Monday, October 31, 2016

అందమంత మోసుకొచ్చా






చిత్రం : శక్తి (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 


లలల.... లా ల...ల... ల... లా
అందమంత మోసుకొచ్చా... అందగాడి కోసమొచ్చా
రారా రాకుమారా... నన్నే ఏలుకోరా..
వయ్యారీ బుల్లోడా...  అందాలే నీవయ్యా 

beauty queen.. లా.. beauty queen.. లా..
లలలలా... లలలలా


అందమంత మెచ్చుకొన్నా... చందమామలిచ్చుకొన్నా
రావే..రాణిబొమ్మా..నీదే రాచనిమ్మ..
వయ్యారీ బుల్లెమ్మా... అందాలే నావమ్మా..
lovely king... లా... lovely king..


లలలలా...  లలలలా 




చరణం 1 :


చిలకలకొలికి కులుకే సింగారం...
చిచ్చులు పెడుతూ రగిలే శృంగారం 


జిలిబిలి ముద్దులు విప్పిన సింధూరం
చెరిపెను ఇద్దరి వలపులకీ దూరం



చక్కదనాల రాణీ... చెక్కిలి చెక్కర కేళీ
చెక్కిన నాడే కానీ... చుక్కలు చూడని బోణీ


లలలలా... లలలలలా..


అందమంత మెచ్చుకొన్నా... చందమామ ఇచ్చుకొన్నా
రారా రాకుమారా... నన్నే ఏలుకోరా..
వయ్యారీ బుల్లెమ్మా... అందాలే నావమ్మా 

lovely king...... lovely king... లలలలా మ్మ్... .హూ..  



చరణం 2 :




ఉలిపిరి చీరకు ఊపిరి పైటంటా.. లలలలా
జారినపైటే... జావళిపాటంటా.. లలలలా 


చూసిన కన్నే రాయని కవితంటా... లలలలా
కమ్మని కవితకు కౌగిలి ఇల్లంటా... లలలలా 


మోవికి అందే మోవీ... మోహన పిల్లనగ్రోవీ..
హాయిగ ప్రాణాలూదే... అల్లరి పల్లవి రాణీ..
లలలలా..... హుహుహూ..


అందమంత మోసుకొచ్చా... అందగాడి కోసమొచ్చా
రావే రాణిబొమ్మా... నీదే రాచనిమ్మ
వయ్యారీ బుల్లోడా అందాలే..నీవయ్యా


beauty queen.... beauty queen.. 
లలలలా... లలలలా
lovely king... లా... lovely king..

లలలలా లలలలా... ఆహ..అహహహా...ఓహో..ఓహోహోహో... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3785

రథమొస్తున్నది రాణొస్తున్నది






చిత్రం :  మూడు పువ్వులు-ఆరుకాయలు (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల





పల్లవి  :



రథమొస్తున్నది రాణొస్తున్నది... తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్... ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 



రథమొస్తున్నది రాణొస్తున్నది... తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్... ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 


ఛల్నీ... ఛల్నీ 



చరణం 1 : 



నేన్ననది మాట... నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే... అది నవ్వుల మూట
నేన్ననది మాట... నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే... అది నవ్వుల మూట 



నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్
నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్


ఈ నేల ఆ నీరు నాదండోయ్
ఈ నేల ఆ నీరు నాదేనండోయ్ 


 

రథమొస్తున్నది రాణొస్తున్నది...  తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్... ఈ ఊరి రాదారి నాదేనండోయ్ 



ఛల్నీ... ఛల్నీ 



చరణం 2 :




నా చూపే వాడి... నా తీరే రౌడి
హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?
నా చూపే వాడి... నా తీరే రౌడి
హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?



నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్
నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్


ఉసి అయినా విసురైనా నాదండోయ్
ఉసి అయినా విసురైనా నాదేనండోయ్  




రథమొస్తున్నది రాణొస్తున్నది.. తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్... ఈ ఊరి రాదారి నాదేనండోయ్



ఛల్నీ... ఛల్నీ ... ఛల్నీ... ఛల్నీ 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3167

ఏదో రాగం చెలరేగు





చిత్రం :  కల్యాణ రాముడు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : జానకి





పల్లవి  :



ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


ఏదో రాగం... చెలరేగు ఈ సమయం
ఉరికే హృదయం... అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం


ఏదో రాగం... చెలరేగు ఈ సమయం
ఉరికే హృదయం... అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం






చరణం 1 :



మధురాశలే తలబోసేనే... చిరుతేనేలే కురిపించెనే
కనులు కనులు చేసి స్నేహం
కలలు తీరేనే... పులకరించెనే..
చిందెనే.... ఏ..
చిందెనే....  చిలికెనే మధువులు  ఆ పిలుపులో... అమ్మమ్మా... ఆ...



ఏదో రాగం... చెలరేగు ఈ సమయం
ఉరికే హృదయం... అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం



చరణం 2 :



నా కన్నె మనసే తొణికెను... నా చిలిపి తలపే కులికెను
ఊహలన్ని ఊసులాడే... ఉరకలేసేనే....
కొసరి పాడేనే... కలిసెనే..
కలిసెనే... కరిగెనే...
బంధమో... అనుబంధమో..అమ్మమ్మా..ఆ ఆ ఆ


ఏదో రాగం... 




చరణం 3 :


చెలి తలపులే కదలాడెనే... తొలి వలపులే చిగురించెనే
విరిసి వసంతం పూలవర్షం...  చిలకరించెనే.. చిందులేసేనే....
కరగనీ....
కరగనీ చెరగనీ..భోగమో ఇది యోగమో... అమ్మమ్మామ్మా..ఆ


ఏదో రాగం... చెలరేగు ఈ సమయం

ఉరికే హృదయం... అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం

అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం

అమ్మమ్మా...  ఇది సుఖమే...  సుఖం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5672

Sunday, October 30, 2016

మేలుకోరాదా..కృష్ణా




చిత్రం : కృష్ణావతారం (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :



మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా


నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా


మేలుకోరాదా... 


చరణం 1 :



ఆ...  ఆ... ఆ...  ఆ...  ఆ...  ఆ
జేబుదొంగలు లేచారు...  దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
జేబుదొంగలు లేచారు...  దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
బడా చోరులూ.. ఊ... ఊ... లేచారూ



ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎన్నికళ్ళతో..ఓ... ఓ... చూస్తుందో


మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా... 


చరణం 2 :



మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
ఖబడ్దార్... 


మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
మేలుకునే ఉన్నాం ... 




ఉన్నోడికేమో తిన్నదరగదూ... లేనోడికా తిండే దొరకదు
ధర్మానికేమొ మొద్దు నిద్దరా... ఆ... దేవుడికా తీరికేదిరా


అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం
అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం
అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3842


Thursday, October 27, 2016

అమ్మాడి పెళ్ళీడొచ్చి






చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)
సంగీతం  :  సత్యం
గీతరచయిత  :
నేపధ్య గానం  :  బాలు, సుశీల





పల్లవి :


అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా



అమ్మాడి పెళ్ళీడొచ్చి తుళ్ళీ తుళ్ళీ పడుతోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓలమ్మో.. అహా అహా.. ఏదమ్మో... అహ అహా
ఓలమ్మో.. అహా అహా.. ఏదమ్మో... అహ అహా



అల్లాడే పిల్లాదొచ్చి పెళ్ళి పెళ్ళీ అంటోంది
కిల్లాడి కన్నుగొట్టు మళ్ళీ మళ్ళీ అంటోంది
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా




చరణం 1 :



ఏపాకు తియ్యగుంది.. ఎన్నెల్లో ఎర్రెక్కింది.. ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
నీ సూపు సుర్రుమంది.. నా సోకు సూరెక్కింది.. ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో


ఏపాకు తియ్యగుంది.. ఎన్నెల్లో ఎర్రెక్కింది.. ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో
నీ సూపు సుర్రుమంది.. నా సోకు సూరెక్కింది.. ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో


ఉండుండి ఉలుకొచ్చింది.. ఉలుకొచ్చి తళుకిచ్చింది
పొద్దేడా వాలిపోద్దు ముద్దాడి ఎళ్లమంది


అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా



అల్లాడే పిల్లాదొచ్చి పెళ్ళి పెళ్ళీ అంటోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా



చరణం 2 :




పైటేస్తే జోరుగుంది... పరువాల చిందేసింది.. ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
వాటేస్తే వాడిగుంది... వయసంతా చిగురేసింది... ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో


పైటేస్తే జోరుగుంది... పరువాల చిందేసింది.. ఏంది పిల్లో.. ఏవైంది పిల్లో
వాటేస్తే వాడిగుంది... వయసంతా చిగురేసింది... ఏందిరయ్యో.. ఏమయిందిరయ్యో


హేయ్.. ఎండల్లో సినుకొచ్చింది... గుండెల్లో చిటికెసింది
లగ్గాలు కుదిరే దాకా పగ్గాలు వెయ్యమంది


అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా


అహా..అహా... అహా..అహా
అహా..అహా... అహా..అహా


అమ్మాడి పెళ్ళీడొచ్చి తుళ్ళీ తుళ్ళీ పడుతోంది
అమ్మమ్మో నా ఒళ్ళంతా గిల్లీ గిల్లీ పెడుతోంది
ఓలమ్మో.. అహా అహా.. ఏదమ్మో... అహ అహా
ఓలమ్మో.. అహా అహా.. ఏదమ్మో... అహ అహా




అల్లాడే పిల్లాదొచ్చి పెళ్ళి పెళ్ళీ అంటోంది
కిల్లాడి కన్నుగొట్టు మళ్ళీ మళ్ళీ అంటోంది
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా
ఓరయ్యో.. అహా అహా.. ఏదయ్యో.. అహా అహా








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3764

చెట్టెండిపోయాక పిట్టెగిరి పోయాక




చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)
సంగీతం  :  సత్యం
గీతరచయిత  :
నేపధ్య గానం  :  బాలు, సుశీల




పల్లవి :


చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. చేసేది ఏముందిరా
అహా..హా.. హా..
చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. చేసేది ఏముందిరా
కన్ను వేసి... కాపు చూసి... పాదు చేసి పండించుకోరా
హోయ్..హోయ్...హోయ్..



చెట్టిండిపోయుందా... పిట్టెగిరిపోతుందా.. చెయ్యేస్తే చిగురించదా
అహా..
చెట్టిండిపోయుందా... పిట్టెగిరిపోతుందా.. చెయ్యేస్తే చిగురించదా
కన్ను వేసి... కాపు చూసి... పాదు చేసి.. పండించుకోనా





చరణం 1 :


పూతా.. పులకరింతా.. పుచ్చుకుంటే వద్దంటా
రెమ్మ పడుచుకొమ్మా... పచ్చగుంటే కాదంటానా

పూతా.. పులకరింతా.. పుచ్చుకుంటే వద్దంటా
రెమ్మ పడుచుకొమ్మా... పచ్చగుంటే కాదంటానా


రెపరెపమను చిగురాకుల తపనలు విన్నావా
గుబగుబమను గుండెల్లో గుబులును కన్నావా
కొండయ్యో..హోయ్... గుండయ్యో.. హోయ్
కొమ్మెండిపోతాదయ్యో... హోయ్


చెట్టిండిపోయుందా... పిట్టెగిరి పోతుందా.. చెయ్యేస్తే చిగురించదా
అహా.. 

చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. చేసేది ఏముందిరా



చరణం 2 :


గూడు.. గువ్వ తోడు... వెచ్చగుంటే... వద్దంటానా
ఈడు.. తగిన జోడు... మెచ్చుకుంటే కాదంటానా


గూడు.. గువ్వ తోడు... వెచ్చగుంటే... వద్దంటానా
ఈడు.. తగిన జోడు... మెచ్చుకుంటే కాదంటానా

పెరపెరమను నా పెదవుల మనసును చూస్తావా
విరవిరమను విరజాజుల మనసును కన్నావా
కొండమ్మో..హహా.. గుండమ్మో.. హొయ్ హొయ్
నా కొంపా ముంచావమ్మో... హోయ్


చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. చేసేది ఏముందిరా
కన్ను వేసి... కాపు చూసి... పాదు చేసి.. పండించుకోనా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3763

అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ




చిత్రం : చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి : 


అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ
నా సింతమాను సిగురా... నా గున్నమావిడి గుబురా
నా ఏడి ఉలవ చారా... నా ఇప్పపూల సారా 


అరిసెల పాకం కన్నా అందమైన దానా
అరిసెల పాకం కన్నా అందమైన దానా
నువ్వు అలకేసిపోతుంటే నేనాగుతానా
నువ్వు అలకేసిపోతుంటే నేనాగుతానా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా


అబ్బీ.. ఓరబ్బీ... సురుకైన సోకులబ్బీ
నా సింగరాయ కొండ... నా సికాకోలు దండ
నా చంద్రహారం గొలుసా... నా బొమ్మిడాయల పులుసా


బుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...
బుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హోయ్




చరణం 1 :


తాళపాకలో నిన్ను కలిసినప్పుడు...
రంగుగళ్ళ కోకలో నువ్వు మెరిసినప్పుడు
నిన్ను సూశానో లేదో... చెయ్యి వేశానో లేదో
నిన్ను సూశానో లేదో... చెయ్యి వేశానో లేదో
నువ్వు నిప్పుదగరి లక్కలాగ కరగలేదా
కరిగి కరిగి ఒక్క మాటు ఒరగలేదా



ఎల్లమ్మ జాతరకు ఎళ్ళినప్పుడు..
ఎంట ఎంటబడి నా చెయ్యి గిల్లినప్పుడు
కాస్త కసిరానో లేదో... కొంగు ఇసిరానో లేదో
కాస్త కసిరానో లేదో... కొంగు ఇసిరానో లేదో
నువ్వు కాలు కాలిన పిల్లిలాగ తిరగలేదా
తిరిగి తిరిగి అరుగు మీద ఒరగలేదా




అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ
నా సింతమాను సిగురా... నా గున్నమావిడి గుబురా
నా ఏడి ఉలవ చారా... నా ఇప్పపూల సారా 





గుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా





చరణం 2 :




సందెకాడ నేను తానం ఆడినప్పుడు...
తడిక చాటు నుంచి నువ్వు పొంచి చూసినప్పుడు
అయ్య లేశాడో లేడో... కర్ర తీశాడో లేదో
నా కాళ్ళా వేళ్ళా పడి మొక్కలేదా
కట్టుకుంటానని ఒట్టు పెట్టలేదా



నీ సికిలి చూపు నాపైన విసిరినప్పుడు

నీ ముఖమంతా సిరునవ్వే ముసిరినప్పుడు

ఏవయ్యిందో ఏమో... ఏమౌతుందో ఏమో

ఆ నాటి నుంచి నా మనసే నిలవకున్నదే

నాటు మందేసినా నీ ఊసే ఒదలకున్నదే



గుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హోయ్  


అరిసెల పాకం కన్నా అందమైన దానా
నువ్వు అలకేసి పోతుంటే నేనాగుతానా
నువ్వు అలకేసి పోతుంటే నేనాగుతానా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3760

Wednesday, October 26, 2016

వాన వెలిసిన వేళ





చిత్రం : ఘరానా దొంగ (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :



వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 




వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 



చరణం 1 :


చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో

చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో

ఉరిమి పిలిచే నీ ఒడి కోసం... ఉలికిపడి నే చూస్తుంటే



కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
ఓ..కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
నలిగిపోయిన ఆకాశం... పగలు వెన్నెల కాస్తుంటే



చూపూ చూపూ మాటాడాలా... మాటామాటా మానెయ్యాలా
వలపు వలపు వాటెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 



వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..  



చరణం 2 :



చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో

చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో

ముద్దులడిగే ముచ్చట కోసం... పొద్దు గడవక చస్తుంటే


చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
ఓ..ఓ.. చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
హద్దు చెరిపే ఇద్దరి కోసం... మబ్బులెండను మూస్తుంటే



సిగ్గుల మొగ్గ తుంచెయ్యాలా... వెన్నెల పక్క పరిచెయ్యాలా
వేగుల చుక్క దాచెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 


వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3756

Monday, October 24, 2016

మోగాలి మోతగా డోలు సన్నాయి







చిత్రం :  భలే కృష్ణుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :


స్వస్తీశ్రీ చాంద్రమాన మన్మధ సంవత్సరాన...
మాఘశుద్ధ పంచమి ఆదివారం ఉదయం...
భరణి నక్షత్రయుక్త మిథున లగ్నంలో...


మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి


హేయ్... మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
మన ముద్దులే మద్దెళ్లుగా ఈ 
జోడూ సన్నాయి



ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హేయ్.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి




చరణం 1 :




చూపుల్లో చదివాను శుభలేఖలూ...  చుక్కల్లో గడిపాను శివరాత్రులు
మాటల్లో విన్నాను నీ మనసులు... మనసుల్లో గడిపాను తొలిరాత్రులు



అందమంతా పొందు లేక అలసిసొలసి పోతుంటే
అందినంత పొందలేక ఎదలో రొదలే పుడుతుంటే



ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హహ.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి


మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
మన ముద్దులే మద్దెళ్లుగా ఈ  జోడూ సన్నాయి



ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హేయ్.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి




చరణం 2 :




మొదలెన్నో చూడాలా పొద చాటునా.. పొగరాని సెగలున్న అగచాటునా
దొరగార్ని చూడాలా తెర చాటునా.. తెర బాకు చొరవున్న మొలవాటునా


తలలు వంచి గిలిమి పెంచే...  కలికి సొగసే చూడాలా
కదమనంటే గొడవ పెంచే చేతి ఉడుకే చూడాలా



ఎప్పుడమ్మాయి.. పెళ్ళెప్పుడమ్మాయి.. హా
అప్పుడబ్బాయి.. అయినప్పుడబ్బాయి


అరెరే... మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి


ఎప్పుడమ్మాయి.. పెళ్ళెప్పుడమ్మాయి..
హా.. అప్పుడబ్బాయి.. అయినప్పుడబ్బాయి







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3754

ఇటిక మీద ఇటికేస్తే







చిత్రం :  భలే కృష్ణుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :


అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది



చరణం 1 :



నిన్ను చూస్తే కన్నుకేమో నిదుర పట్టదు..
నీకు ముద్దులిస్తే పాడు మూతి ముద్ద ముట్టదు...
నువ్వు చూస్తే పూట పూటా పులకరిస్తది..
నువ్వు నవ్వగానే తోటకొక్క పువ్వు  పూస్తది


రావిపండు కొండ మీద రామచిలుక నేనంట
బావి గట్టు గిలక మీద తోటుంది రమ్మంటా


గిలకేమో తిరగాలా... చిలకేమో ఎగరాలా
గిలకేమో తిరగాలా... చిలకేమో ఎగరాలా
నువ్వెంట తగలాలా... పదిమందీ చూడాలా 



అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బ.. అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అ... అ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా



ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది




చరణం 2 :


పట్టపగలు పిట్ట గుబులు పుట్టుకొస్తది
అర్ధరాత్రి పైర గాలి ప్రాణమౌతది
నువ్వు రాకా పొద్దు పోక ఏడిపిస్తది
నువ్వు తాక గానే సోకు నాకు ఎక్కువౌతది


తాటి రేవు కుర్రదాన ఆకు చిలకలిమ్మంటా
సందె కాడ నీడలోన చాటుంది రమ్మంటా


చెయ్యి బుగ్గ వెయ్యాలా... చెట్టు మొగ్గలెయ్యాల
చెయ్యి బుగ్గ వెయ్యాలా... చెట్టు మొగ్గలెయ్యాల
అవి పూలు పుయ్యాలా... నువ్వు కోసిపెట్టాలా



అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా


ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది


అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3969

Sunday, October 23, 2016

విచ్చుకున్నా గుచ్చుకున్నా




చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి : 



విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
నువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే



విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
నువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే



చరణం 1 :



తలుపు గడియ అన్నది తెరుచుకోనని
కౌగిలింత అన్నది కమ్ముకోమని
తలుపు గడియ అన్నది తెరుచుకోనని
కౌగిలింత అన్నది కమ్ముకోమని 


కొత్త చీర నలగాలని కోరుకున్నది
ఆ.. కొత్త చీర నలగాలని కోరుకున్నది
విరిపానుపు చెరగకుంటే.. పరువే కాదన్నది



విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
నువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే




చరణం 2 :



వయసు చూస్తే ఆగనన్నది.. మనసు చూస్తే ఆకలన్నది
పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది
వయసు చూస్తే ఆగనన్నది.. హాయ్..  మనసు చూస్తే ఆకలన్నది
పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది


అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు
అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు
ముద్దివ్వను పొమ్మనకు...  అద్దెకు బకాయి పడకు



అద్దెకొచ్చి ముద్దులంటే... అర్ధరాత్రి అల్లరే..అహ..హ..
హద్దు దాటి హద్దుకుంటే ఒళ్ళు కాస్త పచ్చడే.. పచ్చడే



విచ్చుకున్నా గుచ్చుకున్నా... ఆ..   మొగలిపువ్వు అందమే... అహా..
నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే
విచ్చుకున్నా గుచ్చుకున్నా...  మొగలిపువ్వు అందమే
అహహహహా... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3663

Friday, October 21, 2016

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం






చిత్రం : కురుక్షేత్రం (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం :  బాలు




పల్లవి :


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...  

కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం...


ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం
రథగజహయపదాతిదళసరభసగమనం.. ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
రథగజహయపదాతిదళసరభసగమనం.. ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం




చరణం 1 :


కపిధ్వజాంచిత సితాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు
కపిధ్వజాంచిత సితాశ్వరంజిత  రథస్థితులు కృష్ణార్జునులు
విజయుడు రథీ..  గోవిందుడు సారథీ
విజయుడు రథీ..  గోవిందుడు సారథీ
ఉభయులు నరనారాయణులు....  ఉభయులు నరనారాయణులూ


గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళపతాక  విరాజితుడు
రంగత్తుంగ మదేభనిభాంగుడు ...రారాజు ధుర్యోధనుడు 


మానవ జీవితమే ఒక మహాభారతం
ఆ..ఆ.... మానవ జీవితమే ఒక మహాభారతం
అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం
నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే.. ఆ...
ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే... ధర్మయుద్ధమే... ధర్మయుద్ధమే



ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం
రథగజహయపదాతిదళసరభసగమనం ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం...  కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం




చరణం 2 :



స్థితప్రజ్ఞుడతి నిర్మలచరితుడు ధర్మాయుధుడు...  యుధిష్ఠిరుడు

రవితేజస్సముదీర్ణుడు కర్ణుడు మైత్రీబంధ వినిష్ఠితుడు
రిపుమర్ధన దోర్దాముడు భీముడు శపథనిబద్ధ గాధాయుధుడు
ధనురాగమ నిష్ణాతుడు ద్రోణుడు కదనవ్యూహ విశారదుడు



బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు
మోహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిద్యోతులు
మోహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు


అనివార్యం యుద్ధం.. అనివార్యం యుద్ధం
శరసంధానమే ధర్మం...  శరసంధానమే ధర్మం
ఆధర్మ పరిక్షాంగణమే కురుక్షేత్రం... కురుక్షేత్రం... కురుక్షేత్రం



చరణం 3 :



ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు భయదాస్త్రమ్ముల పాండవ సేనల చండాడే
ధర్మజుడు అసత్యమాడకున్న గురుడస్తమించడని హరిపలికే
అదే సమయమున భీముడు చంపెను అశ్వత్థామాహ్వయ కరినీ..
' అశ్వత్థామః హతః  కుంజరః ' అనెను విధిలేక ధర్మాత్మజుడు


తనయుడే  మరణించెనను శోకభారాన గురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే
ధృష్టద్యుమ్నుని మనోభీష్టంబు నెరవేర గురునిపై లంఘించి శిరము ఖండించే
ద్రోణాంతమును గాంచి కౌంతేయప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే
కురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము కూలెననికురురాజు కుమిలి దురపిల్లె
ద్రోణ దుర్మరణానికశ్వత్థామ రెండవరుద్రుడై
అగ్నిముఖ నారాయణాస్త్రము నంపె పాండవసేనపై 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3150

Wednesday, October 19, 2016

ఆరు మాసాలాగు




చిత్రం :  పసి హృదయాలు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఆరు మాసాలాగు..  పుడతాడు మనకో బాబు
ఆరు మాసాలాగు..  పుడతాడు మనకో బాబు
కనువిందుగా...  ఇక పండుగ


ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
మగవారే.. మహా తొందరా 


ఓ...ఓ....ఓ...  ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు



చరణం 1 :


అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా
అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా



నేడు దొరగారూ వెంటపడతారూ
నేడు దొరగారూ వెంటపడతారూ
రేపు మీ బాబే  లోకమంటారూ
పాపాయికే గిలిగింతలూ.. లాలింపులు



ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు



చరణం 2 :


నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ


నిండినవి నెలలూ... పండునిక  కలలూ
నిండినవి నెలలూ... పండునిక  కలలూ
నేటి తొలి చూలు... రేపు మురిపాలు
నా ఆశలూ.. నా బాసలూ... తీరేనులే


ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
కనువిందుగా...  ఇక పండుగ
ఆగనని అన్నానా..  ఆగడం చేశానా
మహరాణికే.. ఈ తొందరా

ఓ...ఓ....ఓ...  ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3575

అల్లరి చూపులవాడే








చిత్రం :  శ్రీవారు మావారు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  జానకి



పల్లవి :



హొయ్.. అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
హూయ్..హూయ్..   అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని.. వాడు రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే




అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే..ఏడే ఏడే



చరణం 1 :


అందాలన్నీ దోసిట దూసేనన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే
అందాలన్నీ దోసిట దూసేనన్నాడే
ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే
కలగా నన్నే కవ్వించాడే.. అలలా నాలో పులకించాడే
అమ్మో..ఏ మందునే.. సందిటనే చేరగనే సగమైనానే  



ఓ..అల్లరి చూపులవాడే...  అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే చిక్కుల్లో పడ్డానే
అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే.. ఏడే ఏడే



చరణం 2 :


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ లలలలలా
మ్మ్ మ్మ్ మ్మ్ హా..మ్మ్ మ్మ్ మ్మ్ హా..లలలలలాలలా..హోయ్
చెయీ చెయీ కలపాలని.. అన్నాడే
రేయీ రేయీ కలవాలని.. అన్నాడే
చెయీ చెయీ కలపాలని.. అన్నాడే
రేయీ రేయీ కలవాలని.. అన్నాడే


ఎదలో వాడే.. ఎదుగుతున్నాడే
నిదురే కరువై.. వేగుతున్నానే
అమ్మో.. ఏ మందునే...  ఓ యమ్మో యీ తాపం ఓపగలేనే

         

అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. వాడే వాడే
అందాల నా చందూరూడే.. ఏడే ఏడే
ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే
చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే
చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3100

ఈ వేళలో నా మనసు నీదే






చిత్రం :  శ్రీవారు మావారు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, రామకృష్ణ    




పల్లవి :



ఈ వేళలో...  నా మనసు నీదే.. వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


ఈ వేళలో...  నా మనసు నీదే.. వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే



చరణం 1 :


నేనుంటినీ నీ వెంటనే.. హైహై..
నీవుంటివీ నా కంటనే..మ్మ్ హు
నా జీవితం నీ కోసమే.. ఓహో..
నీ యవ్వనం...  నా కోసమే
నీ యవ్వనం.. నా కోసమే... హాయ్..


ఈ వేళలో...  నా మనసు నీదే.. వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే



చరణం 2 :


ఆగేది కాదోయి కాలం.. లాగాలి లోలోని సారం
ఆగేది కాదోయి కాలం.. లాగాలి లోలోని సారం
నేడుంది నీ కేల రేపు.. జీవించు ఈ కోంత సేపు
అహా..అహా..అహా..హా..హా..హా..ఆ      



ఈ వేళలో...  నా మనసు నీదే.. వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే 




చరణం 3 :



చేరాలి కారామసాలా.. ఊగాలి వేగాల ఝాలా
చేరాలి కారామసాలా.. ఊగాలి వేగాల ఝాలా
సాగాలి గానాబజానా.. తానాన తందాన తానా
లలాల..లలాల.. లలలలాలలా   


ఈ వేళలో...  నా మనసు నీదే.. వయసు నీదే
ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3611

Thursday, October 13, 2016

సెలవు మీద రావయ్యా






చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల  



పల్లవి : 



సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుదాము సిపాయి బావా


దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా.. 


సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా




చరణం 1 :



కోర మీసం తిప్పుకుంటూ నువ్వొస్తావూ..
కొప్పు నిండా పూలెట్టుకొని నేనుంటానూ
కోర మీసం తిప్పుకుంటూ నువ్వొస్తావూ..
కొప్పు నిండా పూలెట్టుకొని నేనుంటానూ
చెయ్యి చెయ్యి కలుపుకొని.. చెట్టాపట్టాలేసుకొని..
సీతాకోక చిలుకల్లాగా ఎగిరిపోదాము...


సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుదాము సిపాయి బావా


దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా.. 


చరణం 2 :



ముద్దుముద్దు సరసానికి పోట్లాడుకుంద్దాము...
మురిపాల గుసగుసల మాట్లాడుకుంద్దాము
ముద్దుముద్దు సరసానికి పోట్లాడుకుంద్దాము...
మురిపాల గుసగుసల మాట్లాడుకుంద్దాము


మాపటేల ఏట్లోనా.. హా.. మాపటేల ఏట్లోనా
మసకమసక చీకట్లో..
మల్లెపూల తెప్ప మీద మనసు తీర్చుకుందాము
బావా.. బావా.. 


సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుదాము సిపాయి బావా


దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా.. 


సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుదాము సిపాయి బావా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3084

ఏమిటోననుకుంటి గోంగూరకి

చిత్రం : ఇంటింటి కథ (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి    



పల్లవి : 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 


సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి... వాడు సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి
సెప్పుకుంటే... అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 





చరణం 1 :


సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...
పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను
సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...
పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను


ఒంటిగానిగా చూసి ఎంట తగులుకున్నాడే..
చేను చుట్టు తిప్పాడే... చెయ్యి పైన ఏశాడే
చెయ్యి పైన ఏశాడే... ఏశాడే...
అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి...
సెప్పుకుంటే... అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 




చరణం 2 :



కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే
మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు
కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే
మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు


మాయలెన్నో చేశాడే... మనసు విరగదీశాడే
మోజు తీర్చమన్నాడే... ముద్దులీయమన్నాడే
ముద్దులీయమన్నాడే... ఇయ్యమన్నాడే...
అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
సిలిపి దొంగ సచ్చినాడే గోంగూరకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 








Thursday, October 6, 2016

జీవితం ఏమిటి





చిత్రం :  దేవదాసు (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు



పల్లవి : 



జీవితం... ఏమిటి?
వెలుతురూ... చీకటి..  అంతే
జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే...  అందులోనే సుఖము ఉన్నది
అవును.. జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి 



చరణం 1 :




మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది
మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది 



లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది
ఈ చేదులోనే ఉన్నది... హా... హా... హా... 


జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి



చరణం 2 :




రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే
రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే 


మూగ హృదయం... గాయమైనది
ఆ గాయమే ఒక గేయమైనది...
ఆ గాయమే ఒక గేయమైనది...  



జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది
 జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి
వెలుతురూ....  చీకటి
వెలుతురూ....  చీకటి






ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో




చిత్రం : అత్తలు-కోడళ్లు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపధ్య గానం : సుశీల



పల్లవి :


ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో




చరణం 1 :



మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిశాయి
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిశాయి


కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి
ఆ….. ఆ….. ఆ….. ఆ….. ఆ…..
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేశాయి



ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో




చరణం 2 :



మోహనాలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
మోహనాలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది


శృతి కలిపి జత కలిసి...
సొక్కులెరిగిన వాడు తోడైన నాడే...  నే తోడు పాడేది 



ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో



చరణం 3  :



ఇన్ని రాగాలు ఈ ఎదలోన దాచినది ఏ మధురమూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ ఎదలోన దాచినది ఏ మధురమూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై ...
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన 




ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3061

Wednesday, October 5, 2016

గువ్వలా ఎగిరిపోవాలి




చిత్రం :  అమ్మకోసం (1970)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి :



ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓహొ..హో..
హేహేయ్...
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..



చరణం 1 :



ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో...  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో...  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో 


ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
చల్లని ఆ చేయి కావాలి....  ఆమె చెరణాలపై వాలిపోవాలి



గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ




చరణం 2 :



జగమంత ఒక వింత చదరంగము...  పాడు విధియేమో కనరాని సుడిగుండము
జగమంత ఒక వింత చదరంగము... పాడు విధియేమో కనరాని సుడిగుండము 

ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ
ఆ లోతులు చూసీ రీతులు తెలిసి...
అలలాగా చెలరేగి పోవాలి... నేననుకున్న గమ్యం చేరాలీ



గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ








Monday, October 3, 2016

ఎన్నాళ్ళో వేచిన ఉదయం





చిత్రం : మంచి మిత్రులు (1969)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  బాలు, ఘంటసాల





పల్లవి :

ఎన్నాళ్ళో వేచిన ఉదయం...  ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం...  ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
  



చరణం 1 :




మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
  




చరణం 2 :



నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే



ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
  




ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి 








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2001

Sunday, October 2, 2016

శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా







చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దేవులపల్లి
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల




పల్లవి :



శ్రీశైలం మల్లన్న  శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా..
శ్రీశైలం మల్లన్న  శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా..


తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా


ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ... ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న  శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా..




చరణం 1 :




కదిలొచ్చీ కలిసొచ్చీ తలుపులు తీసేరో... కలవారి కోడళ్ళు..
నడుమొంచి చెమటోర్చి... నాగళ్ళు పట్టేరు
నా జూకు దొరగారు... నాజూకు దొరగారు
అంటకుండా నలిగేనా ధాన్యాలు... వంచకుండా వంగేనా ఆ వొళ్ళూ



ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ... ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న  శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా..



చరణం 2 :



ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ...  అన్నదమ్ములం
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము...  అక్కాచెల్లెళ్ళం
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ...  అన్నదమ్ములం
మేమూ అన్నదమ్ములం....
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము...  అక్కాచెల్లెళ్ళం
మేము అక్కాచెల్లెళ్ళం....



గాజుల చేతుల్లో రాజనాలపంట
గాజుల చేతుల్లో రాజనాలపంట
కండరాలు కరిగిస్తే కరువే రాదంటా.. 



ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ... ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న  శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా..



తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఏండా వెన్నెలలైనా

ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ... ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3526


పాతాళ గంగమ్మా రారారా







చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల





పల్లవి :

గంగమ్మా రా... గంగమ్మా రా... గంగమ్మా రా
పాతాళ గంగమ్మా రారారా...  ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ...  పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ 


పాతాళ గంగమ్మా రారారా....  ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ....  పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ
పాతాళ గంగమ్మా రారారా...



చరణం 1 :



వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా
వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా


సోలిన  ఈ చేనికీ....  సొమ్మసిల్లిన భూమికీ
సోలిన  ఈ చేనికీ....  సొమ్మసిల్లిన భూమికీ
గోదారి గంగమ్మా సేద తీర్చావమ్మా


పాతాళ గంగమ్మ రా రా రా...  ఉరుకురికీ ఉరుకురికీ రారారా
పాతాళ గంగమ్మ రా రా రా  




చరణం 2 :



శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో
శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో


అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
తొడగవమ్మ ఈ నేలకు సస్యశ్యామల వేసం 



పాతాళ గంగమ్మ రారారా..








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3527

Saturday, October 1, 2016

కృష్ణమ్మ పెన్నమ్మ





చిత్రం : వజ్రాయుధం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  




పల్లవి :


కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు పెదవుల్ని కలిపెయ్యనా
గోదారి కావేరి ముద్దాడుకున్నట్టు కొంగుల్ని ముడివెయ్యనా
అలలై చెలించనా... కళలే వరించనా
నీలో పొంగేటి అందాల సందిళ్ళలో.. ఓ.. ఓ..



గంగమ్మ యమునమ్మ కలబోసుకున్నట్టు కౌగిళ్లు తడిపెయ్యనా
తుంగమ్మ భద్రమ్మ  వడి చేరుకున్నట్టు ఒళ్ళంతా తడిమెయ్యనా
నదినై చెలించనా... మదిలో వసించనా
పాలుతేనళ్ల పరువాల పందిళ్లలో.. ఓ.. ఓ... 




చరణం 1 :



తళుకు బెళుకులొలుకు కలికిచిలుక నడకలో
కడవకైన ఎడములేని తొడిమ నడుములో
వయసు అలా.. సొగసు కళ రేగుతున్నది
మనసుపడి మరుని ఒడి చేరుతున్నది


వలపు తీరా వంశధారా పిలుపు వినిపించే నా గుండెలో
వాగు వంకా సాగిరాగా జరిగే ఈ సంబరం


కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు పెదవుల్ని కలిపెయ్యనా
తుంగమ్మ భద్రమ్మ  వడి చేరుకున్నట్టు ఒళ్ళంతా తడిమెయ్యనా




చరణం 2 :


అలలు తగిలి శిలలు పలుకు శిల్పవీణలో
నదుల ఎదను నటణమాడు చిలిపిమువ్వలో
కౌగిలితో స్వాగతమే పలుకుతున్నది
కాముడితో కాపురమే అడుగుతున్నది


కిన్నెరసాని కిలకిలలన్నీ సిగను చేరాయి సిరిమల్లెలై
కడలినదులు కలిసే దాకా సాగే ఈ సంగమం 


గంగమ్మ యమునమ్మ కలబోసుకున్నట్టు కౌగిళ్లు తడిపెయ్యనా
గోదారి కావేరి ముద్దాడుకున్నట్టు కొంగుల్ని ముడివెయ్యనా


నదినై చెలించనా... మదిలో వసించనా
నీలో పొంగేటి అందాల సందిళ్ళలో.. ఓ.. ఓ.. 






చలికొండలో.. చెలి గుండెలో






చిత్రం : లంకెబిందెలు (1983)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...
నా అందచందాల చలి తీరనీ ప్రణయ గీతాలలో  


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో... 




చరణం 1 :



తొలిసారిగా తెలిసిందిలే వయసు వయ్యారమే
వేడిపుట్టిందో.. నీ నాడి ఏమందో..
పూతే మునిమాపై   చలి సరిగమ పలికిందో



తొలిరేయిలో తెలిసిందిలే మనువులో అందమే
ఈడు వచ్చింది... నీ తోడు నచ్చింది
పూలే విరబోసే తొలి ఘుమఘుమ తగిలింది
పగలు చల్లారిపోవాలని...


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...




చరణం 2 :



పొగమంచులా చెలి చీరలో... సొగసు వణికిందిలే
పొద్దు వాలింది.. నీ పొందు కోరింది..
రేయే ఒక హాయై నీ బిగువులు అడిగింది



పెదవంచులా చిరుముద్దులో వలపు చిలికిందిలే
కొత్తపొంగుళ్లో నీ కొంగు జారింది
రేయే ఒడిలోనే నీ అలకలు తెలిసింది
రోజులే రాత్రులవ్వాయని...



హోయ్... చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


లలలా... లలలా... లలలా... లలలా...
లలలాలలలా... లలలాలలలా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3781



కోకంతా గొడవాయే









చిత్రం : ప్రజారాజ్యం (1983)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 



అమ్మాయీ... అమ్మాయీ
అమ్మాయీ... అమ్మాయీ


కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే.. ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  ఈడొచ్చెరో పిల్లడూ 



కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే.. ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...




చరణం 1 : 




కులుకమ్మా నడుమంతా గుపెట్లోనే దాచా
గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా


కులుకమ్మా నడుమంతా గుపెట్లోనే దాచా
గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా


అందంలో సంగీతం... సందిట్లో సావాసం
అహా.. అహా... అహా.. 


కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే.. ఏమొచ్చెనే అమ్మడూ..హహా..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  ఈడొచ్చెరో పిల్లడూ
హహా... హహా... హహా...



చరణం 2 :



కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా


కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా


ఒళ్ళంతా వయ్యారం... వందిళ్ళా సంసారం
అహా.. ఒహో.. అహా


కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే.. ఏమొచ్చెనే అమ్మడూ..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా... ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...




చరణం 3 :



చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు  



చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు


నీ ముద్దే మందారం... ముదిరిందీ యవ్వారం
అహా..ఒహో.. అహా...



కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే.. ఏమొచ్చెనే అమ్మడూ..హహా..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3783

చెయ్యి పడ్డది చెంప పైన






చిత్రం : గురు శిష్యులు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :  


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా



చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా





చరణం 1 :


పాలుగారే చెంప పైనా కెంపురంగులూ అందమైనా
పాలుగారే చెంప పైనా కెంపురంగులూ అందమైనా
ముద్దు పెట్టే తావులోనా దెబ్బపడ్డది న్యాయమేనా
ముద్దు పెట్టే తావులోనా దెబ్బపడ్డది న్యాయమేనా



తప్పు చేసే చేతికేమిటి నువ్వు వేసే దండనా
తప్పు చేసే చేతికేమిటి నువ్వు వేసే దండనా
ఊపిరాడని కౌగిలింతతో సంకెళేస్తే చాలునా
హేహే... లలలలలా... 



చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా




చరణం 2 :



ప్రేమ తాపం బయటపడ్డది పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీపైనా
ప్రేమ తాపం బయటపడ్డది పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీపైనా



తాపమారినా ప్రేమలోనా తనివితీరునా ఎవరికైనా


చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా




చరణం 3 :


అద్దమల్లే నిలుపుకున్నా నిన్ను ముద్దుగా నాలోనా
అద్దమల్లే నిలుపుకున్నా నిన్ను ముద్దుగా నాలోనా
అందమంతా చూసుకున్నా రోజురోజూ నీలోనా
అందమంతా చూసుకున్నా రోజురోజూ నీలోనా


నిన్ను నేను చూడగానే నేను లేను నాలోనా
నిన్ను నేను చూడగానే నేను లేను నాలోనా
నన్ను నేనే పెంచుకున్న నీకు తెలియక నీలోనా
అహహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ 




చెయ్యి పడ్డది చెంప పైన... దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...  తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...  తాననతందానా


తానతందానా.... తాననతందానా
హోయ్.. తానతందానా.... తాననతందానా









ఓహో తమరేనా






చిత్రం : కన్నెమనసులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 



పల్లవి :


ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు


అమ్మమ్మ... అమ్మమ్మా ... అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు



చరణం 1 :



సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా


ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా
మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..
వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి...  డూ డూ డూ బసవన్నా



ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు






చరణం 2 :



అలుగుట తగదురా పెళ్ళి కుమారా
హాస్యములాడితిరా వలపుల చోరా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెలరేగి నీ భరతం పట్టిస్తారా



ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు





చరణం 3 :


మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు
ఆపైన క్లోజు పడుతుంది బూజు
ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు





ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు