Thursday, March 31, 2016

చినుకు చినుకు అందెలతో




చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత : జొన్నవిత్తుల
నేపధ్య గానం : చిత్ర , బాలు 


పల్లవి :


చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 



చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా



చరణం 1 :


నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో...
గుండెల్లో ఎండ కాసే ఏలో... 



అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో...
చిటికేస్తే బుగ్గ మీద ఏలో...  



తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం
ఆహా…ఊహూ… ఓహోహొహో


చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా




చరణం 2 :


మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో..
వయసంటే తెలిసొచ్చే ఏలో... 


మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో


ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే
సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో


చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  



 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా





నీలి వెన్నెల జాబిలి





చిత్రం : రాజేంద్రుడు-గజేంద్రుడు (1993)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత :
నేపధ్య గానం : చిత్ర , బాలు 



పల్లవి :

నీలి వెన్నెల జాబిలి ...
నీలి వెన్నెల జాబిలి...  నీలి నవ్వుల ఆమని
రా మని నా దరి... అందుకొ ప్రేమని... నీలి కన్నుల కోమలి


నీలి వెన్నెల జాబిలి... నీలి నవ్వుల ఆమని
చేరని నీ దరి .. అందుకో ప్రేమని..  రాగ వీధుల సాగని  


చరణం 1 :


నా వలపుల కోవెల మంటపం...  నీ రాకకు పలికెను స్వాగతం
సిరి మల్లెల రువ్వె సొయగం...  తొలి ప్రేమకు ఆయను తొరణం
ప్రేమలే పెనవేయగా... ఆశలే నెరవేరగా...
అనురాగ సిరుల సరసాల సుధలు మనసార మరుల పండించుకొందుమా 

నీలి వెన్నెల జాబిలి... నీలి నవ్వుల ఆమని



చరణం 2 :


ఓ చల్లని చూపుల దేవత... ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా... జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము... కానుకా సుముహూర్తము....
గోరింట పూల.. పొదరింటిలోనా.. నీకంటి దీపమై.. జంట చేరనా...


నీలి కన్నుల జాబిలి... నీల నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ ... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11542

రాదే చెలి నమ్మరాదే చెలి




చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : చిత్ర 


పల్లవి :


రాదే చెలి నమ్మరాదే చెలి... మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి...  మగనారీ మనసమ్మరాదే చెలి



చరణం 1 :


నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలు చీరకి డబ్బులు కరువన్నాడే
నెల తప్పిన నెలత తనకి పరువన్నాడే
నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నడే
ముంగురులను చూసి తాను మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరచిపోయాడే
ప్రేమించు సీజన్లో   పెద్ద మాటలు
పెళ్ళయ్యాక ప్లేట్లు ఫిరాయింపులు

మొదటి వలపు.. మధుర కథలు.. మరిచెను ఘనుడు


మగవారినిలా నమ్మరాదే చెలి... రాదే చెలి నమ్మరాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి




చరణం 2 :


మాటల్తో కోట కట్టాడే.. అమ్మో
నా మహరాణి నీవన్నాడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
గాలి తాకితే వాగుల కాలువిరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలి కోసం
ఆ కాస్త తీరాక మొదటికి మోసం
మనవి వినడు.. మనసు కనడు.. మాయల మొగుడు


మగవారినిలా నమ్మరాదే చెలి... రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనారీ మనసమ్మరాదే చెలి..



చరణం 3 :

తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే
సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోమభయము తోయజనేత్రా
తనుగా వలచిన వరుడేనా...  ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా... ఇలలో ... కలదో...  లేదో 



సొగసు చూడ తరమా



చిత్రం :  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు


పల్లవి :


సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా
సొగసు చూడ తరామా ...
నీ సొగసు చూడ తరమా ఆ ఆ



చరణం 1 :


అరుగు మీద నిలబడి ... నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు
చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి
ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడ తరమా...  నీ సొగసు చూడ తరమా ఆ ఆ




చరణం 2 :


పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలి౦చికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ
చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టే
తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు
విడువిడుమ౦టున్నపుడు.. ఆ సొగసు చూడ తరమా..
నీ సొగసు చూడతరమా ఆ.. ఆ


పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు
పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి... ఛి పొ౦డి... అన్నపుడు..
నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడ తరమా...  నీ సొగసు చూడ తరమా ఆ ఆ



చరణం 3 :


సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొ౦గును చెలికోకలముడిఓ అదిమి ..అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...





Wednesday, March 30, 2016

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి





చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు , జానకి 



పల్లవి :

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 1 :


ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది... ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే 

ఈ రోజే నాకు తెలిసింది... ఈ చిత్రాలు చేసింది లవ్వని

మధు పత్రాలు రాసింది లవ్వని... 



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 2 :


ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ... ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆ రోజు మెరిసింది అందం చిరునామా... ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే....  ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది... రాగాలు రేపింది లవ్వని
అనురాగాలు చూపింది నువ్వని... 


ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11540

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా




చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు , జానకి 


పల్లవి :


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా


చరణం 1 :


మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట 


అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు 


కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా



ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ... అలకలు వారి సొంతమా 


చరణం 2 :


నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట 


గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట 


వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ....  అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ... శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11541

మధురమే సుధా గానం



చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు,  జానకి


పల్లవి :


మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం... మెదిలే తొలి సంగీతం


మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం



చరణం 1 :


చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని వున్నా వెలుగొక్కటేకదా
శతకోటి భావాలను పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్నా  మధురిమలు మారునా


మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం


చరణం 2 :


వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగలకు నాదమొకటే కదా
అనుభూతులెన్ని వున్నా హృదయమొకటే కదా

మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం... మెదిలే తొలి సంగీతం


మధురమే సుధాగానం... మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం

మదిలో మోహన గీతం...  మెదిలే తొలి సంగీతం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11539

పరుగులు తీసే వయసుంటే

చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :

హె ఏ అహా లాలా
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
ల లల లలా లలా


చరణం 1 : 

ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరు నవ్వుల దీపం ఉంటె
చిక్కుల దిక్కులన్ని దాటుకు పోవాలి
చుక్కలున్న మజిలి చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి
కరక్ట్
సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం
డెఫెనేట్లీ
దూసుకుపోయే ధైర్యం ఉంటే...  ఓడక తప్పదు కాలం
ల లల లలా లాల లా
దు దుదు తర తరా రా

పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే



కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి
కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి


ఆ.... ఆహా
ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే...  తగలక తప్పదు గాయం
ల లల లలా లలా
ల లల లలా లలా


పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
కు ఊ కు ఊ
చికుచికు చికుచికు చికుచికు
ల లల లలా లలా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11557

Monday, March 28, 2016

గోపీలోల... నీ పాల పడ్డామురా



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, శైలజ 


పల్లవి :


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల.. అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు.. ఆ దిక్కులే దిక్కమ్మలూ 


గోపీలోల... నీ పాల పడ్డామురా 




చరణం 1 :



జాలిమాలిన ఈ గాలీ.. తేరిపార చూసే రేపే ఈల
మావిమాటున దాగుంటే.. గువ్వలు చూసి నవ్వే గోల 


తరుణి రో.....కరుణతో మోక్షం చూపే.. కిరణమై నిలిచానే
తనువుతో పుట్టే మాయను.. తెలుపగా పిలిచానే
మోక్షం కన్నా.. మానం మిన్న
నిన్ను నన్ను కన్నులు మూసేనా


గోపీలోల.. నీ పాల పడ్డామురా
భామా భామా.. తీరాన్ని చేరాలమ్మా
చనీళ్లలో ఉన్నామురా.. చిన్నరులం మన్నించరా ..
గోపీలోల.. నీ పాల పడ్డామురా 



చరణం 2 :


వాడిపొనీ సిరులెన్నో.. పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేను కోరే ఆ తారా..  ఏది మీలోన భామా భామా భామా


తగదు రా.....ఇది మరీ సోద్దెం కాదా.. సొగసరీ గోవిందా
అందరూ నీ వారేగా.. ఒకరితూ ముడి ఉందా..


చూసే కలలూ.. ఎన్నో ఉన్నా.. చూపే హృదయం ఒకటే ఉందమ్మ


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల... అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా ..
అందాక మీ అందాలకు... ఆ దిక్కులే దిక్కమ్మలూ 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11506

పోరాపాటిది.. తడబాటిది



చిత్రం  : లేడీస్ టైలర్ (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత  :  సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి :


పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
ఏదోపాపం పసివాణ్ణి.. జాలీ చూపి.. మన్నించండి 


అతితేలివితో మాతిపోయేనా... నీ వేషం నా ముందరా
అతితేలివితో మాతిపోయేనా... నీ వేషం నా ముందరా



చరణం 1 :


కలనుకోరిసే చేప నేనూ.. ఎరను చూసీ మొసపొనూ
వెక్కిలి వేషాలు ముదిరిపోతేను.. అసలు పాఠాలు నేర్పద
యముడిలా వాడు వెంట ఉన్నాడు.. తెలుసునా.. తెలియజేప్పనా 


వొద్దు వొద్దు బాబోయి... తప్పు కాయి తల్లోయి
తప్పు తెలుసుకుంట... గోడ కుర్చీ వేస్తా
మొన్ననే నేను కళ్ళు తెరిచాను... ఇంతలో నన్ను బూచాడికిచెయకు



అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా
అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా
పొనీ పాపం అనుకుంటే.. ఓహో చనువే ముదిరిందే.. మర్యాదేనా



పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా 



చరణం 2 :



విలువ తెలిసే వెతికి చేరా... బతుకు నీతో ముడిని వేశా
దరికి జేరాను వరము వేడాను... కరుణతో దారి చూపవా
మనసులో మాట తెలుసుకోవమ్మ... చెలిమితో కలిమి కురియవా


చిన్నవాడా.. నిన్ను నమ్ముతాను లేవోయి... అల్లరెందుకింక పలకెళ్లితేవోయి
కోతి వేషాలు మానితే చాలు... నిన్ను వెన్నంటే ఉంటాను ఏనాడు 



పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా 

అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11508

ఎక్కడ ఎక్కడ ఎక్కడ



చిత్రం  : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు


పల్లవి :


సుందరి..ఎందుకె.. ఇట్టా రావే..ఇట్టా రావే..
తిప్పుకుంటూ..తిప్పుకుంటూ..అట్టా అట్టా.. పోతావేమే
కొత్త రవిక.. సక్కగుందే.. ముచ్చట్టేస్తా.. ముద్దుగుందే
కన్ను కుడితే.. కుట్టి చూడు.. కుట్టినోడు గట్టివాడు
కట్టుకున్న నిన్ను చూస్తే... కన్ను కొత్తనోడు ఎవడు
సోకులంత సుట్టపెట్టి... బంగారంత పొంగుతున్న
ఇంత చిత్తరాల రవిక కుట్టినోడు ఎవ్వాడే
పదమటీధి సందులోన... పాత ఇంటి ముందరున్న టైలరు...  పేరు సుందరం 




ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి


ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక...  చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..




చరణం 1 :



ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట
ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట
ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలిలే కూపీ
ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలిలే కూపీ
గుట్టు మట్టూ తీసి.. పుట్టు మచ్చను చూసి
టక్కున పట్టేయాలి...  నక్కను తొక్కేయాలి
పొరపడి పరులకు దొరకక 

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి


ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక...  చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..



చరణం 2 :


శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా
శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా
ఎల్లాగని గుర్తించను.. శ్రీదేవిని..  ఆ దేవిని
ఎల్లాగని గుర్తించను.. నాదేవి ఏదో
గుర్తును గుట్టుగ దాచి.. అల్లరి పెట్టే వేళ..
ఎవ్వరి నవ్వులు నమ్మను.. గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి.. ఇక మరి... పని సరి





ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి






హాయమ్మ హాయమ్మ హాయమ్మా



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత  : సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి :


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
అందాల బంధాల ఉందామా... ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కేనూ... రంగేళి నీకె దక్కేను



చరణం 1 :



దరహాసమై నీ అధరాల పైనే... ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మా
చిరవాసముండే తరళాక్షి నేనే... ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మా
నను చూడు... సయ్యమ్మ సయ్యమ్మ
మనువాడు... సయ్యమ్మ సయ్యమ్మ
అలివేణి.. నాదమ్మ నాదమ్మ
కలవాణి... నీవమ్మ నీవమ్మ
నిను కనగానే... ఎదనదిలో
అలజడి ఏదో సుడి తిరిగే
నీవే జతవైతే కల తీరేనీవేళా.... ఓ...


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా



చరణం 2 :


మదిలోని బాలా ఎదురైన వేళా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
పదహారు వేలా మదిరాక్షులేలా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
మురిపాలు... హాయమ్మ హాయమ్మ
సరదాలు... హోయమ్మ హోయమ్మ
సరసాలు... హాయమ్మ హాయమ్మ
సగపాలు... హోయమ్మ హోయమ్మ
పరువము నిన్నే పిలిచెనురా...
తరుణము నేడే కుదిరెనురా...
ఏడు జన్మాల నీ జోడు నేనేరా....


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా





వయ్యారి గోదారమ్మ




చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి



పల్లవి :


వయ్యారి గోదారమ్మ... ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై

వయ్యారి గోదారమ్మ... ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం





చరణం 1 :



నిజము నా స్వప్నం... అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం...  అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే.. ఆహాహాహా.. ఉసురు కారాదా.. ఆహా
మోహమల్లె.. ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు... మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన... ఆలపనై నే కరిగిపోనా 


వయ్యారి గోదారమ్మ... ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం



చరణం 2 :


తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల... సూర్యోదయాలే పండేటి వేళ


వయ్యారి గోదారమ్మ... ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై

వయ్యారి గోదారమ్మ... ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం





నిరంతరమూ వసంతములే

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి



పల్లవి :


నిరంతరమూ వసంతములే... మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే... పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే... మందారములా మరందములే


నిరంతరమూ వసంతములే... మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే... పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే... మందారములా మరందములే



చరణం 1 :


హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం...
తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం...
నదులలో వీణమీటే తెమ్మెరే... మాకు ప్రాణం
అలలపై నాట్యమాడె వెన్నెలే... వేణుగానం
ఆకశానికవి తారలా ఆశతీర విరి రాజులా ??


ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె
నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..


నిరంతరము వసంతములే... మందారములా మరందములే 



చరణం 2 :


అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే...
మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే...
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే


నిరంతరమూ వసంతములే... మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే... పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే... మందారములా మరందములే




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11504

గోపెమ్మ చేతిలో గోరుముద్ద






చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి




పల్లవి :


గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా


గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద... 



చరణం 1 :


రాగాలంత రాసలీలలు... అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు... అలు అరు ఇణి
రాధా... రాధా బాధితుణ్ణిలే... ప్రేమారాధకుణ్ణిలే...

ఆహాహా
జారు పైట లాగనేలరా..అహ..అహ..
ఆరుబయట అల్లరేలరా..అహ..అహ..
ముద్దు బేరమాడకుండా ముద్దలింక మింగవా  


గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా


గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద... 




చరణం 2 :


వెలిగించాలి నవ్వు మువ్వలు... అలా ..అలా... అహహ
తినిపించాలి మల్ల బువ్వలు... ఇలా.. ఇలా.. ఇలా
కాదా... చూపే లేత శోభనం... మాటే తీపి లాంఛనం...


ఆహాహా
వాలు జళ్ళ ఉచ్చులేసినా..అహ..ఆ
కౌగిలింత ఖైదు వేసినా..అహ..ఆ..
ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లె ఉండనా


గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ఆ విందు ఈ విందు నా ముద్దు గోవిందా


గోపెమ్మ చేతిలో అహ..
రాధమ్మ చేతిలో అహ..హ....





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11502

Sunday, March 27, 2016

దూరం.. దూరం.. దూరం




చిత్రం :  మొగుడు-పెళ్ళాలు (1985)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 





పల్లవి : 


దూరం.. దూరం.. దూరం...
ఏయ్..దూరం... దూరం దూరం...
నన్నంటుకోవద్దు శ్రీవారు.. అహా... బుద్ధవారమే మీరు మావారు
బుద్ధవారమే మీరు మావారు


వారం.. ఏలిన వారం.. అహా..
వారం.. ఏలిన వారం ..
శ్రీవారం.. లేదింక ఏవారం.. ఓహో
ప్రతివారము మేము మీవారం...
ప్రతివారము మేము మీవారం... 



చరణం 1 :


ఆదివారమూ సూర్యుడి వ్రతము...
చీకటిపడితే ఆ సూర్యుడు గతము


సోమవారము శివాభిషేకం... హరహరా
ఇక జరిగేదెప్పుడు ప్రేమాభిషేకం


మంగళవారము మారుతి సేవ..
ఈ జన్మకు లేదా ఏకాంత సేవా.. ఈ కాంత సేవా

అయ్యో ఖర్మ ఖర్మ... తప్పండి
జై భజరంగబలీ... చేయ్ నా బ్రతుకు బలి



దూరం.. అబ్బబ్బా... దూరం.. దూరం...
శ్రీవారం.. లేదింక ఏవారం..
బుద్ధవారమే మీరు మావారు
ప్రతివారము మేము మీవారం...
ప్రతివారము మేము మీవారం...




చరణం 2 :


గురువారానికి దేవుడు సాయి...
ఆ రోజుకు లేదా వెన్నెల రేయి.. లేదా?


శుక్రవారము లక్ష్మీ పూజా...
ఆ ఒక్క వారము వదలవే రోజా...


శ్రీనివాసునికి శనివారం...
ఆ రోజూ కావా మనము పనివారం.. ముద్దులా పనివారం..
ముద్దులా పనివారం..


అయ్యో రామా... కళ్ళు పోతాయండి...
ఏడుకొండలవాడ వెంకటరమణా...

నా సుఖం.. నా శాంతి.. నా సర్వం...
గోవిందా... గోవిందా...


దూరం... అయ్యో... దూరం దూరం...
నన్నంటుకోవద్దు శ్రీవారు.. బుద్ధవారమే మీరు మావారు
బుద్ధవారమే మీరు మావారు



వారం.. ఏలిన వారం.. ఏం లాభం...

శ్రీవారం.. లేదింక ఏవారం.. ఆహా....
ప్రతివారము.. ఉమ్మ్.. ఉమ్మ్...
ప్రతివారము మేము మీవారం... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6018

నువ్వు కాటుక దిద్దకపోతే





చిత్రం :  మొగుడు-పెళ్ళాలు (1985)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 





పల్లవి : 


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు




చరణం 1 :




నువ్వు తెల్ల చీర కట్టుకుంటే వెన్నెలాయె నా దారి
వెన్ను మీద కన్ను మూస్తే వెల్లువాయె గోదారి


పూల గుడికి చేరుకుంది చిలిపి తేటి పూజారి
తేనె వెన్నెలభిషేకాలే చేసుకుంది ఈ రేయి


నువ్వు ముగ్గులు పెట్టకపోతే నా ఇంటికి వేకువ రాదు
నీ పాదమే తాకకపోతే ఆ ముగ్గుకు మురిపెం లేదు


నా కన్నుల ఆశలతో నీ ముద్దులు కోరకపోతే
రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు
రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు 


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు



చరణం 2 :



చిలిపి నవ్వులూదగానే సిగ్గు పూల చైత్రాలు
వలపు చూపు చూడగానే చీకటింటి కావ్యాలు


వెచ్చనైన ఊపిరంతా వేణువైన లాహిరిలు
మోహనాన ఊహలెన్నో మోవి దాచు అల్లర్లో


ఎద హారతి పట్టకపోతే నా దేవుడు నిదరే పోడు
విరిశయ్యను పరవకపోతే పరువానికి పరువే లేదు


నా పచ్చని గడపలలో నీ పాదాలు కడగకపోతే
ప్రేమకు పొద్దే పోదు బ్రతుకే అర్ధం కాదు
ప్రేమకు పొద్దే పోదు బ్రతుకే అర్ధం కాదు




నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు




అనకు... ఆ మాట మాత్రం అనకు

చిత్రం : గడుసు పిల్లోడు (1985)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల  




పల్లవి : 



అనకు... ఆ మాట మాత్రం అనకు


అనకు... ఆ మాట మాత్రం అనకు

ఇది ఆఖరి మాటని అనకు

నీ మనసు మూసి వేశాననకు

నా మాట మరచిపోతాననకు 


అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు



చరణం 1 :


నా కళ్ళలోనీ నీ రూపము... కరిగేది కాదు కన్నీళ్లకు
నా కళ్ళలోనీ నీ రూపము... కరిగేది కాదు కన్నీళ్లకు


నీ గుండెలోనీ నా గానము... మాసేది కాదు మరచేందుకు
కాదనకు... లేదనకు... కథ మార్చి పొమ్మనకు 




అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు



చరణం 2 :


ప్రేమ పువ్వుల బాటనుకోకు... పిరికివాడివై బాట మార్చకు
ప్రేమ పువ్వుల బాటనుకోకు... పిరికివాడివై బాట మార్చకు


మనసు మిగిలితే చాలును మనకు...
మమతే గురుతది ఉన్నందుకు...
ఉన్నానూ.. నీ కొరకు.. ఉంటాను కడవరకు



అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు


నీ మనసు మూసి వేశాననకు
నా మాట మరచిపోతాననకు


అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది...  ఆఖరి మాటని అనకు







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2049

Saturday, March 26, 2016

సిరిమల్లీ శుభలేఖా




చిత్రం : చూపులు కలిసిన శుభవేళ (1988)
సంగీతం : రాజన్-నాగేంద్ర
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :



సిరిమల్లీ శుభలేఖా... చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా
చిరునవ్వే శుభలేఖ...  చదివావా శశిరేఖ 



చరణం 1 :


జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై ... నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో రస కవనాలతో...  తీర్చాలి నా మోజులే
రాజీ లేని అల్లరి రోజాపూల పల్లవి...  నీ పాట కావాలిలే
కథ రమణీయమై చిరస్మరణీయమై...
సాగాలి సంగీతమై...  అనురాగ శ్రీగంధమై 


చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా


తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక 



చరణం 2 :


రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై ... నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారమూ ... కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై... నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై..
జరగాలి సుముహుర్తమే... కళ్యాణ వైభోగమే 


సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
లాలాలా ఆహాహాహా..లాలాలా ఆహాహాహ 


సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6026

Thursday, March 24, 2016

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి




చిత్రం :  ముద్దమందారం (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  బాబన్ - సుబ్బారావు
నేపధ్య గానం : జిత్ మోహన్ మిత్ర  



పల్లవి : 


షోలాపూర్... చెప్పులు పోయాయి


అహ... హ.. హ...


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి 



చరణం 1 :


అరే రమణమూర్తి పెళ్ళి... ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళి మళ్ళి
అరే రమణమూర్తి పెళ్ళి... ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళి మళ్ళి


ఆ సందట్లో కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలా షోలా షోలా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి 


చరణం 2 :


ఇది షోలాపూర్ లెదరు.. అండ్ లైట్ ఏర్ ఫెదరు
యూజ్ యట్ ఎనీ వెదర్... దీన్ని తొడిగి చూడు బ్రదరు


ఇది షోలాపూర్ లెదరు.. అండ్ లైట్ ఏర్ ఫెదరు
యూజ్ యట్ ఎనీ వెదర్... దీన్ని తొడిగి చూడు బ్రదరు
అని మురిపించి మరిపించి కొనిపించాడు ఆ పొట్టోడు


షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి



చరణం 3 :



జత నెంబరేమో ఆరు... వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు... వెళ్ళాను పాత ఊరు


జత నెంబరేమో ఆరు... వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు... వెళ్ళాను పాత ఊరు
ఒకసారైన పాలిష్ కొట్టనిది కొట్టేసాడెవడో


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి


నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు.. పెళ్ళిలో పోయాయి
దొరికితే ఎవరైనా ఇవ్వండి..


అహహహా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6123

నీలాలు కారేనా కాలాలు మారేనా



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 




పల్లవి : 


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా



నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా 



చరణం 1 :


సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే

పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే


ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే

కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా



చరణం 2 :



ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో

కలికి వెన్నెళ్ళో  కలల కన్నుల్లో కల పారి పోవాలి లే


ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో

ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే..


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6001

జో... లాలి.. ఓ లాలి





చిత్రం :  ముద్దమందారం (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :
నేపధ్య గానం :  బాలు 




పల్లవి : 


జో..లాలి.. ఓ లాలి..
నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల
రెండు మూడు మాసాలాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నైనా మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల 


చరణం 1 :

జో... లాలి.. ఓ లాలి...
నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల
నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
ఏడో మాసములోన ఉయ్యాల
నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల 


చరణం 2 :


జో... లాలి.. ఓ లాలి...
నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల







ముద్దుకే ముద్దొచ్చే మందారం



చిత్రం :  ముద్దమందారం (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


మందారం... ముద్దుమందారం
మందారం... ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే ... మువ్వకే నవ్వొచ్చే


ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 1 :

అడుగులా అష్టపదులా...  నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా...  నడకలా జీవనదులా


పరువాల పరవళ్లు...  పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు


కన్నెపిల్లా కాదు...  కలల కాణాచి
కలువ కన్నులా...  కలల దోబూచి


ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 2 :


పలుకులా రా చిలకలా... అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రా చిలకలా... అలకలా ప్రేమ మొలకలా


మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు


మల్లెపువ్వా కాదు... మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి



ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6002

అందమా నీ పేరేమిటి అందమా




చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర   




పల్లవి :

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా... బాపు గీసిన చిత్రమా
తెలుపుమా..  తెలుపుమా...  తెలుపుమా



పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా... కృష్ణ సాగర కెరటమా
తెలుపుమా...  తెలుపుమా...  తెలుపుమా



చరణం 1 :


ఏ రవీంద్రుని భావమో...  గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున

సంగీతమా....  నీ నింగిలో...
విరిసిన స్వరములే ఏడుగా... వినబడు హరివిల్లెక్కడ

తెలుపుమా...  తెలుపుమా...  తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా..
తెలుపుమా... పరువమా నీ ఊరేమిటి పరువమా



చరణం 2 :


భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా


ఓ కావ్యమా...  నీ తోటలో నవరస పోషనే గాలిగా
నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా....  తెలుపుమా




అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా... బాపు గీసిన చిత్రమా
తెలుపుమా..  తెలుపుమా...  తెలుపుమా




అందెనా బృందావనీ



చిత్రం :  అరుణ కిరణం (1986)
సంగీతం :   చక్రవర్తి
గీతరచయిత :  అదృష్ట దీపక్
నేపథ్య గానం :  బాలు, జానకి



పల్లవి :

అందెనా బృందావనీ పొంగెనా మందాకిని
పాపల్లే పారాడనా నీ పాదాలు ముద్దాడనా 


మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ
అందెనా బృందావనీ... పొంగెనా మందాకిని



చరణం 1 :


ప్రభాతాల కాంతులే... శుభలేఖ రాయగా
వసంతాల వన్నెలే... పారాణి తీర్చగా


కిలకిల నవ్వే కిరణాలే... ఉరకలు వేసే హరిణాలై
ఊగాలి హృదయాలు... తలలూపాలి గగనాలు


మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ 


అందెనా బృందావనీ ... పొంగెనా మందాకిని


చరణం 2 :


ఎదిగి ఉన్న కోరికా...  మొదటి ముద్దు మీటగా
ఎదుగుతున్న తీపితో... పెదవి హద్దు దాటగా


తీరని తలపులు మల్లికలై... తీయగ కుదిరిన అల్లికలై
సాగాలి మన బ్రతుకు... కొనసాగాలి కడ వరకు


మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ 


అందెనా బృందావనీ...  పొంగెనా మందాకిని
పాపల్లే పారాడనా...  నీ పాదాలు ముద్దాడనా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13132

Wednesday, March 23, 2016

ఏం పిల్లది ఎంత మాటన్నది





చిత్రం :  అల్లరి ప్రియుడు  ( 1993 )
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి :


ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది


బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది 


ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది



చరణం 1 :


శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి ... సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి...  అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది


ఇనుకొని ఆరాటం ఇబ్బంది ... ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోన ఓ మంట పుడుతుంది...  పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది


చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది..
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది


ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది


చరణం 2 :


సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ ... పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి...  మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు


ఉత్సాహం ఆపేది కాదంట...  ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కథలోనే 'ఉ ' కొట్టే ఉద్యోగం నాదంట


వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మళ్ళీ కావాలన్నా మనసు ఉన్నది


అమ్మో.. ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది... కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది


ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13115

ఇంద్రధనసు ఇల్లాలై



చిత్రం :  ఇంద్రధనస్సు (1988)
సంగీతం :   రాజ్-కోటి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ.. నా లోకమైనదీ


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ


చరణం 1 :


ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవే
ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవై


ఎదలో నిండగా .. బ్రతుకే పండగా


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ



చరణం 2 :


పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను
పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను


తపసే నాదిగా .. వరమే నీవుగా


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13113

Tuesday, March 22, 2016

శ్రీ శారదాంబా నమోస్తుతే

చిత్రం :  శృతిలయలు (1987)

సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  జానకి



పల్లవి :


శ్రీ శారదాంబా నమోస్తుతే...
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...



చరణం 1 :


నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం...  గళపీఠమే రత్న సింహాసనం
సరిగమల స్వరసలిల సంప్రోక్షణం...


శ్రీ శారదాంబా నమోస్తుతే... 



చరణం 2 :


నా గానమే నీరాజనం... నా ప్రాణమే నివేదనం
నా గానమే నీరాజనం...  నా ప్రాణమే నివేదనం
శ్వాసకీవిలా స్వరనర్తనం... శ్వాసకీవిలా స్వరనర్తనం
సంగీత భారతికి సంకీర్తనం 


శ్రీ శారదాంబా నమోస్తుతే... 




వాగీశా వల్లభ.... శ్రీ శారదాంబా...
శ్రిత సరసిజాసన...  స్మిత మంగళానన
శ్రీ శారదాంబా...
సిద్ది ప్రదాయని...  బుద్ది ప్రసాదిని
గీర్వాణి...  వీణాపాణి ... శ్రీ శారదాంబా...
లలిత లయ జనిత .... మృదుల పద గమిత
లలిత లయ జనిత....  మృదుల పద గమిత
కావ్య గాన లోల... శంకర అచ్యుతాది .. సకల తిమిర సన్నుత


శ్రీ శారదాంబా నమోస్తుతే...సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...నమోస్తుతే... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13110

నిన్న నీవు నాకెంతో దూరం



చిత్రం: తలంబ్రాలు (1986)
సంగీతం: సత్యం
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల, బాలు 



పల్లవి :


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...  




చరణం 1 : 


నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ


నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ


ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... హొ  



చరణం 2 :



గోదారి కెరటంలోనా..  గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ


నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ


కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ


కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13104