చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపధ్య గానం : కె.బి.కె. మోహన్ రాజు
పల్లవి :
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం
చరణం 1 :
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
ఆ తాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం
చరణం 2 :
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం
కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
చరణం 3 :
తలచింది జరిగిందంటే... నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
తలచింది జరిగిందంటే... నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
మనము మనవాళ్ళనీ మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో తెంచుకుని పోతావు
కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
చరణం 4 :
కర్మను నమ్మిన వాళ్ళెవరు కలిమిని స్థిరమనుకోరు.. కళ్ళు మూసుకోరు
మనసు తెలిసినవాళ్ళెవరు మమత చంపుకోరు.. మనిషినొదులుకోరు
ఉన్నదాని విలువెరుగనివారు పోగొట్టుకుని విలపిస్తారు
కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
చరణం 5 :
మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
కావాలని నిప్పు తాకితే చెయ్యి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు
కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2007