Monday, August 31, 2020

సిగ్గుకు సిగ్గేస్తే



చిత్రం : జీవితమే ఒక నాటకం (1977)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత : 
నేపథ్య గానం : బాలు, సుశీల   





పల్లవి :


ఏయ్.. ఏయ్...
సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది
సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది
ఏం చేస్తుంది... ఏం చేస్తుంది.. ఏం చేస్తుంది


చెంపల్లో దూరుతుంది.. పైట చెంగుపై దూకుతుంది
చెంపల్లో దూరుతుంది.. పైట చెంగుపై దూకుతుంది
చిన్నారి సన్నాయి నడుముతో చెడుగుడు చెడుగుడు
చెడుగుడులాడుతుంది



సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది
సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది



చరణం 1 :


కాడి కట్టని కోడెగిత్తతో.. ముక్కుతాడు వేసి లాగుతు ఉంటే
కాడి కట్టని కోడెగిత్తతో.. ముక్కుతాడు వేసి లాగుతు ఉంటే
ఒళ్ళు విరిచే నీలిమబ్బునూ ఒక అల్లరి గాలి తరుముతు ఉంటే


అది లాగిన కొద్ది తిరగబడుతుంది...
అది లాగిన కొద్ది తిరగబడుతుంది...
ఇది సాగిన కొద్దీ మోజు పుడుతుంది



ఆ మోజుకు మోజొస్తే ఆ మోజేం చేస్తుంది
ఆ మోజుకు మోజొస్తే ఆ మోజేం చేస్తుంది
ఏం చేస్తుంది... ఏం చేస్తుంది.. ఏం చేస్తుంది


కలవర పెట్టేస్తుంది.. ముళ్ళ కంచెలు దూకేస్తుంది
కలవర పెట్టేస్తుంది.. ముళ్ళ కంచెలు దూకేస్తుంది
పిడుగులాంటి పడుచువాణ్ణి తడతడతడలాడేస్తుంది


ఆ మోజుకు మోజొస్తే ఆ మోజేం చేస్తుంది
ఆ మోజుకు మోజొస్తే ఆ మోజేం చేస్తుంది


చరణం 2 :


ఈ చినుకులతో వేగలేననీ... నీ చిగురు మేను ఎగురుతుంటే
ఈ చినుకులతో వేగలేననీ... నీ చిగురు మేను ఎగురుతుంటే
ఈ పడుచుదనం దాచలేననీ... నీ గడుసుపైట గుసగుసమంటే


ఆ పిలుపులు వింటే పెదవి పులకిస్తుంది
ఆ పిలుపులు వింటే పెదవి పులకిస్తుంది
అది పులకిస్తేనే ముద్దు మొలకేస్తుంది


ఆ ముద్దుకు ముద్దిస్తే ఆ ముద్దేం చేస్తుంది
హా.. ఆ ముద్దుకు ముద్దిస్తే ఆ ముద్దేం చేస్తుంది
ఏం చేస్తుంది... ఏం చేస్తుంది.. ఏం చేస్తుంది


హాయ్...నిద్దర కాజేస్తుంది... కొత్త ముద్దర వేసేస్తుంది
నిద్దర కాజేస్తుంది... కొత్త ముద్దర వేసేస్తుంది
నడిరాతిరి గుండెల దూరి గడబిడ గడబిడ గడబిడ చేసేస్తుంది



సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది
సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4894

Saturday, August 29, 2020

చిలకమ్మా... హే చిలకమ్మా



చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత : సాహితి
నేపథ్య గానం : ఆనంద్, జానకి   



పల్లవి :



చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి


మొనగాడా... హే జతగాడా
మొనగాడా... హే జతగాడా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను 


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా



చరణం 1 :


కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
సిగ్గంతా వగ్గేసి దగ్గరగా రావాలి


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
కలిపావు చేయి కలిసావు జోడి... ఆడావు నాతో చేరి



చరణం 2 :


కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
చన్నీటి జలకాల చల్లార్చుకోమంది 


మొనగాడా... హే జతగాడా
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను


చిలకమ్మా... హే చిలకమ్మా
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9607

ఈ నవనవలాడే నవ్వులు



చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం : జానకి, రామకృష్ణ 



పల్లవి :



ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే దోచావులే
ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూసానులే మనసే దోచావులే 


లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్



చరణం 1 :


తియ్యని సుఖం... ఇక తెలియదు జగం
తియ్యని సుఖం... ఇక తెలియదు జగం
వయసు పొంగులే ఉన్నాయి...  నన్ను అందుకోమని పిలిచాయి
వయసు పొంగులే ఉన్నాయి...  నన్ను అందుకోమని పిలిచాయి
ఒంటిగా నేను కల గంటుంటే...  కొంటెగా జంట చేరాను 


ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే  దోచావులే 


లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్



చరణం 2 :


ప్రేమే కలా... అది రంగుల వలా
ప్రేమే కలా... అది రంగుల వలా
పువ్వులోనే తేనుంటుంది...  ఆ తేనెకోసమే తేటుంది
పువ్వులోనే తేనుంటుంది...  ఆ తేనెకోసమే తేటుంది
పరిచయం మనకు కలిగిన నాడే... ప్రణయమే తలుపు తట్థింది


ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే దోచావులే 


లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్
లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్
లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్



Wednesday, August 26, 2020

నీకూ నీవారు లేరు



చిత్రం :  సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం :   చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం : సుశీల, బాలు



పల్లవి :


ఆ.. ఆ.. ఆ.. ఆ
నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు
ఆసరాగా నాకు దొరికావు... నా ఆశలన్నీ నిజం చేశావు


నీకూ నీవారు లేరు... 



చరణం 1 :


ఆ... ఆ... ఆ... ఆ...
దారిలోని గడ్డిపువ్వు నలిగిపోయే వేళ నువ్వు
మల్లె పువ్వుగ మార్చి వేశావు..
నీ మనసులోనే దాచివేశాను


నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు


చరణం 2 :


రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్ర యాత్ర చేస్తే...
రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్ర యాత్ర చేస్తే...
పక్షులే మన పాట వింటాయి... మబ్బులే పరదాలు కడతాయి
ఈ మబ్బులే పరదాలు కడతాయి


నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు


చరణం 3 :


ఆ... ఆ... ఆ... ఆ...


కప్పులేనీ ఇంటిలోనా గడప లేని పడక గదిలో
కప్పులేనీ ఇంటిలోనా గడప లేని పడక గదిలో
చందమామా తొంగి చూస్తాడు... అందమంతా ఒలకబోస్తాడు
తన అందమంతా ఒలకబోస్తాడు


నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు
ఆసరాగా నాకు దొరికావు...
నా ఆశలన్నీ నిజం చేశావు
నా ఆశలన్నీ నిజం చేశావు



నీకూ నీవారు లేరు



చిత్రం :  సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం :   చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం :  బాలు



పల్లవి :


ఉ... ఉ...  ఉ..
నీకూ నీవారు లేరు...  నాకూ నావారు లేరు
ఏవంటావు...
హా... హా.. హా.. ఒహొ....అహహా
నీకు నేనూ...  నాకు నువై ఉందామా.. ఉందామా


నీకూ నీవారు లేరు.. నాకూ నావారు లేరు
నీకు నేనూ...  నాకు నువై ఉందామా.. ఉందామా


నీకూ నీవారు లేరు.. నాకూ నావారు లేరు
నీకు నేనూ...  నాకు నువై ఉందామా.. ఉందామా


చరణం 1 :


సుక్కల్లా సీర గట్టి ... సక్కంగా కొప్పు పెట్టి
సుక్కల్లా సీర గట్టి ... సక్కంగా కొప్పు పెట్టి
టిక్కుటాకు టక్కు... ఆ టక్కుటిక్కు టిక్కు అని నడిసెళ్తన్నావే


పక్క సూపూ సూడనంటావ్... పలకనైనా పలకనంటావ్
పక్క సూపూ సూడనంటావ్... పలకనైనా పలకనంటావ్
సెప్పి పోవే సిన్నదానా... ఎక్కడుంటావ్... నువ్వెక్కడుంటావ్


ఆ... నీకూ నీవారు లేరు.. నాకూ నావారు లేరు
నీకు నేనూ నాకు నువై ఉందామా.. ఉందామా



చరణం 2 :


ఒళ్ళేడా వాడ లేదు... పెళ్ళైనా జాడ లేదు
ఒళ్ళేడా వాడ లేదు... పెళ్ళైనా జాడ లేదు
కళ్ళు రెండు సేపలల్లే తుళ్ళితుళ్ళీ పడుతున్నాయ్
కళ్ళు రెండు సేపలల్లే తుళ్ళితుళ్ళీ పడుతున్నాయ్
సేపలాగే జారుకుంటావ్... చిక్కమేస్తే చిక్కనంటావ్



సెప్పిపోవే మరదలు పిల్లా... ఎప్పుడొస్తావ్... మళ్ళేప్పుడొస్తావ్
ఎప్పుడంటావ్.. పెళ్ళెప్పుడంటావ్
 

ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీకూ నీవారు లేరు.. నాకూ నావారు లేరు
నీకు నేనూ... నాకు నువై ఉందామా.. ఉందామా




Tuesday, August 25, 2020

ఎగరేసిన గాలిపటాలు

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్   



పల్లవి :


ఎగరేసిన గాలిపటాలు
దొంగాట దాగుడుమూతలూ
గట్టు మీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ


గోళీలు గోటీబిళ్ళ... ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలురాళ్ళు



చరణం 1 :


పడగొట్టిన మావిడికాయ... పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్



చరణం 2 :



దసరాలో పువ్వుల బాణం... దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు


నులివెచ్చని భోగిమంటా... మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు... పంచుకున్న కొబ్బరి ముక్క


గొడమీద రాసిన రాతలు...వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు... చిత్త స్వాతి వానజల్లు


చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలిరాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు




సరే సరే ఓరన్నా

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


సరే సరే ఓరన్నా... సరే సరే
పిలిచి పిలిచి ఇంకా వేధించనులే
గుండె కలచి కలచి నిన్ను బాధించనులే


సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే



చరణం 1 :


వెర్రిగాలి వీచినప్పుడు... వెదురైనా పాడుతుంది
నల్లమబ్బు పట్టినప్పుడు... నెమిలైనా ఆడుతుంది
నీ నేస్తం నీ కోసం చావు కేక వేస్తే... పలుకనైన పలకవు
రాయిలా... ఉలకనైన ఉలకవు



సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే



చరణం 2 :



అనుక్షణము నీ పేరే తలుచుకుంటాను
మనసులోన నీ ఊసే మలుచుకుంటాను
అనుక్షణము నీ పేరే తలుచుకుంటాను
మనసులోన నీ ఊసే మలుచుకుంటాను  


నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను
 


పిలిచి పిలిచి ఇంకా వేధించనులే
గుండె కలచి కలచి నిన్ను బాధించనులే
సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7233

పోనీరా పోనీరా పోనీరా

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు 


పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా



చరణం 1 :


ఎంత మబ్బు మూసినా... ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత మబ్బుమూసినా... ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే ఉంటుంది


ఎంత ఏడుపోచ్చినా... ఎంత గుండెనొచ్చినా
ఎంత ఏడుపోచ్చినా... ఎంత గుండెనొచ్చినా
నీలోపల ఉద్దేశం... ఒకలాగే ఉండాలి
నీలోపల ఉద్దేశం... ఒకలాగే ఉండాలి


పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా




చరణం 2 :


కష్టాలే కలకాలం... కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై... వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం... కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై... వస్తూ పోతుంటాయి


వెళ్ళాలి బహుదూరం... మోయాలి పెనుభారం
వెళ్ళాలి బహుదూరం... మోయాలి పెనుభారం
ఏమైనా కానీరా..మన యాత్ర మానం
ఏమైనా కానీరా..మన యాత్ర మానం


పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు 


పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7295


నవ్వు వచ్చిందంటే కిలకిల

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల


గోదారి పాడింది గలగలా... ఆ.. ఆ..
గోదారి పాడింది గల గలా...
దానిమీద నీరెండ మిల మిల మిల 


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల



చరణం 1 :


నది నిండా నీళ్ళు ఉన్నా... మనకెంత ప్రాప్తమన్నా
నది నిండా నీళ్ళు ఉన్నా... మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే... గరిటైతే గరిటెడు నీళ్ళే
కడవైతే కడివెడు నీళ్ళే... గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే... ఏ.. ఏ.. ఏ..
ఎవరెంత చేసుకుంటే... అంతే కాదా దక్కేది


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల..



చరణం 2 :


ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
ఆ.. అ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా


కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల


చరణం 3 :


తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే... ఏ..ఏ...ఏ
పరులకింత పెట్టినదే...  పరలోకం పెట్టుబడి


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వల వల
గోదారి పాడింది గల గల
కథలెన్నో చెప్పింది ఇలా ఇలా


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7231

Sunday, August 23, 2020

అన్నా... విన్నా... పాపమే

చిత్రం : అపరాధి (1982)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ   



పల్లవి :


అనసూయా... లల లల హా హా.. హుహు హూ హా హా..
లాలా లలలా లలలా హ హ...


అన్నా... విన్నా... పాపమే...
అనసూయా అసూయెందుకే... ఇదిగో


అవ్వా... అంతా మోసమే...
మగబుద్ధి అన్నారందుకే...
సందెకాడ కోపం... చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ రాజీకి రానంటే పాపం... హా


చరణం 1 :


పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?


పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం
వన్నెల విసన కర్రలతోన వ్యవహారం

పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?

పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం 

వన్నెల విసన కర్రలతోనా వ్యవహారం 


నోట్లో వేలు కొరకని వాణ్ని
నిన్నే తప్ప ఎరగని వాణ్ని
నీ భామా కలాపాలు చూశాలే 

అవ్వా అంత మోసమే
మగ బుద్ధి అన్నారందుకే


సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ
రాజీకి రానంటే పాపం... హా


చరణం 2 :


మమతలన్ని మనువు చేసి భర్తనైనానే

మమతలన్ని మనువు చేసి భర్తనైనానే


నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే
నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే


అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం
అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం


అన్నా విన్నా పాపమే
అనసూయా...  అసూయెందుకే

సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం..
రాజీకి రానంటే... పాపం...


లల..లల..లలలా..
ల లా లా ల ల లా 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13005

Tuesday, August 18, 2020

గతిలేని వాణ్ణి

చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపథ్య గానం : తలత్ మహమూద్, సుశీల   



పల్లవి :


గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య
గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్య
గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య 


చరణం 1 :


ప్రేమతోడ లోకమేను దేవుడు
ప్రేమతోడ లోకమేను దేవుడు
మా మొగాన మరణమైన రాయడు
మా మొగాన మరణమైన రాయడు

చావలేము బతకలేము బాబయ్యా
గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్య
గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య



చరణం 2 :


ఆకలి చికాకుతోడ వేగుతూ...
ఆకలి చికాకుతోడ వేగుతూ...
చీకటి జగాన బతుకు జీవులం
చీకటి జగాన బతుకు జీవులం
చీదరించుకోకు బాబు నీ దయా


చీదరించుకోకు బాబు నీ దయా

గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్య
గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య

Monday, August 17, 2020

చందామామా రావే

చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం :  సుశీల   


పల్లవి :


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే 


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే 


చందామామా రావే జాబిల్లి రావే



చరణం 1 :


వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే


వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే
అందాలా పాపకు అందించి పోవే


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే



చరణం 2 :



తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే


తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే
అందాల పాపకు అందించి పోవే


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే




మరచి పోయేవేమో

చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్, సుశీల   




పల్లవి :


మరచి పోయేవేమో మాయని బాసలూ... మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ...  ఆశలు మాసినా 



చరణం 1 :


వెలిగేను నీ కులుకే నా కన్నుదోయి
మెలిగేను నా మదిలో నీ చెలిమి హాయి
వెలుగొందు ఆ తారలాగా


మాయని బాసలూ మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా



చరణం 2 :


విరబూసే ఈ పువ్వు నీ పూజ కొరకే
విసిరేవు దూరముగా వసి వాడునోయీ
నీ దాన ఏనాటికైనా..


మాయనీ బాసలూ మనకివే ఓ సఖా
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా


అందాల సీమా

చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్ 




పల్లవి :


అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం


అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం



చరణం 1 :


వలపేమో తెలియకా తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలయైనా
మాయనీ గాయమై మిగిలినా అభినయం
మాయనీ గాయమై మిగిలినా అభినయం  


అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం



చరణం 2 :


అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసులా ఆనందమున తేలే
తీయనీ అనుభవం దేవుని పరిచయం
తీయనీ అనుభవం దేవుని పరిచయం


అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం




Monday, August 10, 2020

పడమటింటిలో దీపం పెట్టి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి : 


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
పడమటింటిలో దీపం పెట్టి...
పాపికొండల  పావడగట్టి...
కడలి చిందుల గజ్జలు కట్టి...
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది



వేయి పడవల వెన్నెల పట్టి...
అలల నురుగుల ముగ్గులు పెట్టి...
కాపురానికి కౌగిలి పట్టి...
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది


చరణం 1 :


ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి
ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి 


నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే
నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే


తెల్లబోయి చూసింది ఆ గౌతమి
మల్లెపూలు జల్లింది మందాకిని
మలిసంధ్య ఇచ్చేటి తాంబూలం పుచ్చుకొని...


గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది



చరణం 2 :


లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది
లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది


కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కొమ్మల్లో నవ్వింది ఓ కోయిలా.. మత్తెక్కి ఝుమ్మంది ఓ తుమ్మెద


పెదవుల్ని కలిపేటి పేరంటానికి వచ్చి
గోదారి ఏమన్నది... ఇంక ఏమన్న విననన్నది
గోదారి ఏమన్నది... ఇంక అహహ.. ఉం.. ఉం... ఉ..




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7630

Saturday, August 8, 2020

ఎప్పట్లా గోదావరి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : సుశీల



పల్లవి : 


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది
పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది
కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది
ఈ పాపికొండ మిగిలింది


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



చరణం 1 :


వెనుకకు తిరగని కథలో... ముందుకు పోతే కడలి
కడలి తాను కలిసిందంటే... ఉండదు తల్లి గోదావరి
అంటరాని బాలికా అరుంధతి తారక..
అంటరాని బాలికా అరుంధతి తారక..
ఏ వశిష్టుడొస్తాడో నన్ను చేరగా...


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



చరణం 2 :


కలిసిన మనసులా గుడిలో...  గాలికి ఆరని దీపం
అలల మీద ఆడే పడవై... ఊగిసలాడే ఈ ప్రాణం
కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా
కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా
ఎన్నాళ్ళీ ఆశలూ.. గుండె కోతలు...


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది
పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది
కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది
ఈ పాపికొండ మిగిలింది


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



Friday, August 7, 2020

చిరంజీవి గోదావరి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు  




పల్లవి : 


చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ...
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 


మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి



చరణం 1 :



నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి


సీతమ్మ సిగలోనా మందారం చుట్టి...
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి  శ్లోకమై... శ్రీనాథుడి సీసమై


మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి



చరణం 2 :


చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి


కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై

మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి



చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 

మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి



Thursday, August 6, 2020

నేనెవరో అనామికనూ

చిత్రం :  సిరిమువ్వల సింహనాదం 
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు,  శైలజ 





పల్లవి : 



నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
తలపులు తెలుపని కోరికను...
ఏ తళుకులు తెలియని తారకను


నేనెవరో అనామికనూ... 


చరణం 1 :


బదులు దొరకని పొడుపు కథనై ఎదురు చూస్తున్నా
పెదవి కదపని పేద యెదనై ఎదుటనే ఉన్నా


చెలిమి చినుకే తొలకరిస్తే చిగురు తొడిగేను
మనసు తెలిసి పలకరిస్తే మంచు కరిగేను


నేనెవరో అనామికనూ


చరణం 2 :


దిశలు తెలిపే కలికి కెరటం పిలుపు వింటున్నా
నిశిని చెరిపే పసిడి కిరణం వెలుగు కంటున్నా 


గుండెలోతున గూటి కోసం కదిలి వస్తున్నా
గువ్వ జాడకు మువ్వ నవ్వులు కానుక ఇమ్మన్నా 


నేనెవరో అనామికను... నీ కథలో అభిసారికను
తీరము దొరికిన కోరికను...
నే ద్వారము తెరిచిన ద్వారకను....



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12506

Tuesday, August 4, 2020

కలువపూల చెంత చేరి

చిత్రం : ఏకవీర (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు 




పల్లవి : 


కలువపూల చెంత చేరి కైమోడుపు సేతును

నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని

మబ్బులతో ఒక్కమారు మనవి చేసికొందును

నా అంగన ఫాలాంగణమున ముంగురులై కదలాలని



చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని
పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును
నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని


ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా...
నా రమణికి బదులుగ ఆకారం ధరియించాలని