చిత్రం : భలే రంగడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా... ఎన్నటికైనా...
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే
ఏహే... Don't Care Master
చరణం 1 :
కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి
కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి
పెంకిఘంటంలా నిలిచేవాణ్ణి... నిండుగుండెతో బతికేవాణ్ణి.
నిండుగుండెతో..బతికేవాణ్ణి..
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఏహే... Don't Care Master
చరణం 2 :
పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం
పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం
పైసా కోసం... మోసం చేస్తే..ఏయ్
పైసా కోసం మోసం చేస్తే ... పరువు తీసి పారేస్తాను..
పరువు తీసి పారేస్తాను
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఏహే... Don't Care Master
చరణం 3 :
మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా
మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా
చింతా చీకు లేకుండా... సంతోషంగా జీవిస్తా..
సంతోషంగా జీవిస్తా..
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1224