Thursday, November 27, 2014

ఇది నిశీధ సమయం

చిత్రం :  దేవదాసు (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు 



పల్లవి :


ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ..
తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం
ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం


ఈ సమయం భ్రాంతి సుమా..  ఆ పయనం మాయ సుమా..
అంటున్న నేను.. వింటున్న నీవు
అంతా మాయసుమా..  అంతా భ్రాంతి సుమా




చరణం 1 :



అయిదు సరుకుల మేళవింపుతో.. తొమ్మిది తలుపుల భవనం
అందులోన నివాసం మాని హంస చేరురా గగనం
తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా..
తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా


ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం...
 


చరణం 2 :



మరలా పుట్టుక.. మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం
వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం
రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు
అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు 


ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..  ఇది నిశీధ సమయం



కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి

చిత్రం  :   చక్రవాకం (1974)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  సుశీల, రామకృష్ణ



పల్లవి :


కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. పట్టపగలె తొందర. .  పండగుంది ముందర
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. పట్టరాని తొందర.. పట్టుకుంటె బిత్తర  




చరణం 1 :



కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు.. కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు
కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు.. కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు


కోరి వలచి వచ్చాను.. నీ కోసమెన్నొ తెచ్చాను
కోరి వలచి వచ్చాను . . . నీ కోసమెన్నొ తెచ్చాను
గుట్టు చప్పుడు లేక.. నీ సొంతమే చేసుకో


కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. పట్టపగలె తొందర.. పట్టుకుంటె బిత్తర      

          

చరణం 2 :


నింగి వంగి వచ్చిందీ.. నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది..  నీవు నడిచేటందుకు
నింగి వంగి వచ్చిందీ.. నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది.. నీవు నడిచేటందుకు


మంచు జల్లు కురిసింది చలి పుట్టేటందుకు.. 

మబ్బు చాటు చేసింది.. గిలి తీరేటందుకు.. 

మబ్బు చాటు చేసింది..  గిలి తీరేటందుకు     

          
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. పట్టరాని తొందర.. పండగుంది ముందర


చరణం 3 :



అల్లరి కళ్ళకు నల్లని కాటుక.. హద్దులే గీచావు ఎందుకూ
కళ్ళకు కాటుకే చల్లదనం.. హద్దులో ఆడదుంటె చక్కదనం
చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు.. చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు
బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు.. ప్రేమ బాటంతా పూలగుత్తులు      


కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. పట్టరాని తొందర.. పట్టుకుంటె బిత్తర            
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. పట్టపగలె తొందర.. పండగుంది ముందర




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2449

Tuesday, November 25, 2014

ఈ నదిలా నా హృదయం

చిత్రం :  చక్రవాకం (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ 




పల్లవి :


ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది     

     

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది

ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. 

వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది


చరణం 1 :


వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది


కలల కెరటాల గలగలలు రేగనిది..
కలల కెరటాల గలగలలు రేగనిది.. గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో..


ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది

         

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది..
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది    


చరణం 2 :


అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది


మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది


ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది   

             
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2382

Friday, November 21, 2014

సంగీతం.. మధుర సంగీతం

చిత్రం :  కృష్ణవేణి (1974)
సంగీతం :  విజయ భస్కర్
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


సంగీతం.. మధుర సంగీతం
సంగీతం..  మధుర సంగీతం . .
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం.. మధుర సంగీతం... 
 



చరణం 1 :



ముద్దుల కూనల తీయని పిలుపే . . తల్లికి కోకిల గానం
లలల.. లాలలలా.. అహహహా.. అహహహా..
ముద్దుల కూనల తీయని పిలుపే . . తల్లికి కోకిల గానం
మదిలో మమతలె మంజుల రవళిగ.. మ్రోగును మోహనరాగం          
సంగీతం . . మధుర సంగీతం . .  

చరణం 2 :


బాల పాపల ఆటల పాటలె..  అమ్మకు కమ్మని గీతం
ఆకాశ వీధుల సాగే గువ్వలు.. తెచ్చే ప్రేమ సందేశం
సంగీతం.. మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం.. మధుర సంగీతం . . 




చరణం 3 :



ఎన్నో నోముల పంటలు పండి..  ముచ్చట గొలుపు సంతానం
ఎన్నో నోముల పంటలు పండి..  ముచ్చట గొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగసంచారం
సంగీతం..  మధుర సంగీతం . .
 

చరణం 4 :

శోభన జీవన దీపావళిలో.. పెరిగెను పావన తేజం
తనివే తీర తనయులజేర..  తల్లికి తరగని భాగ్యం
సంగీతం..  మధుర సంగీతం . .
తల్లీ పిల్లల హృదయ సంకేతం..
సంగీతం . . మధుర సంగీతం . . 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4009

పదునాలుగేండ్లు వనవాసమేగి

చిత్రం :  కృష్ణవేణి (1974)
సంగీతం :  విజయ భస్కర్
గీతరచయిత  :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత . .  పరమ పావని ఆ మాతా
సార్వభౌముడు శ్రీరామచంద్రుని.. సన్నిధి కోరేను సీత . . అదే పెన్నిధి అన్నది భూజాతా
పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత.. పరమ పావని ఆ మాతా 




చరణం 1 :



సత్య పరీక్షకు అగ్ని పరీక్షకు . . సాధ్వి జానకి నిలిచె
అఖిల జగములో సీత పునీతని అగ్నిదేవుడె పలికే . . అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను.. న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని.. అడవికి పంపెను.. నిర్ధయుడా శ్రీరాముడూ
రాముని బాసిన సీత మనసులో రగిలెను ఆరని శోకము
   



పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత..  పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని..  సన్నిధి కోరేను సీత.. అదే పెన్నిధి అన్నది భూజాత  


చరణం 2 :



పూర్ణ గర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మీకి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె.. సీతకు శాంతిని కలిగించె
పతి దూషణలే తలచీ కలచీ విలపించెను ఆ మాతా
పిలిచెను భూమాతా ! తల్లి గర్భమున కలిసెను భూజాతా
జనని జానకి జీవితమంతా . . తీరని వియోగమాయే
 



పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత..  పరమ పావని ఆ మాతా
సార్వభౌముడు శ్రీరామచంద్రుని.. సన్నిధి కోరేను సీత.. అదే పెన్నిధి అన్నది భూజాతా
పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత..  పరమ పావని ఆ మాతా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4010

Thursday, November 20, 2014

సంగమం....సంగమం

చిత్రం  :  కోడెనాగు (1974)
సంగీతం  :  పెండ్యాల
గీతరచయిత  :  మల్లెమాల
నేపధ్య గానం  :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...


సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం





చరణం 1 :



పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 

పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 

సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం  ఆగి చూచు సంగమం.. 

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం..  ఆగి చూచు సంగమం


సంగమం... సంగమం.... 

అనురాగ సంగమం... ఆనంద సంగమం


చరణం 2 :



నింగి నేల.. నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం  

నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..

నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. నిలిచిపోవు సంగమం 

.

సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం



చరణం 3 :



జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది.
జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది...
మమతలు.. మనసులు ఐక్యమైనవి...
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ...  అద్దమన్నవీ...


సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2372

కథ విందువా

చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 


పల్లవి :


కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...
నా కథ విందువా




చరణం 1 :



బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు


కథ విందువా...నా కథ విందువా



చరణం 2 :



తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన మధురాధరము పైన
చిరు చేదు చిలికింది... జీవితమె మారింది
చిరుచేదు చిలికింది... జీవితమె మారింది 


కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా


చరణం 3 :



శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి చేసింది ధనము
కాముకుల కాహుతైపోయింది మానము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము


కథ విందువా... నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2072


ఇదే చంద్రగిరి

చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి
ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి..
ఇదే చంద్రగిరి...  శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి... 


చరణం 1 :

తెలుగుజాతి చరితలోన  చెరిగిపోని కీర్తి సిరి చెరిగిపోని కీర్తి సిరి
తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి...   ఇదే చంద్రగిరి 


చరణం 2 :



తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము

ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము...  వెయ్యేళ్ళకు పూర్వము
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి



చరణం 3 :



ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు
ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు
గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు...  ఈనాడు....



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2210



నోము పండించవా స్వామీ

చిత్రం :  నోము (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల 



పల్లవి :


నోము పండించవా స్వామీ.. నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా..  నిను కొలిచితిరా.. అలక చాలించి పాలించవా


నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా.. నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా.. నోము పండించవా స్వామీ
 




చరణం 1 :


అనురాగ మొలికే అందాల రాజుకు ఇల్లాలుగా చేసినావు
ఏ వేళనైనా యే ఆపదైనా మమ్మెంతో కాపాడినావు
ఎడబాటు యెరుగని మా జంట నిపుడు
ఎడబాటు ఎరుగని మా జంట నిపుడు  
ఎందుకు విడదీసినావు.. నీవూ ఎందుకు విడదీసినావు


నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా..  నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా..  నోము పండించవా స్వామీ
 


చరణం 2 :



ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
నీ మహిమను చూపాలీ.. మా కాపురం నిలపాలీ
నిజం నిరూపించాలీ రావా .. దేవా !! రావా ! దేవా !! 


అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా

చిత్రం :  నోము (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లగ చూడాలి నాగన్నా…
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా



చరణం 1 :


ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు కానుక తెచ్చాము
ఆ...ఆ...ఆ...ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము
భక్తితో నిను గూర్చి పాటలు పాడేము సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా 


చరణం 2 :



మల్లెలు తెచ్చామయ్య మల్లెల నాగేంద్రా
ఆ... చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా కరుణించవయ్యా అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా


నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
 





ఏదో అనుకున్నాను

చిత్రం :  నిప్పులాంటి మనిషి (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .
అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా
ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .
అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . .
ఆ . . ఆ . . ఆ . . ఆ



చరణం 1 :


ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . .
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ  


ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . .
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ
మరునిమిషం ఆ హృదయం తెరపాలైపోయెనా


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .
అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . . 



చరణం 2 :



పూలెన్నో తెచ్చానూ ..  మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
పూలెన్నో తెచ్చానూ..  మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
మరునిమిషం ఆ దైవం కనుమరుగైపొయెనా


ఏదో అనుకున్నాను..  ఏమేమొ కలగన్నాను . .
అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . . 


స్నేహమే నా జీవితం

చిత్రం :  నిప్పులాంటి మనిషి (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  బాలు 


 

పల్లవి :



ఆ . . ఆ . . ఆ . . ఆ . . అల్లాయే దిగివచ్చి . . .

అల్లాయే దిగివచ్చి... అయ్ మియా ఏమి కావాలంటే

మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలెక్కే గద్దెలొద్దంటాను

ఉన్ననాడు.. లేనినాడు…  ఒకే ప్రాణమై నిలిచే

ఒక్క దొస్తే చాలంటాను... ఒక్క నేస్తం కావాలంటాను 


స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమేరా నాకున్నదీ... స్నేహమేరా పెన్నిదీ.. 

స్నేహమే . . హొయ్

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం...

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం  


గుండెనే పలికించితే.. గుండెనే పలికించితే..  కోటి పాటలు పలుకుతాయ్

మమత నే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్

బాధాలను ప్రేమించు భాయీ..

బాధాలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్

స్నేహమే . . హొయ్ ! 


స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం  



చరణం 1 :



కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు

కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు

ఏమిటొ నీ బాధా ఆ .. ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయి


ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి.. ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి

నిండుగ నువ్వు నేడు నావ్వాలి.. అందుకు నేనేమి ఇవ్వాలోయ్… 

నిండుగ నువ్వు నేడు నావ్వాలి.. అందుకు నేనేమి ఇవ్వాలి… 


చుక్కలను కోసుకొని తెమ్మంటావా.. దిక్కులను కలిపేయమంటావా

దింపమంటావా…  

దింపమంటావా ఆ చంద్రుణ్ణి… తుంచమంటావా ఆ సూర్యుణ్ణి . .

ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కొరితే ప్రాణమైన ఇస్తాను . .

హ... ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కొరితే ప్రాణమైన ఇస్తాను


దొస్తీకి నజరానా..   దొస్తీకి నజరానా..

చిరునవ్వురా నాన్నా..  

దొస్తీకి నజరానా..  చిరునవ్వురా నాన్నా. .

ఒక్క నవ్వే చాలు ఒద్దులే వరహాలు.. 


హ హ హ హ…. 

నవ్వెరా.. నవ్వెరా.. మావాడు..  

నవ్వెరా నిండుగా

నవ్వెరా నా ముందు..  రంజాను పండుగా



స్నేహమే నా జీవితం… స్నేహమేరా శాశ్వతం..

స్నేహమే నా జీవితం… స్నేహమేరా శాశ్వతం


ఆకాశం నుండి నా కోసం వచ్చావా

చిత్రం :  ముగ్గురు అమ్మాయిలు (1974)
సంగీతం :  టి చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు


పల్లవి :


ఆకాశం నుండి నా కోసం వచ్చావా..  పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా
ఆకాశం నుండి నా కోసం వచ్చావా.. పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా


నువు పక్క పక్కగా వుంటే స్వర్గం దున్నేస్తా...
నువు పక్క పక్కగా వుంటే నే స్వర్గం దున్నేస్తా..
నువు కనపడకుండా పోతే.. బాల్చీ తన్నేస్తా      

  
ఆకాశం నుండి నా కోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా



చరణం 1 :


నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను
నీ సిగపువ్వు అదేమితమ్మా బుజబుజ రేకుల లవ్వు


నీ చిలిపి బిడియం అమృతంలో ఊరిన వడియం
నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండపండ్లు
ఓహో రోజా ! తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా


ఆకాశం నుండి నా కోసం వచ్చావా...   పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా



చరణం 2 :


నీ లేడికళ్ళు వేస్తాయి నాకు సంకెళ్ళు
నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు
నీకు నేను ముద్దుల బందీ.. నన్ను పెట్టకే ఇబ్బంది
నీకు నేను ముద్దుల బందీ.. నన్ను పెట్టకే ఇబ్బంది


నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం
నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం
ఓహో రోజా ! తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా 


అందాల ఓ రామచిలకా..నేను అవుతున్నానెందుకో తికమక
ఈ దేవదాసు లైలావేనా.. ఆ లైలా
ఈ మజ్ఞు పార్వతివేనా... ఓ పారూ
అయ్యో ! బుల్ బుల్ నాకెందుకే ఈ ట్రబుల్ 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6104

Wednesday, November 19, 2014

ఎగిరే గాలిపటానికి

చిత్రం :  రామ్ రహీమ్ (1974)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం..
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం 


నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం



చరణం 1 :


ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ


కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం
 

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం



చరణం 2 :


ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా... ఏ నిమిషం ఏమవుతుందో


గాలికి చెదరదు...  వానకు తడవదు బంధం . . . మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే...  నిలిచిపోతుంది కలకాలం 

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

అహహా అహహా అహాహా హ్హా..అహహా అహహా అహాహా హ్హా..




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4811

మనసులు మురిసే సమయమిది

చిత్రం :  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల



పల్లవి :


మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ.. వేళ యిది....  ఆ.. వేళ యిది


చరణం 1 :


లలలల ....లల లాలల... లలలల ....లల లాలల
లలలల ....లల లాలల.. లలలల ....లల లాలల


 తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి


సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది... 
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి


నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది  
నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది
ఆశలే .. పెంచుకో ... మోజులే ... పంచుకో


మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది... పువ్వై విరిసే వేళ యిది



చరణం 2 :


ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో.. ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో... ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం


నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే


నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో


మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ... వేళ యిది ఆ... వేళ యిది...  పువ్వై విరిసే వేళ యిది
 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1754

కౌగిలిలో ఉయ్యాలా

చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, జానకి 



పల్లవి : 


కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే..  తనివి తీరాలిలే


చరణం 1 : 


నీ బుగ్గలఫై ఆ ఎరుపు..  

నీ పెదవులఫై ఆ మెరుపు
వెలుతురులో.. చీకటిలో.. 

వెలిగిపోయేనులే.. హే హే.. నన్ను కోరేనులే


నా పెదవుల ఫై యీ పిలుపు.. హో హో..  

నా హృదయములో నీ తలపు.. హ హ

వెలుతురులో.. చీకటిలో.. వెలుతురులో 

చీకటిలో  నిలిచి వుండేనులే... నిన్ను కోరేనులే        

కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే 



చరణం 2 :


గులాబీలా విరబూసే నీ సొగసు... సెలయేరై చెలరేగేనీ వయసు
అందరిలో ఎందుకనో ఆశ రేపేనులే అల్లరి చేసేనులే

కసిగా కవ్వించే నీ చూపు...  జతగా కదిలించే నీ వూపు
రేయైనా..  పగలైనా.. రేయైనా..  పగలైనా...
నన్ను మురిపించులే...  మేను మరిపించులే    
   

కౌగిలిలో ఉయ్యాలా...  కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే...  కరిగిపోవాలిలే...  తనివి తీరాలిలే 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10251

Tuesday, November 18, 2014

ఆనాడు తొలిసారి నిను చూసి

చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 


ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...


ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను..
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ 


చరణం 1 : 


అందాల నీమోము నా కోసమే...  నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే...  నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. ల
ల.. ల.. ల

ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ



వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల

ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు రాజా...  రాజా  



చరణం 2 :


చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే... హృదయాలు పెనవేసి ఊగేనులే    ల   ల  లా  
     

 ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5343


సీతమ్మ నడిచింది రాముని వెంటా

చిత్రం :  గుణవంతుడు (1975)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల, బాలు  



పల్లవి : 


సీతమ్మ నడిచింది రాముని వెంటా.. సీతమ్మ నడిచింది రాముని వెంటా
రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా.. సీతమ్మ నడిచింది రాముని వెంటా


అడవంతా పులకరించి పూచెనంట.. అడవంతా పులకరించి పూచెనంట
ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట.. సీతమ్మ నడిచింది రాముని వెంటా 


చరణం 1 : 


కొమ్మమీద గోరువంక కులుకులాడి చిలక వంక కొంటెగా చూచెనంటా
కొమ్మమీద గోరువంక కులుకులాడి చిలక వంక కొంటెగా చూచెనంటా


పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక పైట సర్దుకున్నదంటా
పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక పైట సర్దుకున్నదంటా


పచ్చగడ్డి మేసేటి పసిడిలేడి మేతమాని . .  పరుగులే తీసెనంటా
సీతమ్మ చెవిలోన రాముడేదో చెప్పగా . .  సిగ్గుపడి పోయెనంటా 

   
సీతమ్మ నడిచింది రాముని వెంటా  



చరణం 2 :


పొదరిల్లే సవరించి..  చిగురుటాకు తలుపు మూసి..  తీగలే ఊయలగా ఊగిరంటా
పొదరిల్లే సవరించి..  చిగురుటాకు తలుపు మూసి..  తీగలే ఊయలగా ఊగిరంటా


ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా
ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా


వెచ్చదనం చల్లదనం పెంచెనంటా . .  వెచ్చదనం చల్లదనం పెంచెనంటా..వెన్నెలతో నీరెండ వియ్యమంటా            

సీతమ్మ నడిచింది రాముని వెంటా... రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా

 అడవంతా పులకరించి పూచెనంట... ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట.. 

 సీతమ్మ నడిచింది రాముని వెంటా..  సీతమ్మ నడిచింది రాముని వెంటా 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2400

కలుసుకున్న తొలిరోజింకా

చిత్రం : గుణవంతుడు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 



పల్లవి : 


కలుసుకున్న తొలిరోజింకా.. కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా


కలుసుకున్న తొలిరోజింకా... కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా
కలుసుకున్న తొలిరోజింకా... కన్నులలోనే ఉన్నదిరా


చరణం 1 : 


ముద్దూ ముచ్చట తీరక ముందే.. ముద్ర నాలో మిగిలినదీ..
నీ ముద్ర నాలో మిగిలినదీ
ముద్దూ ముచ్చట తీరక ముందే ముద్ర నాలో మిగిలినదీ


చూపులకందక నువ్వున్నా... నీ రూపు నాలో పెరిగినదీ
చూపులకందక నువ్వున్నా... నీ రూపు నాలో పెరిగినదీ


కళ్ళలోకి చూశావూ...  వెళ్ళివస్తానన్నావూ...
కళ్ళలోకి చూశావూ...  వెళ్ళివస్తానన్నావూ
అప్పుడు రెప్పవాల్చని నా కళ్ళూ . . అలాగే ఉన్నవి ఇన్నేళ్ళూ  
  

   

కలుసుకున్న తొలిరోజింకా...  కన్నులలోనే ఉన్నదిరా 


చరణం 2 :


మహరాజువు నీవన్నారూ...  నీ మమతలు మారేవన్నారూ
మహరాజువు నీవన్నారూ...  నీ మమతలు మారేవన్నారూ


మరుపు మబ్బులో కలిశానో.. నీ మనసు నుండి జారానో
మరుపు మబ్బులో కలిశానో.. నీ మనసు నుండి జారానో


మాటనిచ్చి వెళ్ళావు...  అది పాట చేసుకున్నాను... మాటనిచ్చి వెళ్ళావు... అది పాట చేసుకున్నానుఅప్పుడు నాలో రేగిన ఈ రాగం . . ఆగకున్నది యింత కాలం  


కలుసుకున్న తొలిరోజింకా.. కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా


కలుసుకున్న తొలిరోజింకా... 


చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే

చిత్రం : రాముని మించిన రాముడు (1975)
సంగీతం : టి.చలపతిరావు
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి : 


చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
 లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..


అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..




చరణం 1 :


నా నోము పండింది నేడు..
నాకు ఈ నాడు తొరికింది తోడు
నా రాణి అధరాల పిలుపు..
నాకు తెలిపేను తనలోని వలపు.. నిండు వలపు 


అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..



చరణం 2 :


ఎన్నెన్ని జన్మాల వరమో..
నేడు నా వాడవైనావు నీవు
నా వెంట నీవున్న వేళ..
కోటి స్వర్గాల వైభోగమేలా??.... భోగమేల?


చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది...  పూల వాన కురిసింది
లోకమే...  పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..


చరణం 3 :


ఈ తోట మన పెళ్ళి పీఠ..
పలికే మంత్రాలు గోరింక నోట
నెమలి పురివిప్పి ఆడింది ఆట..
వినగ విందాయే చిలకమ్మ పాట.. పెళ్ళి పాట



అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది....  పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే.. 


మాటంటే మాటేనంటా

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా...


నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట


గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట


నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


జణక్కు జుమ్మ...
మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట


చరణం 1:


నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని
ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా


ఇదే మా విందుభోజనం మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా..


అపార్థం చేసుకోరుగా... అనర్థం చెయ్యబోరుగా
యథార్థం చేదుగుంటది... పదార్థం చెత్తగున్నదీ
ఇది విందా నా బొందా... తిన్నోళ్ళూ గోవిందా

జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా.. పదర కుంకా..


నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా


గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట


నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా


చరణం 2 :


భళారే నీలి చిత్రమా భలేగా... ఉంది మిత్రమా
ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా


కోరావూ అసలు ట్రూతును... చూపాను సిసలు బూతును
చిక్కారూ తప్పుచేసి ఇక మక్కెలిరగదన్నూ


తమాషా చూడబోతిరా... తడాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరిపడితిరా... మదించీ మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా ...
లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా.. బెండు తీస్తా...


మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా


నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


జణక్కు జుమ్మా....
మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11526

Thursday, November 13, 2014

చిటపటా చినుకులు

చిత్రం :  ఏజెంట్ గోపి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


చిటపటా చినుకులు.. మన కోసం కురిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి


ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి
 



చరణం 1 :


ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది
ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది 


హా.. వెచ్చని కౌగిలి పైటగా చేసుకో..
గాలిని వానని జంటగా గెలుచుకో...


చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి 


చరణం 2 :


నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు
నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు 

అంతగా చూడకు సిగ్గులో ముంచకు
అందుకో వలపులు.. పంచుకో తలపులు..

ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3671

మనసు మెచ్చిన చిన్నది

చిత్రం :  ఏకలవ్య (1982)
సంగీతం :  కె.వి. మహదేవన్
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది..ఆఁ
మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అది పనిగా పలురుచులు అందీయనున్నది


మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు..ఆఁ..
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
ముచ్చట.. అచ్చట.. ముప్పూటలా మెక్కి
తొక్కి నా ఎద మీద సోలిపోనున్నడు
మనసు మెచ్చిన చిన్నది.. నను మనువాడబోతున్నది


చరణం 1 : 


పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా..ఆ.. ఆ..
పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా


అమ్మబాబు.. మూడు ముళ్ళెసినంత దాకా
అట్టె బులిపించి మానం ప్రాణం తీయమాకా
అయితే గంగనో మంగనో నే చూసుకుంటాను
అది కనక నిజమైతే రెండిచ్చుకుంటాను
రెండా? ఏంటి?
మ్చ్.. మ్చ్..


హేయ్ .. మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు


ఆహహా.. ఆహాహహాహహా.. హాహా..
ఆహహా.. ఆహాహహాహహా.. ఆహహా..


చరణం 2 :


అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..
అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..


మంచిదేలే కదా అందాక వచ్చినాకా
ముద్దుమురిపాలు తీరే దాకా మూయవాకా
అవ్వా.. ఆశకు ఆటకు అద్దుండాలంటాను
అద్దంటూ గిరి గీస్తే ఐదిచ్చుకుంటాను
ఐదా? ఏంటి?
మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్..
హేయ్ ..


మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అదిపనిగా పలురుచులు అందీయనున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
లలలాలాలలాలలల.. లలలాలాలలాలలల..


Wednesday, November 12, 2014

పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు

చిత్రం :  ఓ సీత కథ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు, సుశీల
 


పల్లవి :


పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
ఆ బొమ్మకున్న ఆభరణం.. అందాలకందని మంచి గుణం
అందాలకందని మంచి గుణం


మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మావాడికున్న వింత గుణం.. తన మాట తప్పని మంచితనం 


పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు



చరణం 1 :


గళమున లేవు ఏ ముత్యాల సరాలు... ఉన్నవిలే హరినామ  స్వరాలు
కరమున లేవు బంగారు కడియాలు.. ఉన్నవిలే శివపూజా కుసుమాలు
మదిలో లేవు సంపదల మీద ఆశలు..
మదిలో లేవు సంపదల మీద ఆశలు.. ఉన్నవిలే పతి సేవా కాంక్షలు..
ఆ బొమ్మకున్న ఆభరణం.. అందాలకందని మంచి గుణం.. అందాలకందని మంచి గుణం


పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు



చరణం 2 :



పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం.. వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం.. మరి మరీ సంతోషం


పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం.. వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం.. మరి మరీ సంతోషం


రాచిలకల రప్పించు మావిడి తోరణాలు కట్టించు..
కోయిలలను పిలిపించు.. మంగళవాద్యాలను తెప్పించు
ఆకాశమంత పందిరి వేసి.. భూలోకమంత పీఠ వేసి
పెళ్ళికొడుకును పెళ్ళిపడుచును పీటల మీద కూర్చోబెట్టి
శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి అందరు చల్లగ అక్షతలు చల్లగ
కల్యాణం జరిపించాలి..  ఆ వైభోగం తిలకించాలి   




చెలి చూపులోన

చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  బాలు  


పల్లవి :


చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే . . .
చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే



చరణం 1 :


నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
ఈ జగమమతా కొత్తగవుంది.. ఈ క్షణమేదో మత్తుగవుంది... పొంగేనులే యౌవ్వనం    
          

చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే 


చరణం 2 :


జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
ఆరని జ్వాలలే మనసున రేగే..  తీరని కోరికలే చెలరేగే.. కలిగేనులే పరవశం
               

చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2060

బాబూ... చిన్నారి బాబూ

చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


బాబూ..  చిన్నారి బాబూ.. 

బాబూ...  చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను.. నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను.. బాబూ చిన్నారి బాబూ


చరణం 1 :



మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న.. ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా. . .
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న.. ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా..  ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 

బాబూ...  చిన్నారి బాబూ


చరణం 2 :


అమ్మా అని ఒక్కసారి నువ్వంటే..  నా అణువణువున ఆనంద గోదావరి . .
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే.. నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే..  నా గుండెల్లో కన్నీటి కావేరి 


బాబూ...  చిన్నారి బాబూ



చరణం 3 :



నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి . . .
నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి..  అది చూసి మీ నాన్న మురిసి పోవాలి.. 


బాబూ...  చిన్నారి బాబూ        
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను.. నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను.. బాబూ చిన్నారి బాబూ 




అందాలు కనువిందు చేస్తుంటే

చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  రామకృష్ణ


పల్లవి :


అందాలు  కనువిందు చేస్తుంటే..
ఈ అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా..


చూసే కనులకు నోరుంటే.. మధురగీతమే పాడదా.. మధురగీతమే పాడదా                                                   

అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా


చరణం 1 :


చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులూరేగెనూ..
అంబరాన ఆ సంబరాలుగని గిరులబారులు మురిసెనూ
పలుకు రాని ప్రకృతి  నాకు పలికె స్వాగతాలు..
నిండుగా కలలు పండగా.. నాదు డెందమే నిండగా    
                                

అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా


చరణం 2 :


ఎవరి కురులలో నలుపు చూసి తుమ్మెదలు  చిన్నబోయెనూ
ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలువ సిగ్గు చెందేనూ
అవే సోయెగాల కురులూ.. అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగ మనసు చెదరగా.. కనుల కెదురుగా వెలిసెనూ
                           

అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా



చరణం 3 :



ఈ సరస్సులో ఇంద్ర ధనుస్సులో..  వింత సొగసు ఏముంది

ఓర చూపుల సోగకనులలో కోటి సొగసుల గని వుంది

 చెలియ పాలనవ్వులోన మరులు జల్లు వాన కురిసెనే .. 

వలపు విరిసెనే.. తలపు చిందులే వేసెనే       

                           

అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చూసే కనులకు నోరుంటే..మధురగీతమే పాడదా...
మధురగీతమే పాడదా    
  



Tuesday, November 11, 2014

ఎర్రగులాబీ విరిసినది

చిత్రం :  ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి  



పల్లవి :

రురూరురూ.. రురురురూ..రురురురురురు..
ఎర్రగులాబి విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది.. 


చరణం 1 :


లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా


నేనిక నీకే సొంతము
న న న న న నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది ..


చరణం 2 :


పెదవిని... ఈ మధువునూ నేడే చవిచూడనీ

నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా


వయసుని వయసే దోచేది
న న న న న న అది మనసుంటేనే జరిగేది
న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..నననన.. నననన..అహహా...  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5756

మాఘమాసం ఎప్పుడొస్తుందో



చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సునీత 



పల్లవి :


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో.. మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా...  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.. ఆ.. ఆ


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ 


చరణం 1:


తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు


నా.. ఆ..ఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా..  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ 


చరణం 2 :


తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు


నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ 


ఆహా ఏమి రుచి



చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర



పల్లవి :


ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ


ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ



చరణం 1 :


అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు


ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ



చరణం 2 :


లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా


ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....


Monday, November 10, 2014

గుండె గూటికి పండుగొచ్చింది




చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు 





పల్లవి : 


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
 

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

చరణం 1 :


నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ



చరణం 2 :


బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


ఇదేనండి ఇదేనండి ...భాగ్యనగరం

చిత్రం :  ఎం.ఎల్.ఎ. (1957)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, జానకి





పల్లవి : 



ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం...


చరణం 1 :


పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి...ఆ..ఆ..ఆ
పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి
భాగమతి అతని యొక్క ముద్దుల దేవి
ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు...
ఆ ఊరే ఈనాడు హైదరబాదు...ఊ..ఊ...


ఇదేనండి ఇదేనండి....
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం


అలనాడు వచ్చెనిట మహంమారి ..ఈ...ఈ...
అలనాడు వచ్చెనిట మహంమారి
అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గుర్తే అందమైన చార్మినారు


ఇదేనండి ఇదేనండి...
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం 



చరణం 2 :



ఇది పాడు పడిన గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే తానీషాదీ తోట
ఇది పాడు పడిన గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే తానీషాదీ తోట


భద్రాద్రి రామదాసు బందిఖానా
చూడండి యిదిగో ఈ కోటలోనా...

ఇదేనండి ఇదేనండి...
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం


అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
ఆంధ్ర శౌర్య వాహినులే పారినవీచోట
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట
కోట పట్టుకొనగ మరియేమో పట్టీనాడట


ఇదేనండి ఇదేనండి...
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం


చరణం 3 :



వింత వస్తుశాలలు విశాలమగు వీధులు
వింత వస్తుశాలలు విశాలమగు వీధులు
విద్యాలయ భవనాలు.. ఉద్యాన వనాలు
కనుల కింపు చేసే కమ్మని నగరం
కనుల కింపు చేసే కమ్మని నగరం
భరత మాత జడలోనే పసిడి నాగరం


ఇదేనండి ఇదేనండి ...
ఇదేనండి ఇదేనండి ...భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం