదలోని చీకటంతా... వెన్నెలగ మార్చినా


బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన


చరణం 2 : 



అనురాగ జీవితాన... పెను గాలి రేగినా
తన వారు కాన రాక... కను పాప ఏడ్చినా
కడగళ్ళ  బ్రతుకులోన... వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ... ఏ దరికి చేర్చినా



బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16046

Friday, April 11, 2014

ఆకాశదేశానా ఆషాడమాసానా

చిత్రం :  మేఘసందేశం (1982)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  ఏసుదాసు


పల్లవి:


ఆకాశదేశానా..  ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..


చరణం 1:


వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో..
విన్నవించు నా చెలికి విన్న వేదనా.. 
నా విరహ వేదనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా


చరణం 2:


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

Tuesday, December 11, 2012

దారి చూపిన దేవతా

చిత్రం: గృహప్రవేశం (1988)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాసు

పల్లవి:

దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా

చరణం 1:

మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో
కన్ను తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా

చరణం 2:

మరపు రాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము
కలన కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిను దీవించని

దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా


Tuesday, August 28, 2012

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఏసుదాసు

పల్లవి: 


దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం 


చరణం 1: 


నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం 

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. 
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి 

చరణం 2: 


శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం 

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. 
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి 

చరణం 3: 


తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం


దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. 
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి 
ఇక ఊరేల సొంత ఇల్లేల 
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా 
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం 
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం 

తాళి కట్టు శుభవేళ

చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..

చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

చరణం 1:

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
 
Singapore airlines announces the arrival of flight S2583 

ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల...

చరణం 2:

గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
 
Wish you both a happy life... happy happy married life 

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల...

చరణం 3:

చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...