Saturday, August 29, 2015

హరివరాసనం విశ్వమోహనం

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాస్  




పల్లవి :




హరివరాసనం... విశ్వమోహనం
హరిదధీశ్వరం...  ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం...  నిత్య నర్తనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే



శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప




చరణం 1 :




శరణ కీర్తనం...  శక్తమానసం
భరణలోలుపం...  నర్తనాలసం
అరుణభాసురం...  భూతనాయకం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే




శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప





చరణం 2 :



కళమృదుస్మితం...  సుందరాననం
కళభకోమళం...  గాత్రమోహనం
కళభకేసరి...  వాజివాహనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే


శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప




చరణం 3 :




శ్రితజనప్రియం...  చిందితప్రదం
శృతివిభూషణం...  సాధు జీవనం
శృతిమనోహరం...  గీతలాలసం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే




శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8389

శబరిమలను స్వర్ణ చంద్రోదయం

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాస్ 




పల్లవి :


శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా


శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా


శబరిమలను స్వర్ణ చంద్రోదయం 





చరణం 1 :




ప్రీతియే ఉల్లమున పాలవును.. అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిత్తు అనురాగం..నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తా


నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..


శబరిమలను స్వర్ణ చంద్రోదయం 






చరణం 2 :




పుణ్యమిత్తే పన్నీరభిషేకం.. జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం.. నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ



నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..


శబరిమలను స్వర్ణ చంద్రోదయం






చరణం 3 : 




దోసిట పుణ్య జలం అందుకొని.. అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం.. హరి యోమని చందనంతో అభిషేకం



నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..



శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా



అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా 





Tuesday, August 25, 2015

మౌనమె నీ భాష






చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాల మురళీకృష్ణ




పల్లవి :


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా
మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా







చరణం 1 :



చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో  
   


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా

తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా


చరణం 2 :



కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు



మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా

తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా





సమూహ భోజనంబు




చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : రామకృష్ణ




పల్లవి :


సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు      
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు  
      




చరణం 1 :



గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు..  అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం.. ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం.. అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం
ఈ గొణుగుచున్న ఘనులు.. కడు మూర్ఖ శిఖామణులు        

       

సమూహ భోజనంబు...  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు
        


చరణం 2 :



అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప.. కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప
కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా..
ఆలోచనలను పెంచు.. ఆవేశములను దించు 

              

సమూహ భోజనంబు...  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు   



చరణం 3 :


దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు..  రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు.. హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు.. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు
కోపాలు సర్దుకోండి... సాపాటు పంచుకోండి


సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు      
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1255

పలుకే బంగారమాయెరా




చిత్రం :  అందాల రాముడు (1973)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య  గానం :  బాల మురళీకృష్ణ




పల్లవి :


పలుకే బంగారమాయెరా... అందాల రామ.. పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 


ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే... పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా



చరణం 1 :



లక్షాధికారులైనా లవణమన్నమే గాని
బంగారు కణికలు... మింగలేరను మంచి... పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 



చిన్ని నా బొజ్జకు... శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని.. అందరికుండాలనే.. పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 



చరణం 2 :



బిరుదులు పదవుల మీద...  పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న... ఎరుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 


పంచదారను మించే... పాలూ మీగడల మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే... పలుకే బంగారమాయెరా


అందాలరామ పలుకే బంగారమాయెరా... అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1252

మము బ్రోవమని చెప్పవే




చిత్రం :  అందాల రాముడు (1973)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  రామకృష్ణ




పల్లవి :


మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...  మము బ్రోవమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ... మము బ్రోవమని చెప్పవే


ఏకాంత రామయ్య నీ చెంతగా చేరి... చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ... మము బ్రోవమని చెప్పవే



చరణం 1 :



మీరూ ఈ గోదారీ తీరాన నడిచారు... కన్నీళ్ళు నవ్వూలు కలబోసుకు న్నారూ
ఆ కథను కాస్త గురుతు చేసుకొమ్మనీ...  మా కష్టాలు కాస్త చూసిపొమ్మని
నువ్వయినా చెప్పవమ్మా రామయ్యకూ...  ఆ అయ్యకూ      
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...  మము బ్రోవమని చెప్పవే



చరణం 2 :



మా రాజులు మంత్రులు మిమ్మడగ వచ్చేవారలే... మా బోటి దీనులు మీ కడకు వచ్చేవారలే
ఇంతొ అంతొ ముడుపు కట్టి అంతటయ్యను మాయచేసి
లక్షలో మోక్షమ్ముకోరే గడుసు బిచ్చగాళ్ళము.. వట్టి పిచ్చివాళ్ళము


ఆదుకొమ్మని పైకి చేదు కొమ్మని చెప్పవమ్మా రామయ్యకు.. మా అయ్యకు
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ... మము బ్రోవమని చెప్పవే



చరణం 3 :


పులిని చూస్తే పులీ యెన్నడు బెదరదూ... మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగమదేమో గాని మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ... ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్ళము... మీ అండ కోరే వాళ్ళము


కరుణించమని చెప్పవే మా కన్నతల్లి... కరుణించమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ... మము బ్రోవమని చెప్పవే 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1253

భద్రాచల క్షేత్రమహిమ






చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆరుద్ర
నేపథ్య  గానం: రామకృష్ణ, జె. వి. రాఘవులు




పల్లవి :

మా తల్లి గోదారి చూపంగ దారి.. పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా.. భద్రగిరి మహిమలే విందామా... భద్రగిరి మహిమలే విందామా


ఏవిటోయ్ ఆ మహిమలు ?


శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా.. సుజనులారా... సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున... ఒకానొక గిరిని పరికించి,
దానిపై సుంత విశ్రమించినంత... ఆ కంధరమ్మొక సుందరపురుషాకృతి దాల్చి . . .ఏమనినాడనదా


ధన్యుడనైతిని  ఓ రామా..  నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని  ఓ రామా..  నా పుణ్యము పండెను శ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను..  నీ రాకకు చూచే భద్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు.. నా శిరసున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామిత మీడేర్చ..  కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ . . ధన్యుడ . . ధన్యుడనైతిని  ఓ రామా... నా పుణ్యము పండెను శ్రీరామా
అని భద్రుడు ప్రార్థించిన . . స్వామివారేమన్నరనగా . . .


వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను  . .  అని వెడలిపోయిరి
అంతట


వెడలిన రాముడు వెలదిని బాసి... ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి... కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి...  కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరిచాడు . . రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు...  శ్రీమద్రమారమణ గోవిందో హరి . .




చరణం 1 :


కాని భూలొకమున భద్రుడు ఎన్నియుగము లైనా ఎదురు చూస్తూ
ఏ విధిముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా... వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శెలవిచిన పిమ్మట... మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా..  అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున...  నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద... వచ్చెదనంటివి రామయ్యా... వరమిచ్చెదనంటివి రామయ్యా
అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా . .


సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు  . .
సంక్షోభమ్మునొందిరి . . అపుడు...


 కదలెను. .  శ్రీ మహావిష్ణువు కదలెను. . భక్తసహిషువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక.. శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు...  సుపర్ణుని భుజమైన ఏక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు  ... కదలెను. . భక్తసహిషువు . .
శ్రీమద్రమారమణ గోవిందో . . హారి



చరణం 2 :


గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి . . .స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తన వెంటన్ సిరి.. లచ్చి వెంట నవరోధ వ్రాతమున్.. దానివె
న్కను బక్షీంద్రుడు.. వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబునూ...
హుటాహుటిని రాగా.. తొందరయందు అపసవ్యంబుగా ఆయుధములు ధరించి . . స్వామి
వారు భద్రునకు దర్శనంబీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు


ఏవరివయ్య స్వామి నేను నిన్నెరుగను...  హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవునావు... నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా... శ్రీమహావిష్ణువు  తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను . .
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు... ఆ తీరుగనే చేతుల
నెల్చెను . . .భద్రుడు మహదానందబరితుడై


ఈ తీరుగనె ఇచ్చట వెలయుము... ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్ర లలామా . . శభాష్
అని విన్నవించగా స్వామివారు ఆ తీరు గనే వెలసిరి


ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను... భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై . . .



చరణం 3 :

ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన
పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా . . .
ఆయన భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను


కోరి కనిపించావా కోదండరామయ్యా... గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా... గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
చక్రవర్తి కుమారుడా... ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా... విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక...  నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార  విందులయ్యా....  నీకు విందులయ్యా
అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను... 


తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న
ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించెననగా...  ఏవిధముగానా . .  అప్పుజేసి
తప్పు నాయనా... గోపన్న చరితము లోకవిఖ్యాతము
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ... మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా...  రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ... మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం  మహిత మంగళం...  మహిత మంగళం  మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో  హరి:





వలపులో వద్దు వద్దు వద్దంటు




చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల 


పల్లవి :



వలపులో....
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 



చరణం 1 :


అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
నీలో ఏదో ఉన్నదిలే.. అది నీతో నన్నే కలిపెనులే..


వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 


చరణం 2 :


కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
ఉలకవు పలకవు ఎందుకని?... ఈ అలకకు కారణం ఏమిటని?



వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....


చరణం 3 :


మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది
మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది
నదులు కడలిలో చేరాలి... కలువ జాబిలి కలవాలి


వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3013

Monday, August 24, 2015

అబ్బోసి చిన్నమ్మా






చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆరుద్ర
నేపథ్య గానం: రామకృష్ణ, సుశీల 


పల్లవి :


అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన..  గుబులౌతుందే
అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన  గుబులౌతుందే  



అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ            
అబ్బోసి చిన్నయ్యా..  ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ 



చరణం 1 :

ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఉలికులికి పడేదానివే . . నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే 


అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో . .  ఊ
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో
నెత్తి మీద మొట్టేదానినోయ్... నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవడినే


అబ్బోసి చిన్నమ్మా... ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
 



చరణం 2 :



మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో...
మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది..
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే 


అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అదుముకుంటే విదిలించుకు . . పరుగుపుచ్చుకున్నావు
నాటినుండి నేటి దాక ఫికరులేకపోయావు 


వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా 


అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . .
అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . . 

అబ్బో. . అబ్బో . . అబ్బో . . అబ్బో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1753

Sunday, August 23, 2015

నిన్నదాకా చిన్నదాన్నిరా

చిత్రం :  విశాలి (1973)
సంగీతం : పుహళేంది
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల




పల్లవి : 


నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా
నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా


మొన్నదాకా మొండిదాన్నిరా... నీ మోజులోన బేలనైనారా... ఆ.. ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా


చరణం 1 :

చల్లగాలికిలా జలదరించి ఎరుగను..
మల్లెపూలకింత మత్తుందని ఎరుగను
పైట కొంగు తొలగినా... పక్క నెవరు నడిచినా
పైట కొంగు తొలగినా... పక్క నెవరు నడిచినా
సిగ్గుపడి అటూ ఇటూ చూచి ఎరుగనూ  

నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా


చరణం 2 : 



వానైనా ఎండైన వెన్నెలైన చీకటైన
నిన్న దాక లెక్కలేదురా
నేడు వానంటె దిగులు... వెన్నెలంటె సెగలు
చీకటైతె గుబులు గుబులురా
నిదురరాదురా...  పొద్దుపోదురా
ఈ అవస్త మొన్నదాక నేను ఎరుగను 


నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్...నీ కన్నుబడి నే కన్నెనైనారా



చరణం 3 :


కళ్ళు తెరుచుకునే కలవరించి ఎరుగను
నిన్న కన్న కలలు నెమరువేసి ఎరుగను
కోడెవయసు తరిమినా... కొసరి ముద్దులడిగినా
మూడు ముళ్ళు పడే వరకు నీకు దొరకను  


నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా
నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా


మొన్నదాకా మొండిదాన్నిరా... నీ మోజులోన బేలనైనారా... ఆ.. ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా.. హోయ్... నీ కన్నుబడి నే కన్నెనైనారా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4040

ఎవ్వడో అతడెవ్వరో ఒకడొస్తాడూ




చిత్రం : నాకూ పెళ్ళాం కావాలి (1987)
సంగీతం : వాసూరావు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   సుశీల



పల్లవి :


సా.......పా.....సా......
ఆ........ఆ........ఆ......
ఎవ్వడో  అతడెవ్వరో ఒకడొస్తాడూ....

పిల్లని చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో.....

ఓరగా ఎటు చూసినా  ఒణుకొచ్చేనేందుకో


పిల్లకి పెళ్ళి చూపులూ... పాఠం నేర్పని పరీక్షలూ
పిల్లకి పెళ్ళి చూపులూ... పాఠం నేర్పని పరీక్షలూ

సనిపగ సనిపగ సనిపగ రిసనిస రిసనిసప  సరిగపని   రిగపని
ఎవ్వడో  అతడెవ్వరో ఒకడొస్తాడూ....

పిల్లని చూడాలనీ త్వరపడతాడు



చరణం 1 :


మనిషే ఎవరని తెలియని వాని....మనసున ఉన్నా రూపమేమిటో
మనిషే ఎవరని తెలియని వాని....మనసున ఉన్నా రూపమేమిటో
హంసల నడకల.. కోయిల పాటల సతి కావాలని కోరెనో ....
రంభా ఊర్వశి మేనక మేని అందం కోసం వెతికేనో....
ని స ని ప  ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని 


ఎవ్వడో  అతడెవ్వరో ఒకడొస్తాడూ....

పిల్లని చూడాలనీ త్వరపడతాడు


చరణం 2 :



ఆడది వెతికే అందం ఒకటే.. వంచన లేని మంచితనాన్నే
ఆడది వెతికే అందం ఒకటే.. వంచన లేని మంచితనాన్నే
అప్పుడు మగడూ వామనుడైనా.. హిమాలయంలా కనపడును
ఆకారంలో ఏలాగున్నా మన్మధుడల్లే వుంటాడూ....
ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని 


ఎవ్వడో  అతడెవ్వరో ఒకడొస్తాడూ....

పిల్లని చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో.....

ఓరగా ఎటు చూసినా  ఒణుకొచ్చేనేందుకో


పిల్లకి పెళ్ళి చూపులూ... పాఠం నేర్పని పరీక్షలూ
పిల్లకి పెళ్ళి చూపులూ... పాఠం నేర్పని పరీక్షలూ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5154

Friday, August 21, 2015

బంగారు బాల పిచ్చుక




చిత్రం :  కృష్ణార్జునులు (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

హే.. హెహె.. హే.. హే
ఆ.. ఆ.. ఆ..ఆ .... అహహా...అరరరరా..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహొహో.. అరరరరా.. 


బంగారు బాల పిచ్చుక...క...
నీ చూపులతో నన్ను గిచ్చక.. క...
వెచ్చగుంది పచ్చిక... చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే.... దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే....దుబుదుబుదుబు


బంగారు బాల పిచ్చుక...క...
నీ మాటలతో పొద్దు పుచ్చక....క...
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా... అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా... అరే..దుబుదుబుదుబు



చరణం 1 :



వాలు చూపుల వంతెనేసి.. వంటి దూరం దాటకుంటే
పిచ్చుకెగిరి గూడు మిగిలేనే......ఏ..ఏ..
కంటి పాపల జోలపాడి... జంట ఊయల ఊగకుంటే
చిచ్చు రగిలి గోడు మిగిలేనే......ఏ..ఏ..


అచ్చట్లాడే.. ముచ్చట్లాడే.. అందమిచ్చుకో
ఎప్పట్లాగే.. చప్పట్లేసి.. ఈడు తెచ్చుకో

దుబుదుబుదుబు... 

బంగారు బాల పిచ్చుక...క..  నీ చూపులతో నన్ను గిచ్చక
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా... అరే.. దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా... అరే.. దుబుదుబుదుబు


చరణం 2 :


మల్లెజాజుల మంచు తీసి... పిల్లగాలితో చల్లకుంటే
పిచ్చి ముదిరి ప్రేమ రగిలేనే...ఏ..ఏ..
ఆయ్..చందమామ ముద్దుపెట్టే... సందె కబురే పంపకుంటే
ఉచ్చు బిగిసి  ఊపిరాగేనే...ఏ...ఏ..


అచ్చమత్త బుచ్చబ్బాయి లగ్గమెట్టుకో
అచ్చొత్తాయి అందాక నీ బుగ్గలిచ్చుకో..


దుబుదుబుదుబు...
బంగారు బాల పిచ్చుక....క..క..నీ మాటలతో పొద్దు పుచ్చక...క..క..
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా... అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా... అరే..దుబుదుబుదుబు



బంగారు బాల పిచ్చుక...క..క..  నీ చూపులతో నన్ను గిచ్చక.. క.. క..
వెచ్చగుంది పచ్చిక... చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే..దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే..దుబుదుబుదుబు





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3819

Thursday, August 20, 2015

సుందర బృందావనిలో




చిత్రం :  కృష్ణార్జునులు (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి


జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శ్రుతి నీవు అంది...లయ నేనే అంది...
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది


సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 1 :


నా మధుమాసాల ఉదయినిగా.. నా మందహాసాల మధువనిగా
ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా
నా మధుమాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా


చిరుకాటుకలద్దితే చీకటిగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
చిరుకాటుకలద్దితే చీకటిగా
సిరిమల్లె తురిమితే పున్నమిగా
స్వరమైతే నీవు.. జతి నేను అంది..
మనసంటే మాంగల్యమంది.....
మనసంటే మాంగల్యమంది.....


సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 2 :


ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక


ఉలి చూపు తగిలితే శిల్పముగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
ఉలి చూపు తగిలితే శిల్పముగా
చెలి తాను కదిలితే నాట్యముగా
భావాలు నీవి.. రాగాలు నావి
సగమైతే జగమూగునంది.. సగమైతే జగమూగునంది


సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా.
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శ్రుతి నీవు అంది..లయ నేను అంది
కనుచూపే కల్యాణమంది.. కనుచూపే కల్యాణమంది



సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2674

Monday, August 17, 2015

ఇప్పుడేమంటావూ

చిత్రం :  తల్లి కొడుకులు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి : 


హా హా హా....
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ...మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటావూ..ఊఊఊఊ       






చరణం 1 :



పచ్చగా.. ఆ... ఆ...
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
కైపు రేపే నీ అందం.. ఆ కైపు రేపే నీ అందం కళ్ళతో తాగేశానూ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నీ లేత నవ్వుతో నా ప్రాణం పోతుందీ


ఇప్పుడే మంటావూ.. ఎలా వుందంటావూ


ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను
పువ్వులా విరబూసీ.. మొగ్గనై పోయానూ
ఇప్పుడేమంటాను..ఊ... ఊ... 




చరణం 2 :



వెచ్చగా..ఆ.. ఆ..
వెచ్చగా నువు.. నిమురుతువుంటే
వేయి వీణలు... మ్రోగెనూ
వెచ్చగా నువు నిమురుతువుంటే
వేయి వీణలు మ్రోగెనూ


కొంటెగా నువు చూస్తుంటే.. కొంటెగా నువు చూస్తుంటే
కోటి ఊహలు మూగేనూ
ఈ పులకరింత...
ఈ పులకరింత.. ఏనాడూ ఎరుగను
ఈ మొదటివింత.. ఏ జన్మకూ మరువను



ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటానూ..ఊ...ఊ.. 

ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3610

భంభం భోలే





చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : హరిహరన్,  శంకర్ మహదేవన్   



పల్లవి :


భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే


దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..


విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...


భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ..


విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...


భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనా
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనా


భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం
భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం


చరణం 1 :


వారణాసిని వర్ణేంచే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక


నమక చమకాలై యద లయలై కీర్తన చేయగా
యమక గమకలై పద గతులై నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షణంగా.. ఆ.. ఆ


విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ


కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
 ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా


చరణం 2:


ఏ... దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం దందమాదం దం దందమాదం దం
దమాదందం దం దం దం


ఎదురైయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే..
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే


గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకొండి కాశి మహిమా


విలాసంగా శివానందలహరి.. మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ


భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..


దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..


విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...


జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే...


Thursday, August 13, 2015

కనరాని నీవే కనిపించినావే

చిత్రం :  మేలుకొలుపు (1978)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  దాశరథి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :



కనరాని నీవే కనిపించినావే...

అనురాగ వీణ పలికించినావే


కనరాని నీవే..అహా..  

కనిపించినావే...ఆహా..
అనురాగ వీణ..ఆ.. 

పలికించినావే.... ఆ


చరణం 1 :


కలలన్ని నేడు నిజమాయె చూడు....

కలలన్ని నేడు నిజమాయె చూడు
ఏనాటికైనా విడిపోదు తోడూ.... 

ఇన్నాళ్ళు నీకై వేచాను నేను...
ఇనాళ్ళు నీకై వేచాను నేను...
ఎడబాటు దాటి చేరాను నిన్ను.. చేరాను నిన్ను


ఉందాము మనము...  ఒక గూటిలోనే
నడిచేము మనము...  ఒక బాటలోనే



చరణం 2 :


మ్రోగింది అందె..నా రాజు కోసం
వేసింది చిందు.. నా మూగ హృదయం
హృదయాలు రెండు ఉయ్యాలలూగే

హృదయాలు రెండు ఉయ్యాలలూగే
జత చేరి నేడు సైయ్యాటలాడే


కనుపాపలాగా...  నిను చూసుకోనా
పసిపాపలాగా... నిను దాచుకోనా


కనరాని నీవే కనిపించినావే... అనురాగ వీణ పలికించినావే 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7843

ఎలా గడపను ఒక మాసం





చిత్రం :  అమరజీవి (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


ఎలా..
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం
ఆ..ఆ..ఆ..ఆ..అహ..
ఆ..ఆ..ఆ..ఆ..అహ.. 


ముప్పైపోయిన చలి మాసం.. ముద్దే దొరకని సన్యాసం
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిసద.. దనిద.. దమద.. నిదమ..గమద.. గమగస
సదా.. గదా.. మని..దస.. రిరినిససదస.. నిసదని మదదని గమదస



చరణం  1 :


ఎలా..
ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం
ఆ.. ఆ.. ఆ.. అహా..
చిగురు వేసినా శృంగారం... పండు దొరకని ఫలహారం

ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆ.. ఆ.. ఆ..ఆ
పపపపమపగమ రిరిసప.. నిదగమని.. నిదనినిస..
మపస.. గమగరిసా..



చరణం 2 :



ఎలా..
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం


ఆ.. ఆ.. ఆ.. ఆహా.. హా
ఆ.. ఆ.. ఆ.. ఆహా.. ఆ...


కరిగిపోనీ ఈ క్షణం క్షణం..
పెంచుతున్నది విరహ యుగం
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం








అమ్మడో అప్పచ్చి



చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, కల్పన


పల్లవి :




కోలు కోలు కోలు యమ్మా.. కొలుకొలుకోలోయమ్మా
కోలు కోలు కోలు యమ్మా.. కొలుకొలుకోలో...


అమ్మడో అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి... ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ
అమ్మడో అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి... ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ
బావరో బావర్చి తినిపించవా మిర్చి... వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి


ముప్పూటా ముద్దొచ్చి... మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పిచ్చి...  ఊరంతా తిప్పిచ్చి ... ఈ.. ఈ.. ఈ


కోన దాటిందమ్మ.. కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నానమ్మ.. కోయంటే పలికాడమ్మ


కోలు కోలోయమ్మ కొలుకోలుకోలుయమ్మ
డోలు డోలోయమ్మ డండోలుడోలుయమ్మ


అమ్మడో అప్పచ్చి....  నువ్వంటేనే పిచ్చి...
వాయనాలు తెచ్చి....  వడ్డించు వార్చి



చరణం 1 :



పిల్లగాలి వీస్తుంటే... చాలు పొమ్మన్నా
కోలు కోలోయన్నా కోలన్నా కోలూ
మల్లెపూలు చూస్తుంటే... మండి పడుతున్నా
డోలు డోలోయన్నా డోలన్నా డోలూ
పిల్ల గాలి వీస్తుంటే... చాలు పొమ్మన్నా
మల్లెపూలు చూస్తుంటే... మండిపడుతున్నా


ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే
ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే


అమ్మడో అప్పచ్చి....  నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చి.... వడ్డించు వార్చి



చరణం 2 :


బక్క చిక్కి నడుమేదో... బావురుమంటుంటే
కోలు కోలోయన్నా కోలన్నా కోలూ
అందమంతా అచ్చొచ్చి... చిచ్చే పెడుతుంటే
డోలు డోలోయన్నా డోలన్నా డోలూ


బక్క చిక్కి నడుమేదో... బావురుమంటుంటే
అందమంతా అచ్చొచ్చి.... చిచ్చే పెడుతుంటే


ఏ పూటకాపూట నీ పాట నాదై పలకరించాలిలే
ఈ పూట నీ పైట ఆ చోట మాటే వినను అన్నాదిలే


అమ్మడో అప్పచ్చి.... నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చి.... వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి....  మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పిచ్చి...  ఊరంతా తిప్పిచ్చి ఈ.. ఈ... ఈ

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నానమ్మ కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ... కొలుకోలుకోలుయమ్మ
డోలు డోలోయమ్మ... డండోలుడోలుయమ్మ



అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో




చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత :
నేపధ్య గానం :


పల్లవి :




అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
చలికాలం చంపేస్తోందయ్యో
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో


అతడు : అరె సోకుల్లో సెగ సింఫనీ
ఆమె: ఎరుపెక్కించేకు చెంపని
అతడు: కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా


అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో

చరణం 1 :


అతడు: సోకుల ఎరనే చూపి..  చిరు  కాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలిలాగ.. చెక్కైమాకె పోరి
ఆమె: చూపుల సూదుల తోటి.. నా కోకలు గోడలు దాటి
తుంటరి గుంటడు మారనంటే ఎట్ట వేగేదేంటి


అతడు: ధీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావ చక్కెరకేళి
ఆమె: పైట రాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి..చారి..చారి... చారి..చారి


అతడు: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మొహమాటం చెట్టెక్కిందయ్యో


చరణం 2 :


ఆమె:అచ్చిక బుచ్చికలాడి.. నును వెచ్చని తాకిడి తోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితె.. ఎట్టా ఆపేసేది
అతడు:  వెన్నెల పందిరి వేసి మరుమల్లెల మంచం‌ వేసి
ఇద్దరి మధ్యన దుప్పటి కడితె ఘోరం కాదా బేబి


ఆమె:  చాటుగా వచ్చి చేతి వాటాన చేయవోయ్ ఇంక వన్నెల బోని
అతడు: లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాలమారీ ..మారీ.. మారీ ..మారీ.. 


అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
చలికాలం చంపేస్తోందయ్యో

ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో

అతడు : అరె సోకుల్లో సెగ సింఫనీ
ఆమె: ఎరుపెక్కించేకు చెంపని
అతడు: కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా

అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
చలికాలం చంపేస్తోందయ్యో

ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 

చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో 

అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
చలికాలం చంపేస్తోందయ్యో

ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 

చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో 

Wednesday, August 12, 2015

దాయి దాయిదామ్మా




చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : కె.కె ,  మహాలక్ష్మి అయ్యర్
  


పల్లవి :


అతడు : దాయి దాయిదామ్మా.. కులికే కుందనాల బొమ్మ

నీతో  పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ


ఆమె : దాయి దాయి దామ్మా.. పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా నా నిండు చందమామ


ఓహో.. హోహో..
అతడు : ఒళ్ళో వాలుమా.. 
ఓహో.. హోహో..
ఆమె: వయసే ఏలుమా..


అతడు : నిలువెల్ల విరబూసే నవ యవ్వనాల కొమ్మ
ఆమె: తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమ 


అతడు : దాయి దాయిదామ్మా.. కులికే కుందనాల బొమ్మ
నీతో  పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ


ఆమె : దాయి దాయి దామ్మా.. పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా నా నిండు చందమామ


చరణం   1 : 


అతడు : టకటకమంటు తలపును తట్టి తికమక పెట్టే...లకుముకిపిట్ట.. నిన్ను వదిలితె ఎట్టా
ఆమె: నిలబడమంటు నడుమును పట్టి కితకితపెట్టే...మగసిరి పెట్టా.. కథ ముదిరితె ఎట్టా 


అతడు: కేరింతలాడుతు కవ్వించ లేదా.. కాదంటే ఇప్పుడు తప్పేదెలా
అరె కాదంటే ఇప్పుడు తప్పేదెలా
ఆమె : నీ కైగిలింతకు జాలంటు లేదా.. ఏం దుడుకు బాబూ ఆపేదెలా
అయ్యో.. ఏం దుడుకు బాబూ ఆపేదెలా


ఒహో..హో..
అతడు : కోరిందే కదా
ఒహో..హో.. 
ఆమె : మరీ ఇంతిదా 


అతడు : మరికొంచెం అనిపించే  ఈ ముచ్చటంత చేదా?
ఆమె: వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా?

అతడు : హాయి హాయి హాయె.. అరెరే పైట జారిపోయె
పాప గమనించవే.. మా కొంప మునిగిపొయే
 



చరణం 2 : 

అతడు : పురుషుడినెట్ట ఇరుకును పెట్టె పరుగుల పరువా..సొగసుల బరువా.. ఓ తుంటరి మగువా
ఆమె: నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా.. ఎగబడ లేవా.. తగు జతకావవా.. నా వరసై పోవా


అతడు : అల్లడిపోకే పిల్లా మరి.. ఆ కళ్యాణ ఘడియా రానీయవా 
ఆ కళ్యాణ ఘడియా రానీయవా
ఆమె: అరె.. అందాక ఆగదు ఈ అల్లరి.. నీ హితబోధలాపి శృతిమించవా..
నీ హితబోధలాపి శృతిమించవా

ఒహో..హోహో..

అతడు : వాటం వారెవా

ఒహో..హోహో..

ఆమె : ఒళ్ళో వాలవా

అతడు : అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేనా

ఆమె : సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన   

అతడు : దాయి దాయిదామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో  పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ


ఆమె : హె..హె..హె.. హాయి హాయి హాయే.. కొరికే కళ్ళు చెదరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటె హాయే  




Tuesday, August 11, 2015

గజ్జె ఘల్లుమన్నాదిరో



చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం : మనో, స్వర్ణలత 


పల్లవి :



హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి


అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె  : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో


హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ

అతడు : రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
ఆమె : చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు


అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె  : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో


చరణం 1 :



ఆమె  : ఓ పాలపిట్ట శకునం నీదెనంట
అతడు : ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట


ఆమె  : చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
అతడు : కలలు కన్న కన్నె వన్నె కోరికలు


ఆమె  : చెరువులోన తామరాకుపై ఊగే మంచు ముత్యమేమన్నది
అతడు : చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది

హొహొ హొహొ
ఆమె  : అందమైన చెంప మీద
హొహొ హొహొ
అతడు : కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ
ఆమె  : కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో


అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె  : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో


హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి


చరణం 2 :


ఆమె  : ఓ ఏకవీర తిరుగే లేదు లేర
అతడు : ఓ పూలతార వగచే రోషనార


ఆమె  : అడుగు పడితె చాలు నేల అదురునులే
అతడు : పడుచు వాలు చూపు పడిన చెదరనులే


ఆమె  : పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పాడుతారులె
అతడు : అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె

హొహొ హొహొ
ఆమె  : పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ
అతడు : పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ
ఆమె  : జంటగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో


అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె  : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో


తననన్నాననా.. తననన్నాననా..
తననన్నాననా..తననన్నాననా.. 





నడక కలిసిన నవరాత్రి




చిత్రం : హిట్లర్ (1996)

సంగీతం : కోటి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, చిత్ర


పల్లవి :


నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి
నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి


అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి


మొగుడు మొగుడని అంటే స్త్రీ...  మొదలు పెడితే.. వన్ టూ త్రీ
ఒంపు సొంపుల యంగోత్రి... కాలు జారకే ఖంగోత్రి

అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి


చరణం 1 :


అందమైన మాట అడ్డు...  శోకులమ్మ సొంత బొడ్డు..
జివ్వుమన్న రవ్వ లడ్డు...  


ABC లు లేని Z... ఏపుగున్న బుగ్గ రెడ్డు...
లేతగున్న నీటి బొట్టు


అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు... నిప్పు రాజుకుంటుంటే
పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు... ప్రేమ దిద్దుకుంటుంటే
అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు... నిప్పు రాజుకుంటుంటే
పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు... ప్రేమ దిద్దుకుంటుంటే


తనువే పలికే కసి కవ్వాళి... నరమే వొణికే ఎద మనాలి
తెరలే తెరిచి పద తెనాలి... పదవే పొదకి పసి మరాళి


అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి


నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే ఖంగోత్రి



చరణం 2 :


రాజమండ్రి రేవు కాడ.. రంగసాని మేడ కాడ.. రాతిరేల రంభదంట
నాయుడోరి ఇంటికాడ నల్లతుమ్మ సెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట


అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందేలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ బెట్టి.. వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందేలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ బెట్టి.. వెన్నుపూస దాస్తుంటే


జగడం రగడం జత జవాని... పరువం పలికే ప్రియభవాని
తొలిగా పడితే చెలి నిషానీ... జరిగే జతులే యమ కహానీ 


అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి


నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే ఖంగోత్రి


అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
ఏయ్... అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

జై జై గణేశా..





చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : చంద్రబోస్

నేపధ్య గానం : బాలు 



పల్లవి : 

గణేశ్ మహరాజ్ కి.. జై...
గణేశ్ మహరాజ్ కి.. జై... 


ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి
ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి
ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి
ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా
జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా
హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా


చిట్టి ఎలుకను ఎక్కి... గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా.. గమ్ గణపతి... గణేశా...  గమ్ గణపతి
గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా
జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా

లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ
లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ..  లంబోదర నీదే దయ  




చరణం   1 : 


నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి.. వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి... రథమల్లే మారలేదా


పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా... కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం... ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పరా మాకు సోదరభావం... మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  గమ్ గణపతి
గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా
జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా



చరణం   2 : 


చందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా


ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ.. మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా.. లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా... ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  గమ్ గణపతి
గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా
జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎక్కి... గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా.. గమ్ గణపతి... గణేశా...  గమ్ గణపతి
గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

గణపతి బప్పా మోరియా...ఆధా లడ్డు ఖా లియా
గణపతి బప్పా మోరియా...ఆధా లడ్డు ఖా లియా
గణపతి బప్పా మోరియా...ఆధా లడ్డు ఖా లియా
గణపతి బప్పా మోరియా...ఆధా లడ్డు ఖా లియా 

ఏమేమో అవుతుంది

చిత్రం : శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం : టి. వి. రాజు
రచన : సముద్రాల(జూ)
గానం : సుశీల


పల్లవి :


ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు


ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు...


చరణం 1 :



పువ్వులు... మువ్వలు...
పువ్వలు పులకరించి నవ్వులొలుకుతున్నవి... ఈ.. ఈ..
మువ్వలు పరవశించి సవ్వడి చేస్తున్నవి.. సవ్వడి చేస్తున్నవి 


ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ....ఆఆ.... ఆ..ఆ.. 






చరణం 2 :


నీలాల మబ్బు తునక  నేలకు దిగి వచ్చెనా
నీలాల మబ్బు తునక  నేలకు దిగి వచ్చెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముంగిటనే నిలిచెనా... 






Monday, August 10, 2015

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ

చిత్రం :  రాజ్ కుమార్ (1983)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి





పల్లవి :

ఆఆఆఆఆఆఆఆఆ..
ఆహాహ.. ఆహాహ.. ఆహాహ..  


తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది.. ప్రియ భాషా
పలుకే లేనిది.. ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ


చరణం 1 :


కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే
क्या
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే
बने मेरे प्राण मन मध् के तीर ऐ है प्रेम का सार


ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం
अच्चा
తొలి పాట చెలికంకితం..  చెలి నీడ నా జీవితం...
ఆరారు కాలాలకిది కామితం

 नजरॊं सॆ.. ఆహ.. दिल नॆ दिया नजराना... అహహ..
 न हॊ सका और दॆना
 न हॊ सका और दॆना.. देना
नजरॊं सॆ.. ఉహూ.. दिल नॆ दिया नजराना



చరణం 2 :

బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ
 फिर
శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ

 सांझ सवॆरॆ पूछूंगी मैं खिल कवल सॆ तुम्हॆं
కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం...
शुक्रीया

కుసుమించే చెలి యవ్వనం..  నా మదికే నీరాజనం..
ఏడేడు జన్మాలకిది శాశ్వతం..


తొలి చూపు చెలి రాసినా శుభలేఖ
नजरॊं सॆ दिल नॆ दिया नजराना

పలుకే లేనిది ప్రియ భాషా
न हॊ सका और देना.. देना


తొలిచూపు చెలి రాసిన శుభలేఖ
नजरॊं सॆ दिल नॆ दिया नजराना 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2680

అర్ధరాత్రి సద్దుమణిగి

చిత్రం :  రాజ్ కుమార్ (1983)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి :

హేయ్...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినబావా.. వయసుకు లొంగావా
వరసను కలిపావా.. మరదలికై వచ్చావా .. హోయ్ భలే



అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినదానా... ఇది వయసనుకోనా....
నీ పొగరనుకోనా.. నేనే దొరికానా తల్లీ...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....


చరణం 1 :


పున్నమి వెన్నెల సన్నని సూదులు అయినాయి... అయ్యయ్యయ్యో...
ఈ మల్లెలన్నీ మన్మధ బాణాలైనాయి... అహా..అహా


కన్నేమనసుకు తాళం వేస్తే బయటే ఉంటాయి
నువు కన్నులు మూసి నిద్దరపోతే.. పోతాయి...

చలిగాలీ... అహహా.. వేస్తొందీ... అహహా..
తలుపేసి రమ్మంది... విన్నావా....ఆ... ఆ...ఆ
జతకోసం చూస్తుంది.. రా బావా..
తలుపేసి వెళతాను.. చలి తోటే ఉండని నన్ను...




అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినబావా.. వయసుకు లొంగావా
వరసను కలిపావా.. మరదలికై వచ్చావా...హోయ్ భలే
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా



చరణం 2 : 


అమ్మనాన్నలు అల్లుడు నువ్వే అన్నారు... అయ్యబాబోయ్...
నా అత్తమామలు మనవడు కావాలన్నారు... అహహహా...
అందరి ఆశలు తీర్చేవాళ్ళే లేరమ్మా..
నేనల్లుడనయ్యే అత్తామావలు వేరమ్మా...

పరువాన్ని.. అహహ.. అందాన్ని...అహహా..
హృదయాన్ని ఇస్తున్నా... కట్నంగా ... ఆ..ఆ..
బిగి కౌగిలి ముడివేసి భద్రంగా..
బిగి కౌగిలి.. ఉరితాడు .. ముడివేయకు...అమ్మమ్మమ్మా...



అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా
చినదానా ఇది వయసనుకోనా...
నీ పొగరనుకోనా... నేనే దొరికానా తల్లీ...
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....
అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా....





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2681


Thursday, August 6, 2015

జగములనేలే గోపాలుడే





చిత్రం :  శ్రీకృష్ణావతారం  (1967)
సంగీతం :  టి. వి. రాజు
రచన :  సినారె
గానం  :  సుశీల, ఘంటసాల


సాకీ :


మెరుగు చామన ఛాయ మేని సొంపుల వాడు
నును మీగడల దేలు మనసున్న చెలికాడు
దొరవోలె నా మనసు దోచుకున్నాడే..


పల్లవి :


జగములనేలే గోపాలుడే
జగములనేలే గోపాలుడే... నా సిగలో పూవవును ఈనాడే
మగువుల నేలే గోపాలుడే...  నీ మనసే దోచెను ఈనాడే
మగువుల నేలే గోపాలుడే..  


చరణం  1 :



ఘుమఘుమలాడే మమతల మల్లెలు
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
కోరినంతనే దొరకవులే... 

మదనుని గెలిచిన మగరాయని గని
మదనుని గెలిచిన మగరాయని గని
మల్లెలు తామే వలచునులే
మగువా నీ మది తెలిసెనులే 


జగములనేలే గోపాలుడే... నీ మనసే దోచెను ఈనాడే


చరణం  2 :

భామా మానస పంజరమ్ములో
భామా మానస పంజరమ్ములో.. రామ చిలుకవై నిలిచేవా 

పంజరమైనా ప్రణయ దాసునికి
పంజరమైనా ప్రణయ దాసునికి ... పసిడి మేడయే ప్రియురాలా
బాసయె చేసెద ఈ వేళా..


జగములనేలే గోపాలుడే.. నీ మనసే దోచెను ఈనాడే


చరణం  3 :

చేసిన బాసలు చిగురులు వేయగ
చేసిన బాసలు చిగురులు వేయగ... గీసిన గీటును దాటవుగా
అందముతో నను బందీ జేసిన
అందముతో నను బందీ జేసిన... సుందరి ఆనతి దాటేనా
ఉందునే ఓ చెలి నీలోనా 


జగములనేలే గోపాలుడే ... నా సిగలో పూవాయే ఈనాడే
మగువుల నేలే గోపాలుడే ... నీ మనసే దోచెను ఈనాడే






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18078

నాదం నీ దీవనే

చిత్రం :  రాగమాలిక (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : జానకి


పల్లవి :



నాదం నీ దీవనే.. నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే.. పలుకే పాలూరదా...  

ఓ.. పువ్వే వికసించదా


నాదం నీ దీవనే...  నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే... పలుకే పాలూరదా ... ఓ.. 

పువ్వే వికసించదా
నాదం నీ దీవనే... 


చరణం 1 :


అమృతగానం ఈ అనురాగం.. నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే


కన్నుల మౌనమా.. కలకే రూపమా
దాచకే మెరుపులే..  పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే.. తొలిసారి విరిసే


నాదం నీ దీవనే


చరణం 2 :


కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే


కోవెల బాటలో..  పువ్వుల తోరణం
ఎంతకూ మాయని...  తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం... విధి నాకు విరహం


నాదం నీ దీవనే....  నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే....
పలుకే పాలూరదా...  ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12807